విండోస్ (Windows) లేదా మ్యాక్ OS కంప్యూటర్లలో వీడియో కాల్ (Video Call) మాట్లాడుతున్నప్పుడు కాల్ క్వాలిటీ ఫోన్లో ఉన్నంత గొప్పగా ఉండకపోవచ్చు. అయితే ఒక సింపుల్ ట్రిక్‌తో స్మార్ట్‌ఫోన్(Smartphone)ను వెబ్‌క్యామ్ (Webcam)గా ఉపయోగించుకొని హైక్వాలిటీ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అని అందరూ అనుకుంటారు కానీ స్మార్ట్‌ఫోన్‌ను వెబ్ కెమెరాగా మార్చడం చాలా సింపుల్. కంప్యూటర్లో స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో కాల్ మాట్లాడాలంటే ఎలాంటి ప్రత్యేక కేబుల్స్ కూడా అవసరం లేదు. మీరు ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నా.. మీ స్క్రీన్‌ని షేర్ చేయాలనుకున్నా.. మీ స్మార్ట్‌ఫోన్‌ను కెమెరాగా మార్చితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఎలా ఉపయోగించాలి?
Reincubate Camo అనే యాప్ ద్వారా ఐఫోన్ , ఆండ్రాయిడ్ మొబైల్స్‌ను Mac లేదా Windows కంప్యూటర్లలో వెబ్‌క్యామ్‌గా ఉపయోగించవచ్చు. గూగుల్ మీట్, జూమ్, FaceTime, Discord, స్కైప్, ట్విచ్ ఇలా 40కి పైగా వీడియో-కాలింగ్ యాప్‌లలో ఈ Camo పని చేస్తుంది. ఈ Camo యాప్ 1080p రిజల్యూషన్‌తో అతి తక్కువ లేటెన్సీతో హై-క్వాలిటీ వీడియో ఫీడ్‌ను అందజేస్తుంది.
వెబ్‌క్యామ్‌గా ఫోన్‌ను మార్చడానికి మొదటగా Camo యాప్‌ను యాపిల్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆపై మొబైల్‌ను కంప్యూటర్లకు కనెక్ట్ చేయాలంటే MacOS, Windows యూజర్లు 'Camo Studio' సాఫ్ట్‌వేర్‌ని తమ సిస్టమ్‌లో డౌన్లోడ్ చేయాలి.
అనంతరం ఆన్‌స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ Camo యాప్ ద్వారా మీ మొబైల్‌ను Wi-Fi లేదా USB ద్వారా Camo Studioకి కనెక్ట్ చేయవచ్చు. మీ మొదటి సెషన్‌ను USB ద్వారా పెయిర్ చేస్తే మంచి వీడియో కాల్ క్వాలిటీ పొందొచ్చు. మీరు ఆండ్రాయిడ్ డివైజ్ ఉపయోగిస్తూ Windows కంప్యూటర్‌కు ఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా కనెక్ట్ చేయాలని చూస్తున్నట్లయితే.. Wi-Fi ద్వారా పెయిర్ చేయడం ఉత్తమం.
ఇది కూడా చదవండి : స్మార్ట్‌ఫోన్ ధరకే జియోబుక్ రిలీజ్... అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన ల్యాప్‌టాప్
ఇందుకు మీ కంప్యూటర్లో Camo Studioని ఓపెన్ చేసి.. లెఫ్ట్ సైడ్‌బార్‌లో డివైజ్ డ్రాప్‌డౌన్ పక్కన ఉన్న + బటన్‌ను నొక్కాలి. ఇది QR కోడ్‌ను డిస్ప్లే చేసే విండోను తెరుస్తుంది. ఆపై మీ మొబైల్ డివైజ్‌లోని Camoలో, టాప్ రైట్ కార్నర్లో ఉన్న వైర్లెస్ కనెక్షన్ బటన్‌ను నొక్కాలి. తర్వాత మీ కంప్యూటర్లో డిస్ప్లే అయిన QR కోడ్‌ను స్కాన్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ మొబైల్ కెమెరా నుంచి వీడియో ఫీడ్ Camo Studioకి ప్రసారమవుతుంది.
Camo Studio డెస్క్‌టాప్ యాప్ కంట్రోల్ హబ్‌గా పనిచేస్తుంది. ఇది ఫోన్‌ను టచ్ చేయాల్సిన అవసరం లేకుండానే మీ PC నుంచి బ్రైట్నెస్, కలర్ సాచురేషన్, ఫోకస్, మరిన్నింటిని నేరుగా అడ్జస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రైమరీ కెమెరాతో పాటు, అల్ట్రా-వైడ్ క్యామ్, టెలిఫొటో, సెల్ఫీ కెమెరాను ఉపయోగించడానికి కూడా యాప్ తగినన్ని ఫీచర్స్ అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Meeting, Smart phone, Smart phones, Tech news, Video