జీమెయిల్ (Gmail) అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ స్పామ్ ఈమెయిల్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఇన్‌బాక్స్ నిండా ఇవే ఎక్కువగా కనిపిస్తూ ముఖ్యమైన ఈమెయిల్స్ కనుగొనడాన్ని కష్టతరం చేస్తుంటాయి. ఇవి డేంజరస్ కూడా. అందుకే స్పామ్ మెయిల్స్ డిలీట్ చేసుకోవాలని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. ఇవి కుప్పలు తెప్పలుగా వచ్చి ఇన్‌బాక్స్‌లో చేరుతుంటాయి కాబట్టి వీటిని డిలీట్ చేయడం కూడా పెద్ద సవాల్‌గా ఉంటుంది. అయితే స్పామ్ ఈ-మెయిల్స్‌ను ఎదుర్కోవడానికి సెండర్‌ను ఆపడం, సబ్‌స్క్రిప్షన్ తీసివేయడం లేదా వాటిని ఫిల్టర్ చేసి పెద్దమొత్తంలో డిలీట్ చేయడం వంటి సులుభమైన మార్గాలు ఉన్నాయి. వీటిని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.
* Gmailలో స్పామ్ ఈమెయిల్స్ బ్లాక్
Gmailలో స్పామ్ ఈమెయిల్స్‌ను బ్లాక్ చేయడానికి, ఏదైనా ఒక స్పామ్ ఈమెయిల్ ఓపెన్ చేయాలి. ఆ ఈ-మెయిల్ టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న "More" లేదా i ఐకాన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సెండర్ భవిష్యత్తులో మీకు ఈమెయిల్స్ పంపకుండా ఆపడానికి "బ్లాక్"పై క్లిక్ చేయాలి. బ్లాక్ చేశాక సెండర్ నుంచి మీ స్పామ్ ఫోల్డర్‌కి అన్ని మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా అదే లిస్ట్‌కు సెండ్ అవుతాయి. ఒకవేళ అనుకోకుండా ఎవరినైనా బ్లాక్ చేస్తే, వారిని అన్‌బ్లాక్ చేయవచ్చు.
* సబ్‌స్క్రిప్షన్ తీసివేయడం
Gmailలో మాస్ ఈమెయిల్స్ నుంచి సబ్‌స్క్రిప్షన్ తీసివేయడానికి, మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటున్న సెండర్ ఈ-మెయిల్ ఓపెన్ చేయాలి. సెండర్ పేరు పక్కన ఉన్న "అన్‌సబ్‌స్క్రైబ్" లేదా "చేంజ్ ప్రిఫరెన్సెస్" ఆప్షన్ సెలక్ట్ చేయాలి. ఇక్కడ మీరు మెసేజ్‌లను బ్లాక్ చేయవచ్చు లేదా వాటిని స్పామ్‌గా గుర్తించేలా సెట్ చేయవచ్చు. ఇలా ఎంచుకున్న కొద్ది రోజుల తర్వాత, సెండర్ మెయిల్స్ అన్‌సబ్‌స్క్రైబ్ అవుతాయి.
ఇది కూడా చదవండి : మీ ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారని డౌట్‌గా ఉందా..? అయితే ఇలా చెక్ చేసుకోండి..
* మాస్ డిలీట్ ఆప్షన్
పెద్దమొత్తంలో ఈ-మెయిల్స్ డిలీట్ చేయడానికి ఇన్‌బాక్స్ కేటగిరీని ఎంచుకుని, డౌన్ యారో నుంచి ఆల్ మెసేజెస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత "డిలీట్"పై క్లిక్ చేయాలి. నిర్దిష్ట కేటగిరీ నుంచి మెయిల్స్ డిలీట్ చేయడానికి, కేటగిరీ పేజీలో ఒక కేటగిరీని ఎంచుకుని, "డిలీట్" క్లిక్ చేయడానికి ముందు ఆల్ మెసేజెస్ చెక్‌బాక్స్ సెలెక్ట్ చేయాలి. చదవని స్పామ్ లేదా అనవసరమైన ఈమెయిల్స్‌ను తొలగించడానికి, సెర్చ్ బాక్స్‌లో "label:unread" లేదా "label:read" కోసం సెర్చ్ చేయాలి. అన్ని మెయిల్స్ ఎంచుకుని, డిలీట్ ఐకాన్‌ని క్లిక్ చేయాలి.
* స్పామ్ ఈమెయిల్స్ గుర్తించడానికి Gmail ఫిల్టర్స్
స్పామ్ ఈమెయిల్స్‌ను గుర్తించడానికి Gmail ఫిల్టర్స్ ఉపయోగపడతాయి. ఫిల్టర్స్ వాడటానికి ముందుగా జీమెయిల్ ఓపెన్ చేసి, సెర్చ్ బాక్స్‌లో అన్‌సబ్‌స్క్రైబ్ ఈమెయిల్స్ కోసం వెతకాలి. తర్వాత కనిపించే ప్రమోషనల్ ఈమెయిల్స్ లిస్ట్ నుంచి మీరు తొలగించాలనుకుంటున్న అన్ని స్పామ్ ఈమెయిల్స్ సెలక్ట్ చేయాలి. తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, "ఫిల్టర్ మెసేజెస్ లైక్ థిస్"పై క్లిక్ చేయాలి. భవిష్యత్తులో స్పామ్ ఈమెయిల్స్ కోసం మీరు తీసుకోవాలనుకుంటున్న యాక్షన్‌ను ఎంచుకోండి.
ఆ యాక్షన్‌లలో డిలీట్ ఇట్, మార్క్ యాస్ స్పామ్, మార్క్ యాస్ రీడ్ లేదా అప్లై లేబుల్ అనేవి ఉంటాయి. ఏదో ఒక ఫిల్టర్‌ను ఎంచుకున్నాక ‘క్రియేట్ ఫిల్టర్’పై క్లిక్ చేయాలి. అప్పుడు భవిష్యత్తులో ఇలాంటి అన్ని ఈ-మెయిల్స్ డిలీట్ అవుతాయి లేదా స్పామ్‌లోకి వెళ్లిపోతాయి. సెలక్ట్ చేసిన యాక్షన్ ప్రకారం ఇవి సైలెంట్ అయిపోతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.