తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు టీ-హబ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టీ-హబ్ నుంచి అనేక స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అలాంటి స్టార్టప్స్‌లో ఒకటి క్యూరీ డాక్. కొందరు డాక్టర్స్ కలిసి రూపొందించిన స్టార్టప్ ఇది. కరోనా సంక్షోభ కాలంలో పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులకు ఉపయోగపడే యాప్ ఇది. పిల్లలు అనారోగ్యం పాలైతే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లకుండా ముందుగా కావాల్సిన చికిత్సను Curie Doc యాప్ ద్వారా పొందొచ్చు. అంటే పిల్లలకు ఉన్న లక్షణాలను బట్టి ఏఏ మెడిసిన్ వాడాలో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అందులో సూచించిన మెడిసిన్ వాడొచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లొచ్చు. కరోనా సంక్షోభ కాలంలో బయటకు వెళ్లే పనిలేకుండా ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. తెలంగాణ మునిసిపల్, అర్బన్ డెవలప్‌మెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ యాప్ ఉపయోగించాలంటూ తల్లిదండ్రులకు సూచించారు.
SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ఇన్స్యూరెన్స్... ఏ కార్డుపై ఎంతంటే
Trains Cancelled: ప్రయాణికులకు గమనిక... తెలుగు రాష్ట్రాల నుంచి ఈ 34 రైళ్లు రద్దు
Here is an App from a @THubHyd based startup built with doctors, https://t.co/DdcxVoThu8
During the pandemic, parents can use this app & get a FREE care plan prior to visiting a doctor. My best wishes to the team @prahaladm to take it further
Download: https://t.co/zv03tEpqYh pic.twitter.com/DkhLmozd11
— KTR (@KTRTRS) April 7, 2021
ఫ్యామిలీ ఫిజీషియన్స్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ రెహ్మాన్‌ల సహకారంతో ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పాటైంది. గూగుల్ ప్లేస్టోర్‌లో Curie Doc పేరుతో యాప్ ఉంది. http://CurieDoc.com పేరుతో వెబ్‌సైట్ కూడా ఉంది. ఇందులోని సమాచారం అంతా MayoClinic USA, Bostons Childrens Hospital U.S.A, NHS U.K, National Institutes of Health U.S.A, Royal Childrens Hospital Australia లాంటి ప్రముఖ మెడికల్ సైట్ల నుంచి సేకరించినదని క్యూరీ డాక్ వివరించింది. తల్లిదండ్రులు ముందుగా యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత సులువైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. పిల్లలకు ఉన్న లక్షణాలు, వయస్సు సెలెక్ట్ చేయాలి. పిల్లలకు వాడాల్సిన మెడిసిన్ వివరాలు వస్తాయి. దీంతో పాటు తీసుకోవాల్సిన ఆహారం, తినకూడని ఆహార పదార్థాల వివరాలు ఉంటాయి. వీటితో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అందులో తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చూడండి.
Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ప్రోమో కోడ్స్‌తో కొత్త ఆఫర్స్ పొందండి
Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
ఈ యాప్ ద్వారా నెల రోజుల పసివాళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లల వరకు వైద్య సాయం పొందొచ్చు. జ్వరం, డయేరియా, జలుబు, దగ్గు, గొంతు మంట, చెవి నొప్పి లాంటి సాధారణ లక్షణాలకు వాడాల్సిన మందుల వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, Health, Health care, Health tip, Health Tips, KTR, Mobile App, Playstore, Start-Up, Startups, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu