ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్‌సంగ్ (Samsung) ఇండియాలో సరికొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ప్రీమియం టీవీలను తీసుకొచ్చిన కంపెనీ టీవీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ దిగ్గజ కంపెనీ నుంచి నియో క్యూఎల్ఈడీ 8కే (Samsung Neo QLED 8K), నియో క్యూఎల్ఈడీ (Samsung Neo QLED) అనే సరికొత్త స్మార్ట్ టీవీలు భారత్‌లో లాంచ్ అయ్యాయి. 2022 నియో క్యూఎల్ఈడీ (Neo QLED) టీవీ సిరీస్‌లో భాగంగా శామ్‌సంగ్ వీటిని ఇండియాలో లాంచ్ చేసింది. వీటిలో అందించిన స్మార్ట్ ఫీచర్ల కారణంగా ఇవి ఒక టీవీ వలె కాకుండా ఒక గేమ్ కన్సోల్, ఒక వర్చువల్ ప్లేగ్రౌండ్, ఒక హోం కంట్రోలింగ్ స్మార్ట్ హబ్ గా పని చేస్తాయి. క్యూఎల్ఈడీ 8కే టీవీ 65 అంగుళాల నుంచి 85-అంగుళాల వరకు వివిధ డిస్‌ప్లే సైజులతో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, క్యూఎల్ఈడీ టీవీ 50 అంగుళాల నుంచి 85-అంగుళాల డిస్‌ప్లే సైజులతో లభిస్తుంది. వీటి ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శామ్‌సంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ టీవీ ధర
నియో క్యూఎల్ఈడీ 8కే 55-అంగుళాల స్మార్ట్ టీవీ స్టార్టింగ్ ప్రైస్ రూ.3,24,990గా నిర్ణయించారు. కాగా నియో క్యూఎల్ఈడీ 50-అంగుళాల స్మార్ట్ టీవీ ధరను రూ.1,14,990గా నిర్ణయించారు. ఏప్రిల్ 30లోగా క్యూఎల్ఈడీ 8కే స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి రూ.1,49,900 విలువైన శామ్‌సంగ్ సౌండ్‌బార్, రూ.8,900 ఖరీదైన స్లిమ్‌ఫిట్ క్యామ్ ఉచితంగా లభిస్తుంది. ఇదే సమయంలోపు క్యూఎల్ఈడీ టీవీ కొనుగోలు చేసేవారికి కేవలం ఒక స్లిమ్‌ఫిట్ క్యామ్ మాత్రమే ఫ్రీగా వస్తుంది.
శామ్‌సంగ్ నియో క్యూఎల్ఈడీ 8K, నియో క్యూఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు
శామ్‌సంగ్ నియో క్యూఎల్ఈడీ టీవీలు హై క్వాలిటీ ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టంతో సహా స్లిమ్ & స్లీక్ (Slim And Sleek) డిజైన్‌తో వస్తాయి. నియో క్యూఎల్ఈడీ టీవీలో క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రో (Quantum Matrix Technology Pro) వాడారు. ఈ టెక్నాలజీ వల్ల కలర్స్ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. క్యూఎల్ఈడీ 8కే టీవీలో ఇచ్చిన న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 8కే (Neural Quantum Processor 8K) వ్యూయింగ్ యాంగిల్స్, పిక్చర్ డెప్త్, డిస్‌ప్లే క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే బిల్ట్-ఇన్ లాట్ హబ్‌తో టీవీ ద్వారా నేరుగా ఇంటిలో స్మార్ట్ డివైజ్‌లను కంట్రోల్ చేయొచ్చు.
యూజర్లు ఒక స్లిమ్‌ఫిట్ క్యామ్ తో ద్వారా టీవీ స్క్రీన్‌పై వీడియో కాలింగ్ లేదా వెబ్ మీటింగ్స్ ఎంజాయ్ చేయొచ్చు. నియో Qled 8K ఒక 90W 6.2.4 ఛానల్ ఆడియో సిస్టంతో వస్తుంది. డాల్బీ అట్మోస్(Dolby Atmos)కు సపోర్ట్ చేసే ఇది 3D సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్రో (Object Tracking Sound Pro)తో వస్తుంది. గేమర్స్ కోసం 144 Hz రిఫ్రెష్ రేటు వరకు ఇందులో అందించారు. ఇది గేమర్స్ సులభంగా జూమ్-ఇన్ మోడ్, అల్ట్రా వైడ్ వ్యూల మధ్య టోగుల్ను సులభంగా ఆప్టిమైజ్ చేయడానికి అనుమతించే ఒక గేమ్ బార్ (Game Bar) కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలు 10 ఏళ్ల స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీతో వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.