హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gadgets: సమ్మర్‌లో స్మార్ట్ గాడ్జెట్స్ హీట్ అవుతున్నాయా..? మీ డివైజ్‌లను సేఫ్‌గా, కూల్‌గా ఉంచే టిప్స్ పాటించండి..

Gadgets: సమ్మర్‌లో స్మార్ట్ గాడ్జెట్స్ హీట్ అవుతున్నాయా..? మీ డివైజ్‌లను సేఫ్‌గా, కూల్‌గా ఉంచే టిప్స్ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ వేసవిలో మీ గాడ్జెట్ల ఇంటర్నల్ పార్ట్స్ (Internal Parts) డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే సమ్మర్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్స్‌ను ప్రొటెక్ట్ చేయడానికి నిపుణులు కొన్ని టిప్స్ షేర్ చేసుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం.

ఇంకా చదవండి ...

భారతదేశంలో ఇప్పటికే సమ్మర్ సీజన్‌ (Summer Season) మొదలైపోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ కాలంలో ప్రజలు తమతో పాటు తమ గాడ్జెట్లను (Gadgets) కూడా రక్షించుకోవడం చాలా ముఖ్యం. నిప్పుల కొలిమిలా తలపించే ఈ వేసవిలో మీ గాడ్జెట్ల ఇంటర్నల్ పార్ట్స్ (Internal Parts) డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే సమ్మర్‌లో స్మార్ట్‌ఫోన్‌లు(Smartphones), ల్యాప్‌టాప్‌లు(Laptops), ఇతర గాడ్జెట్స్‌ను ప్రొటెక్ట్ చేయడానికి నిపుణులు కొన్ని టిప్స్ షేర్ చేసుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం.

* స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సేపు జేబులో ఉంచుకోవద్దు. వేడిగా, ఉక్కపోతగా ఉండే ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను బయటే ఉంచండి. ఆఫీసులో లేదా ఇంట్లో అప్పుడు ఫోన్‌ను మీ డెస్క్‌పై ఉంచండి.

Alzheimer’s Disease: అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే స్మార్ట్‌ యాప్‌.. ఆవిష్కరించిన అమెరికన్ పరిశోధకులు..


* గాడ్జెట్స్‌పై సూర్యకాంతి నేరుగా పడకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువసేపు ఎలక్ట్రిక్ వస్తువులపై నేరుగా ఎండ పడటం వల్ల అవి వేడెక్కే ప్రమాదం ఉంది. అంతేకాదు డైరెక్ట్‌గా పడే సన్‌లైట్ వల్ల గాడ్జెట్స్‌ ఇంటర్నల్ పార్ట్స్‌కు నష్టం కూడా జరగవచ్చు.

* సమ్మర్ సీజన్‌లో ఫోన్‌ను కారులో ఉంచడం అంత మంచిది కాదు. ఎందుకంటే మీ కారు అవుట్‌డోర్స్‌లో పార్క్ చేస్తే అందులోని వస్తువులు బాగా హీట్ అవుతాయి. కారు లోపల గాడ్జెట్‌లు ఉంచడం వల్ల వేడెక్కడం జరుగుతుంది. అందుకే వీలైనంత వరకు పార్క్ చేసిన కారు లోపల గాడ్జెట్లు ఉంచకండి.

* గాడ్జెట్లను ఆరుబయట ఛార్జ్ చేస్తే అవి పాడవుతాయి. సాధారణంగా గాడ్జెట్లను ఛార్జ్ చేస్తున్నప్పుడు వాటి టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది. అదే అవుట్‌డోర్స్‌లో ఛార్జ్ చేస్తున్నట్లయితే వాటి టెంపరేచర్ మరింత పెరుగుతుంది. ఇది గాడ్జెట్స్ అధికంగా వేడెక్కడానికి కారణమై వాటిని పాడు చేస్తుంది.

* బ్యాటరీ దెబ్బతినకుండా ఉండేందుకు గాడ్జెట్‌లు ఓవర్‌ఛార్జింగ్‌ కాకుండా జాగ్రత్తపడాలి.

* మీ గాడ్జెట్స్‌ను దిండు, కుషన్, దుప్పటి మొదలైన వాటి కింద ఉంచి వాటిని ఛార్జ్ చేయవద్దు. ఎందుకంటే అవి గాడ్జెట్స్‌ నుంచి వచ్చే వేడిని బయటికి విడుదల చేయవు. దీనివల్ల దిండు కింద ప్రదేశం మరింత హీటెక్కి గాడ్జెట్‌లు బాగా వేడెక్కుతాయి.

* ల్యాప్‌టాప్ కూలింగ్ స్టాండ్ మీ డివైజ్ ను చల్లగా ఉంచుతుంది. ఏదైనా హెవీ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు లేదా మీ ల్యాప్‌టాప్‌లో వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్టాండ్‌లోని ఫ్యాన్‌లు గాలిని కింది నుంచి పైకి పంపడం ద్వారా డివైజ్ కూల్ అవుతుంది. ల్యాప్‌టాప్ కూలింగ్ స్టాండ్ USB-ఛార్జింగ్ కేబుల్‌తో వస్తుంది.

* గాడ్జెట్స్‌ను ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఉంచాలి. లేదంటే, వాటిని ఇంటి లోపల చల్లగా, నీడ ఉన్న, శుభ్రమైన ప్రదేశాలలో ఉంచడానికి ప్రయత్నించండి.

* వేడెక్కాయి కదా అని గాడ్జెట్‌ను ఫ్రీజర్‌లో ఉంచకూడదు. ఎందుకంటే ఘనీభవించిన తేమ లేదా నీరు గాడ్జెట్‌ లోపలికి ప్రవేశించి దాని పార్ట్స్ డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది.

* చాలా ఫోన్‌లు బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్‌తో వచ్చాయి. ఇది ఏ యాప్‌లు ఇతర వాటి కంటే వేగంగా బ్యాటరీని ఎంప్టీ చేస్తున్నాయో మీకు తెలియజేస్తుంది. బ్యాటరీ లైఫ్ సేవ్ చేయడానికి మీరు వాటిని ఆప్టిమైజ్ చేయవచ్చు, ఇది హీటెక్కే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

LIC IPO: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ మెగా ఐపీవో ప్రారంభం.. షేర్లు కొనుగోలు చేసే ముందు వీటిని తెలుసుకోండి..


* ఫోన్‌లో వైఫై, మొబైల్ డేటా, బ్లూటూత్, జీపీఎస్ మొదలైన ఫీచర్లను టర్న్ ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి.

First published:

Tags: Gadgets, Summer, Summer tips

ఉత్తమ కథలు