హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Tips: మీ స్మార్ట్‌‌ఫోన్ హ్యాక్ అయిందా? తెలుసుకోండి ఇలా

Smartphone Tips: మీ స్మార్ట్‌‌ఫోన్ హ్యాక్ అయిందా? తెలుసుకోండి ఇలా

Smartphone Tips: మీ స్మార్ట్‌‌ఫోన్ హ్యాక్ అయిందా? తెలుసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Tips: మీ స్మార్ట్‌‌ఫోన్ హ్యాక్ అయిందా? తెలుసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Hack | మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయిందా? మీ మొబైల్‌ సరిగ్గా పనిచేయకపోతే హ్యాక్ అయినట్టు అనుమానించాల్సిందే. ఈ టిప్స్ ఫాలో అవండి.

  మీ స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు ఎలా పనిచేస్తుందో ఇప్పుడూ అలాగే పనిచేస్తోందా? పర్ఫామెన్స్‌లో చిన్నచిన్న మార్పులు కాకుండా చాలా తేడాలు కనిపిస్తున్నాయా? స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయినప్పుడు పర్ఫామెన్స్‌లో చాలా తేడాలుంటాయి. అయితే యూజర్లకు తమ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలియదు. ఫోన్‌లోనే ఏదైనా సమస్య ఉందేమో అనుకుంటారు. కానీ హ్యాక్ అయినప్పుడు చాలా సమస్యలు వస్తుంటాయి. థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం, ప్లేస్టోర్‌లోని యాప్స్‌లో మాల్‌వేర్, యాడ్‌వేర్ లాంటి హానికరమైన వైరస్‌లు ఉండటం వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సైబర్ నేరగాళ్లు వాట్సప్ లేదా ఎస్ఎంఎస్ల ద్వారా లింక్స్ పంపి మరీ మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయినట్టయితే అందులో మీ బ్యాంకు వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశముంది. అయితే ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకోవాలి? ఎలా అనుమానించాలి? హ్యాక్ అయినట్టు డౌట్ ఉంటే ఏం చేయాలి? తెలుసుకోండి.

  Amazon: మీకు అమెజాన్ అకౌంట్ ఉందా? అయితే 5 రూపాయలకే బంగారం కొనొచ్చు

  Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

  smartphone safety tips, cell phone safety tips, mobile phone safety tips, mobile device security tips, how to use mobile phone safely, types of mobile security, how to unhack your phone, how to fix a hacked android phone, what to do if your phone is hacked, స్మార్ట్‌ఫోన్ సేఫ్టీ టిప్స్, మొబైల్ ఫోన్ సేఫ్టీ టిప్స్, సెల్ ఫోన్ సేఫ్టీ టిప్స్
  ప్రతీకాత్మక చిత్రం

  మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువగా యాడ్స్ కనిపిస్తున్నాయా? అయితే మీ ఫోన్‌లో ఏదైనా మాల్‌వేర్ లేదా యాడ్‌వేర్ ఉండొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో మీకు తెలియకుండా ఏవైనా యాప్స్ ఇన్‍స్టాల్ అయ్యాయా? మీ ప్రమేయం లేకుండా కొత్త యాప్స్ స్క్రీన్‌పైకి వస్తున్నాయా? అయితే అనుమానించాల్సిందే. మీరు ఏవైనా లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఇలా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‍స్టాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక మీరు ఏదైనా యాప్ ఇన్‍స్టాల్ చేసినప్పుడు సడెన్‌గా ఆ యాప్ ఐకాన్ మాయమవుతుందా? అప్పటికే మీ ఫోన్‌లో ఉన్న ప్రమాదకరమైన యాప్ ఇలా మీ యాప్స్‌ను మాయం చేస్తుంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోందా? గతంలో ఒక రోజంతా వచ్చే బ్యాటరీ ఇప్పుడు కొన్ని గంటలు కూడా రావట్లేదా? అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ ఏవైనా రన్ అవుతున్నట్టే. మాల్‌వేర్ వల్లే ఈ సమస్య వస్తుంది.

  Samsung Galaxy M31s: సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్

  Realme C15 vs Realme C12: రూ.10,000 లోపు రిలీజైన ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్... తెలుసుకోండి

  smartphone safety tips, cell phone safety tips, mobile phone safety tips, mobile device security tips, how to use mobile phone safely, types of mobile security, how to unhack your phone, how to fix a hacked android phone, what to do if your phone is hacked, స్మార్ట్‌ఫోన్ సేఫ్టీ టిప్స్, మొబైల్ ఫోన్ సేఫ్టీ టిప్స్, సెల్ ఫోన్ సేఫ్టీ టిప్స్
  ప్రతీకాత్మక చిత్రం

  మీకు తెలియని నెంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయా? అది కూడా ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయా? అయితే మీరు అప్రమత్తం కావాల్సిందే. వెంటనే మీ ఫోన్ ఓసారి చెక్ చేసుకోండి. ఇక మీ మొబైల్ డేటా చాలా వేగంగా అయిపోతుందా? ఒక్కసారిగా మొబైల్ డేటా యూసేజ్ పెరిగిపోయిందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఇక మీరు వాడుతున్న యాప్స్ సడెన్‌గా క్లోజ్ అవుతున్నాయా? పదేపదే ఎర్రర్స్ వస్తున్నారా? మీ ఫోన్ హ్యాక్ అయిందనడానికి ఇది కూడా ఓ ఉదాహరణ. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయంటే మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానించాలి. సాధారణంగా ఫోన్‌లో ఇలాంటి సమస్యలు పెద్దగా రావు. తరచూ మీరు ఇలాంటి సమస్యల్ని గుర్తిస్తే మాత్రం జాగ్రత్తపడండి.

  మరి స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయినట్టు అనుమానం వస్తే ఏం చేయాలి? ఈ డౌట్ అందరికీ రావడం సహజం. మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా ముప్పు తప్పించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లోని ముఖ్యమైన ఫైల్స్ బ్యాకప్ తీసుకోవాలి. వాట్సప్ బ్యాకప్ చేయాలి. మెమొరీ కార్డ్ తీసేసి అందులో మీకు అవసరమైన ఫైల్స్‌ని వేరే చోట కాపీ చేయాలి. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. మీ మెమొరీ కార్డులోని ముఖ్యమైన ఫైల్స్ కాపీ చేసిన తర్వాత ఫార్మాట్ చేయాలి. ఇక మీ ఫోన్‌లో ఏదైనా యాంటీ వైరస్, మొబైల్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇన్‌స్టాల్ చేయాలి. ఆండ్రాయిడ్ యాంటీవైరస్, మొబైల్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఏడాదికి రూ.100 లోపే కొనొచ్చు. ప్రీమియం వర్షన్ ఇన్‍స్టాల్ చేస్తే చాలావరకు ఫిషింగ్, హ్యాకింగ్ లాంటి ముప్పు తప్పించుకోవచ్చు. మీకు ఏ యాప్ కావాలన్నా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తే చిక్కులు తప్పవు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, CYBER CRIME, Hacking, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు