హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: మీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను మరింత సెక్యూర్ చేసే 5 అద్భుతమైన ఫీచర్లు ఇవే..!

Instagram: మీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను మరింత సెక్యూర్ చేసే 5 అద్భుతమైన ఫీచర్లు ఇవే..!

ఇన్స్టాగ్రామ్ (Instagram)
అక్టోబర్, 2021 నాటికి భారతదేశంలో 201 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ వాయిస్ ఎఫెక్ట్, టెక్స్ట్ టు స్పీచ్, లింక్ స్టిక్కర్ ఆప్షన్ వంటి అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ కూడా దాని విజయానికి కారణం. యాప్ ద్వారా యూజర్లు కూడా డబ్బు సంపాదించవచ్చు.

ఇన్స్టాగ్రామ్ (Instagram) అక్టోబర్, 2021 నాటికి భారతదేశంలో 201 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ వాయిస్ ఎఫెక్ట్, టెక్స్ట్ టు స్పీచ్, లింక్ స్టిక్కర్ ఆప్షన్ వంటి అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ కూడా దాని విజయానికి కారణం. యాప్ ద్వారా యూజర్లు కూడా డబ్బు సంపాదించవచ్చు.

సోషల్ మీడియా (Social Media) దిగ్గజం ఫేస్ బుక్ (Facebook) యాజమాన్యంలోని ఇన్ స్టాగ్రామ్ (Instagram) కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు.

సోషల్ మీడియా (Social Media) దిగ్గజం ఫేస్ బుక్ (Facebook) యాజమాన్యంలోని ఇన్ స్టాగ్రామ్ (Instagram) కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇన్ స్టాను వాడుతుంటారు. ఇటీవలే ఇన్ స్టా రీల్స్ (Insta Reals) పేరుతో సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తోంది. యూజర్లు తమ ఖాతాలపై మెరుగైన నియంత్రణ కలిగి ఉండటానికి, తెలియని వ్యక్తులను నిరోధించడానికి అనేక ఫీచర్లను జోడించింది. ఈ ఫీచర్ల సహాయంతో యూజర్లు తమ కామెంట్స్, లైక్స్ ను ఇతరులకు కనిపించకుండా చేయవచ్చు. యాప్‌లోని "అభ్యంతరకరమైన" కామెంట్స్, యాక్టివిటీ స్టేటస్ ను కూడా ఆటోమేటిక్‌గా హైడ్ చేయవచ్చు. ఇన్స్టా అకౌంట్లను మరింత సెక్యూర్ చేసేందుకు ఇన్స్టాగ్రామ్లో ఉన్న 5 అద్భుతమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

ఇన్స్టాగ్రామ్లో 5 ప్రైవసీ ఫీచర్లు..

రిస్ట్రిక్టెడ్ అకౌంట్స్

మీ ఫాలోవర్ ఎవరైనా మీ పోస్టులను చూడకుండా నిరోధించడానికి ‘రిస్ట్రిక్టెడ్ అకౌంట్స్’ అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. మీ ఇన్‌స్టాగ్రామ్‌ సెట్టింగ్స్లో ‘రిస్ట్రిక్టెడ్ అకౌంట్స్’ అనే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఆన్ చేయడం ద్వారా సదరు వ్యక్తిని అన్ఫాలో లేదా బ్లాక్ చేయకుండానే మీ పోస్టులను చూడకుండా నిరోధించవచ్చు. ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేయడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా? లేదా? అనేది వారు తెలుసుకోలేరు.

ఇది చదవండి: సరికొత్త కలర్లో శామ్ సంగ్ గెలాక్సీ A52s 5జీ.., ఆ వేరియంట్లోనే లభ్యం


మెన్షన్స్

ప్రైవసీ సెట్టింగ్స్లో "మెన్షన్స్" అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేయడం ద్వారా ఇతరులు మీ స్టోరీస్, కామెంట్స్, లైవ్ వీడియోలు, క్యాప్షన్‌ చూడకుండా నిరోధించవచ్చు.

రిమూవ్ ఫాలోవర్స్

మీ ఫాలోవర్స్ ఎవరైనా మీ పోస్టులు, స్టోరీస్ను చూడకూడదనుకుంటే ‘రిమూవ్ ఫాలోవర్స్’ ఫీచర్ ఆన్ చేయండి. ఈ ఫీచర్ ద్వారా మీకు నచ్చని ఫాలోవర్స్ను తొలగించవచ్చు. దీన్ని ఆన్ చేసేందుకు.. మీ ఇన్స్టా యాప్‌ను ఓపెన్ చేసి మీ ప్రొఫైల్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ దిగువన ఉండే "ఫాలోవర్స్" ఆప్షన్పై ట్యాప్ చేయండి. మీరు ఎవరైనా ఫాలోవర్ను తొలగించాలనుకుంటే, సదరు అకౌంట్ పక్కన ఉండే "రిమూవ్" బటన్‌పై నొక్కండి.

ఇది చదవండి: వాట్సప్‌లో ఈ మార్పులు కనిపించాయా? అయితే మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టే


యాక్టివిటీ స్టేటస్

ఇన్‌స్టాగ్రామ్‌లో, మీరు ఆన్లైన్లో ఉన్నారా? లేదా? మీ లాస్ట్ సీన్ టైమ్ వంటివి కేవలం మీ ఫాలోవర్స్ మాత్రమే చూడగలుగుతారు. అయితే, ఈ ఫీచర్తో మీకు నచ్చని వ్యక్తులు మీ పోస్టులను చూడకుండా నిరోధించవచ్చు. దీని కోసం సెట్టింగ్‌లకు వెళ్లి, ప్రైవసీపై క్లిక్ చేయండి. ఆపై యాక్టివిటీ స్టేటస్ను డిజేబుల్ చేయండి.

ఇది చదవండి: అమెజాన్‌లో మ‌ళ్లీ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఆప్ష‌న్‌.. ధ‌రల వివ‌రాలు ఇవే


హైడ్ లైక్స్, టర్న్ ఆఫ్ కామెంట్స్

మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చేసే పోస్టులు, కామెంట్లు ఇతరులు చూడకుండా నిలిపివేయడానికి హైడ్ లైక్స్, టర్న్ ఆఫ్ కామెంట్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీన్ని ఆన్ చేసేందుకు మీ పోస్ట్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల బటన్‌ని నొక్కాలి. అక్కడ కనిపించే మెనూలో ఉన్న ‘హైడ్ లైక్స్, టర్న్ ఆఫ్ కామెంట్స్’ ఆప్షన్ ను డిసేబుల్ చేయండి.

Published by:Purna Chandra
First published:

ఉత్తమ కథలు