HDFC Bank: మూడు రోజులుగా పనిచేయని నెట్ బ్యాంకింగ్... హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లలో ఆందోళన

HDFC Bank | త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెబుతోంది. కానీ మూడు రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

news18-telugu
Updated: December 4, 2019, 12:39 PM IST
HDFC Bank: మూడు రోజులుగా పనిచేయని నెట్ బ్యాంకింగ్... హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లలో ఆందోళన
HDFC Bank: మూడు రోజులుగా పనిచేయని నెట్ బ్యాంకింగ్... హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లలో ఆందోళన (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లలో ఆందోళన కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులుగా హెచ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు పనిచేయట్లేదు. సోమవారం ఉదయమే సమస్యను గుర్తించినా పరిష్కారం కాలేదు. మంగళవారం సాయంత్రానికి ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నారు. కానీ బుధవారం నాడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో మొబైల్ బ్యంకింగ్, ఇ-బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. సాంకేతిక సమస్య కారణంగానే ఈ అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెబుతోంది. కానీ మూడు రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేకపోతున్నామని కస్టమర్లు సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తున్నారు. అంతేకాదు... కొందరు కస్టమర్లకు జీతాలు కూడా అందలేదు. "సాంకేతిక సమస్య కారణంగా మా కస్టమర్లు కొందరు నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ కాలేకపోతున్నారు. మా నిపుణులు ఈ సమస్యపై దృష్టి పెట్టారు. ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. అసౌకర్యానికి చింతిస్తున్నాం. కస్టమర్లు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు" అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వివరణ ఇచ్చింది.

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Personal Loan: 5 నిమిషాల్లో లక్ష రూపాయల అప్పు... 'ఎంఐ క్రెడిట్‌'లో తీసుకోండి ఇలా

Sundar Pichai: ఆండ్రాయిడ్‌తో సెన్సేషన్... అల్ఫాబెట్‌తో ప్రమోషన్... సుందర్ పిచాయ్ ప్రస్థానం ఇదే
Loading...
Sabarimala Bike Rent: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్... బైక్ అద్దెకు తీసుకోవచ్చు

 
First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...