HDFC Bank: ఆ యాప్‌తో జాగ్రత్త... కస్టమర్లను హెచ్చరిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ

HDFC Bank | ఎవరి ఫోన్‌నైనా మరొకరు యాక్సెస్‌ చేయడానికి ఎనీడెస్క్ ఒక్కటే కాదు... ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. వీటితో ఇతరులకు యాక్సెస్ ఇస్తే మీ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు కొల్లగొట్టడం చాలా సులువు.

news18-telugu
Updated: July 4, 2019, 9:09 AM IST
HDFC Bank: ఆ యాప్‌తో జాగ్రత్త... కస్టమర్లను హెచ్చరిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
టెక్నాలజీతో బ్యాంకులో జరిపే లావాదేవీలన్నీ ఎంత సులువు అవుతున్నాయో... సైబర్ మోసాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇటీవల ఎన్నీడెస్క్ యాప్‌ ఉపయోగిస్తూ కస్టమర్ల డబ్బును కొల్లగొట్టేస్తున్నారు కేటుగాళ్లు. యూపీఐ పద్ధతిలో సులువుగా డబ్బు కాజేస్తున్నారు. ఎక్కడ్నుంచైనా ఎవరి ఫోన్‌నైనా యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎనీడెస్క్ యాప్ ఉపయోగిస్తున్నారు. అందుకే ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. అపరిచితులు మీ ఫోన్‌లో ఎనీడెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేయమని చేసి 9 అంకెల కోడ్ చెప్పమని అడుగుతారని, మీ ఫోన్ యాక్సెస్ చేసి డబ్బులు కొట్టేస్తారని, ఓటీపీ, పిన్, కార్డు వివరాలు ఎవరికీ చెప్పొద్దని, ఏదైనా అనుమానం వస్తే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలంటోంది హెచ్‌డీఎఫ్‌సీ.

ఎనీడెస్క్ యాప్‌తో ముప్పేంటీ?



ఎక్కడో ఉన్న ఒక కంప్యూటర్‌ని మరొకరు యాక్సెస్ చేయడానికి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. వీటితో ఏ కంప్యూటర్‌నైనా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. అలాగే ఒకరి స్మార్ట్‌ఫోన్‌ను మరొకరు యాక్సెస్ చేయడానికి ఉపయోగపడేదే ఎనీడెస్క్ యాప్‌. ఎవరి ఫోన్‌నైనా మరొకరు యాక్సెస్‌ చేయడానికి ఎనీడెస్క్ ఒక్కటే కాదు... ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. వీటితో ఇతరులకు యాక్సెస్ ఇస్తే మీ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు కొల్లగొట్టడం చాలా సులువు. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇతరులు పూర్తిగా యాక్సెస్ చేయడానికి ఎనీడెస్క్ యాప్ ఉపయోగపడుతుందని, వాటితో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయని ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలాంటి యాప్స్ గురించి కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది.

HDFC Bank, HDFC Bank warning, cyber crime, any desk app cheating, uninstall any desk, anydesk android, credit card, cyber frauds, online banking, smartphone, UPI, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వార్నింగ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైబర్ క్రైమ్, ఎనీ డెస్క్ యాప్ చీటింగ్, ఎనీ డెస్క్ యాప్ మోసాలు, క్రెడిట్ కార్డ్, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, స్మార్ట్‌ఫోన్, యూపీఐ
(ప్రతీకాత్మక చిత్రం)

ఎనీడెస్క్ యాప్‌తో ఎలా మోసం చేస్తారు?


ముందుగా మీకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు స్మార్ట్‌ఫోన్ యాక్సెస్ ఇవ్వాలని అడుగుతారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘AnyDesk’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతారు. ‘AnyDesk’ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వారికి యాక్సెస్ ఇచ్చారంటే ఇక మీ ఫోన్ వారి చేతుల్లోకి వెళ్లినట్టే. ఆ తర్వాత మీ బ్యాంకు వివరాలన్నీ తెలుసుకుంటారు. అకౌంట్ నెంబర్, కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, పిన్ నెంబర్, ఓటీపీ, ఎంపిన్ లాంటివి తెలుసుకొని డబ్బులు నొక్కేస్తారు.

మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

ఎవరైనా ఫోన్ చేసి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొమ్మని, మీ బ్యాంకు వివరాలు చెప్పమని అడిగితే నమ్మొద్దు. బ్యాంకు సిబ్బంది ఎవరూ అలా అడగరు. వెంటనే కాల్ కట్ చేయాలి.
ఒకవేళ మీరు “AnyDesk” యాప్‌ ఉంటే, ఆ యాప్‌తో మీకు అవసరం లేకపోతే డిలిట్ చేయాలి.
మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అన్నింటికీ యాప్-లాక్ సెట్ చేసుకోవాలి.
మీ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఏదైనా తేడా ఉంటే దగ్గర్లోని బ్రాంచ్‌లో సమాచారం ఇవ్వాలి. లేదా బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
గూగుల్ సెర్చ్‌లో కస్టమర్ కేర్  నెంబర్లు సెర్చ్ చేసి కాల్ చేయకూడదు. అందులో నకిలీవి ఉండొచ్చు. అందుకే వెబ్‌సైట్‌లోని కస్టమర్ కేర్ నెంబర్లకే కాల్ చేయాలి.
మీ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ ఎవరికీ చెప్పొద్దు. మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోకూడదు.
మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నెంబర్, యూపీఐ పిన్, ఎంపిన్, సీవీవీ, ఎక్స్‌పైరీ డేట్, ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరికీ చెప్పొద్దు.
మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేయడానికి, సెట్టింగ్స్ మార్చడానికి ఎవరికీ అనుమతి ఇవ్వొద్దు.
మీకు వచ్చిన ఎస్ఎంఎస్‌ను ఎవరైనా ఫార్వర్డ్ చేయమంటే చేయకూడదు.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి



ఇవి కూడా చదవండి:

Insurance: ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు రూ.16,887 కోట్లు... అందులో మీదెంత?

IRCTC: దుబాయ్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ ఎంతో తెలుసా?

SBI Home Loan: ఎస్‌బీఐ నుంచి రెండు రకాల హోమ్ లోన్స్... వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: July 3, 2019, 1:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading