Home /News /technology /

Realme 9i: త్వరలో మార్కెట్లోకి Realme 9i.. స్పెసిఫికెషన్లు ఇవే..! ధర ఎంత ఉండొచ్చంటే!

Realme 9i: త్వరలో మార్కెట్లోకి Realme 9i.. స్పెసిఫికెషన్లు ఇవే..! ధర ఎంత ఉండొచ్చంటే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత స్మార్ట్ ఫోన్ (Smart Phone) మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న రియల్మీ (Realmi) నుంచి త్వరలోనే మరో కొత్త మోడల్ ఫోన్ విడుదల కానుంది. రియల్మీ 9ఐ (Realme 9i) పేరుతో ఇది రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ఇంకా చదవండి ...
భారత స్మార్ట్ ఫోన్ (Smart Phone) మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న రియల్ మీ (Realmi) నుంచి త్వరలోనే మరో కొత్త మోడల్ ఫోన్ విడుదల కానుంది. రియల్ మీ 9ఐ (Realme 9i) పేరుతో ఇది రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌ సెట్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్‌ లైన్‌లో లీకయ్యాయి. లీకేజీలని బట్టి చూస్తే.. రాబోయే రియల్ మీ  9ఐ హ్యాండ్‌ సెట్ సరికొత్త క్వాల్ కామ్ స్నాప్‌ డ్రాగన్ 680 4జీ చిప్‌ సెట్ పై పనిచేస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ గల డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను చేర్చనుంది. 2022 జనవరిలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రియల్మీ అధికారికంగా ఫోన్ లాంచింగ్ గురించి వివరాలను పంచుకోనప్పటికీ, జనవరిలో ఇది విడుదలయ్యే అవకాశం ఉందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. ది ప్రిక్సెల్ (వియత్నామీస్‌) నివేదిక ప్రకారం ఈ హ్యాండ్‌ సెట్ జనవరి 2022లో వియత్నాం మార్కెట్‌లోకి తొలుత విడుదల కానుంది. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి వస్తుంది. మరొక టిప్‌స్టర్ (@chunvn8888) రియల్మీ 9ఐ కొన్ని స్పెసిఫికేషన్లను ట్వీట్ చేశారు.

ఇది చదవండి: రూ.15,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇవే బెస్ట్ మోడల్స్


కాగా, గతంలో రియల్మీ 9ఐ రెండర్లు కూడా ఆన్‌ లైన్‌లో లీకయ్యాయి. దీని డిజైన్ చూడటానికి రియల్మీ జీటీ నియో 2 తరహాలో ఉంటుంది. రెండర్ల ప్రకారం, దీని వెనుకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీంతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్, సింగిల్ స్పీకర్, యూఎస్బీ టైప్ సీ పోర్టుతో పాటు పంచ్ హోల్ డిప్లేను చేర్చనుంది.

ఇది చదవండి: అమెజాన్​లో ఐఫోన్ 12 ప్రోపై భారీ డిస్కౌంట్​.. ఏకంగా రూ. 25 వేల తగ్గింపు


రూ. 15 వేలలోపే ఉండే అవకాశం..
రియల్మీ 9ఐ స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏదేమైనప్పటికీ, రియల్మీ 8ఐ కంటే దీని స్పెసిఫికేషన్లు కొంచెం అప్ గ్రేడెడ్గానే ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్లో రియల్ మీ 8ఐ మార్కెట్లోకి వచ్చింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ గల దీని బేస్ వేరియంట్ రూ.13,999 వద్ద అందుబాటులో ఉంది. దీన్ని బట్టి రియల్ మీ 9ఐ ధర కూడా మనదేశంలో రూ.15 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

ఇది చదవండి: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్స్... కాసేపట్లో మోటో జీ31 సేల్


రియల్ మీ 8ఐ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇది 6.6 -అంగుళాల ఫుల్ హెచ్డీ-ప్లస్ డిస్‌ ప్లేతో వచ్చింది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G96 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ 128GB ఆన్‌ బోర్డ్ స్టోరేజ్ తో వచ్చింది. మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్ ను 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. రియల్ మీ 8ఐ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Published by:Purna Chandra
First published:

Tags: Realme, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు