Home /News /technology /

HERE ARE THE PRICE AND SPECIFICATION OF POCO X4 PRO 5G WHICH LOOK LIKE IPHONE FULL DETAILS HERE PRN GH

Poco X4 Pro 5G: పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఐఫోన్ లాంటి డిజైన్ తో అదిరిపోయే ఫీచర్లు

ప్రతీకాత్మకచిత్రం (image: Poco India)

ప్రతీకాత్మకచిత్రం (image: Poco India)

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో (POCO Mobiles) వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్ తో భారత్ లో తన మార్కెట్ ను విస్తరిస్తోంది. పోకో తాజాగా ఓ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ ను ఆవిష్కరించింది. పోకో X4 ప్రో 5G (Poco X4 Pro 5G) పేరుతో ఇది భారత మార్కెట్లోకి రిలీజైంది.

ఇంకా చదవండి ...
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో (POCO Mobiles) వరుస స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ తో భారత్లో తన మార్కెట్ను విస్తరిస్తోంది. పోకో తాజాగా ఓ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ ను ఆవిష్కరించింది. పోకో X4 ప్రో 5G (Poco X4 Pro 5G) పేరుతో ఇది భారత మార్కెట్లోకి రిలీజైంది. ఫిబ్రవరి 2022లో బార్సిలోనాలో జరిగిన MWC 2022 ఈవెంట్లో దీన్ని గ్లోబల్ మార్కెట్లోకి ఆవిష్కరించగా.. ఇప్పుడు భారత మార్కెట్లోకి తెచ్చింది. అయితే, గ్లోబల్ వేరియంట్తో పోలిస్తే భారతీయ వేరియంట్లో స్వల్ప మార్పులు చేసింది. గ్లోబల్ వేరియంట్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ ఉండగా, ఇండియా-స్పెసిఫిక్ వేరియంట్ 64 -మెగాపిక్సెల్ షూటర్‌ కెమెరా మాత్రమే ఉంటుంది. ఇది ఫ్లాట్-ఎడ్జ్‌లను కలిగి ఉంటుంది. దీనిలో ఐఫోన్ 12, ఐఫోన్13 సిరీస్‌లతో సమానమైన డిజైన్ ను అందించింది.

భారత్ లో పోకో X4 ప్రో 5G ధర

పోకో X4 ప్రో 5G మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎల్లో, లేజర్ బ్లూ, లేజర్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంటుంది. దీని అమ్మకాలు ఏప్రిల్ 5 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమవుతాయి. ఇది మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 6GB RAM + 64GB స్టోరేజ్ రూ. 18,999 వద్ద, 6GB RAM + 128GB స్టోరేజ్ రూ. 19,999 వద్ద, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.21,999 వద్ద అందుబాటులో ఉంటాయి. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు రూ. 1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ను పొందవచ్చు. పోకో X2, పోకో X3, పోకో X3 ప్రో వంటి పోకో X -సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అదనంగా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు.

ఇది చదవండి: త్వరలోనే మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ఆర్ స్మార్ట్‌ ఫోన్.. రిలీజ్ కు ముందే లీకైన ఫీచర్లు.. మీరూ ఓ లుక్కేయండి..


పోకో X4 ప్రో 5G స్పెసిఫికేషన్లు
పోకో X4 ప్రో 5G 6.67-అంగుళాల సూపర్ AMOLED ప్యానెల్‌తో వస్తుంది. ఇది 120Hz అధిక రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది క్వాల్ కామ్ స్నాప్‌ డ్రాగన్ 695 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్తో వస్తుంది. వినియోగదారులు మైక్రో ఎస్డీ కార్డ్‌తో ఇంటర్నల్ మెమరీని 1TB వరకు విస్తరించవచ్చు. పోకో X4 ప్రో 5G 67W MMT సోనిక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో కూడిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ 50 శాతానికి చేరుకుంటుందని పోకో పేర్కొంది. ఎంఎంటీ స్ప్లిట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫోన్ హీటింగ్ ను నిరోధిస్తుంది.
Published by:Purna Chandra
First published:

Tags: POCO, POCO India, Smartphones

తదుపరి వార్తలు