Twitter New Features: ట్విట్టర్లో కొత్త ఫీచర్లు.. ఆకట్టుకుంటున్న అప్‌డేట్స్

ట్విట్టర్ లోగో

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ (Twitter) రెండు స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

  • Share this:
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ రెండు స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఒక‌టి ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ ఫ్రెండ్స్ త‌ర‌హాలో ట్ర‌స్ట్‌డ్ ఫ్రెండ్స్ అనే ఫీచ‌ర్‌ను, అలాగే ట్వీట్ల‌ను కేట‌గిరైజ్ చేయ‌డానికి ఫేస్ ఇట్ ఫీచ‌ర్‌ను తీసుకురానుంది. ఈ మేర‌కు వీటి డిజైన్ల‌ను ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది. స‌హ‌జంగా ట్విట్ట‌ర్ ఒక ఓపెన్ ఫ్లాట్‌ఫామ్‌. ఇందులో మ‌న‌మేదైనా ట్వీట్ చేస్తే అంద‌రూ దీనిని చూసే అవ‌కాశం ఉంటుంది. దీనివ‌ల‌న యూజ‌ర్లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ అని రెండు ర‌కాల ఎకౌంట్ల‌ను ఓపెన్ చేసుకుని తమ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. ఇక కొన్ని సంద‌ర్భాల‌లో మ‌నం చేసే ట్వీట్లు కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే చూస్తే చాల‌ని అనుకుంటాం. ఇలాంట‌ప్పుడు ట్విట్ట‌ర్‌లో మ‌హా ఇబ్బందిగా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌న స్టోరీలు మ‌నం ఎంచుకున్న క్లోజ్ ఫ్రెండ్స్ మాత్ర‌మే చూసే ఫీచ‌ర్ ఉంది. ఈ ఫీచ‌ర్ త‌ర‌హాలోనే ట్విట్ట‌ర్‌లోనూ ట్ర‌స్ట్ డ్ ఫ్రెండ్స్ ను తీసుకురావాల‌ని ట్విట్ట‌ర్ ఫిక్స్ అయింది.

ఇది నిజంగా యూజ‌ర్ల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొన్నిసార్లు మ‌నం చేసే ట్వీట్ల‌ను కొంద‌రుచూడ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా కోరుకుంటాం. అది మ‌న ఆఫీసువాళ్ళ‌యినా, లేదా మ‌న స‌న్నిహితులైనా స‌రే ఆ ట్వీట్‌ను చూడ‌కూడ‌ద‌నుకుంటాం. యూజ‌ర్ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ట్విట్ట‌ర్ ఈ ట్ర‌స్ట్‌డ్ ఫ్రెండ్స్ ఫీచ‌ర్‌ను తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టిదాకా త‌మ అభిప్రాయాల‌ను పంచుకోవ‌డానికి రెండు ఎకౌంట్లు వాడుతున్న యూజ‌ర్లు ఈ ఫీచ‌ర్ కార‌ణంగా ఇక‌పై ఇలా రెండు ఎకౌంట్ల‌ను మెయింటైన్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

మీ ట్వీట్ల‌ను మీకు న‌చ్చేవారు మాత్ర‌మే చూసేలా చేయ‌డం, రెండు ర‌కాల అకౌంట్ల గొడ‌వ లేకుండా పోతుంది. ట్ర‌స్ట్‌డ్ ఫ్రెండ్స్ ఫీచ‌ర్ వ‌ల‌న ఇక‌పై మీరు ఎవ‌రితో మాట్లాడాల‌నుకుంటున్నారో వారితో తేలిక‌గా మాట్లాడే సౌల‌భ్యం క‌లుగుతుంది. మీరు ఎంపిక చేసుకున్న గ్రూపు మాత్ర‌మే మీ ట్వీట్ చూడ‌గ‌లుగుతుంది. బ‌హుశా.. ట్ర‌స్ట్‌డ్ ఫ్రెండ్స్ చేసే ట్వీట్ల‌ను కూడా మీరే మొద‌ట చ‌ద‌వ‌గ‌లిగే అవ‌కాశమూ ఉండొచ్చు అంటూ ఈ స‌రికొత్త ఫీచ‌ర్ల ఎర్లీ డిజైన్స్ గురించి ట్విట్ట‌ర్ డిజైన‌ర్ ఆండ్రూ కోర్ట‌ర్ రాశాడు. అలాగే యూజ‌ర్లు త‌మ‌కు న‌చ్చ‌ని కామెంట్ల‌ను, ప‌ద‌బంధాలు వారి కంట‌ప‌డ‌కుండా కామెంట్ బాక్స్‌లో అవి చిట్ట‌చివ‌ర‌కు చేరిపోయేలా చేసే ఫీచ‌ర్ గురించి కూడా ఆలోచిస్తున్న‌ట్టు ఆండ్రూ కోర్ట‌ర్ తెలిపాడు.

యూజ‌ర్లు త‌మ కంటెంట్‌ను ఎవ‌రితో పంచుకోవాల‌నుకుంటున్నారో ఎంచుకునే అవ‌కాశం ట్విట్ట‌ర్ క‌ల్పిస్తోంది. అలాగే ట్వీట్ల‌ను కేట‌గిరైజ్ చేసే ఫెసెట్స్‌ను తీసుకురాబోతోంది. ఇది మీ ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ ఎకౌంట్ల కేట‌గిరైజేష‌న్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అమెరిక‌న్ టెక్నాట‌జీ న్యూస్ వెబ్‌సైట్ ది వ‌ర్జ్ పేర్కొంది.
Published by:Purna Chandra
First published: