Home /News /technology /

HAVE YOU SEEN HPS NEW ALL IN ONE PCS MIND BLOWING FEATURES AND PRICES UMG GH

HP PCs: హెచ్‌పీ ఆల్ ఇన్ వన్ పీసీ.. గేమర్స్‌కి సూపర్ అసలు.. ఫీచర్స్, ధర వివరాలు ఇవిగో..!

 హెచ్ పీ  కొత్త అల్ ఇన్ వన్ పీసీలు  చూశారా ?  దిమ్మతిరిగే ఫీచర్లు, ధరలతో మైండ్ పోతుంది !

హెచ్ పీ కొత్త అల్ ఇన్ వన్ పీసీలు చూశారా ? దిమ్మతిరిగే ఫీచర్లు, ధరలతో మైండ్ పోతుంది !

హెచ్‌పీ(HP) కంపెనీ భారతదేశంలో సరికొత్త ఎన్వీ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్‌ PC (Envy All-in-One PCs), పెవిలియన్ పీసీలను (Pavilion PC) పరిచయం చేసింది. ఈ పీసీలు 12వ జనరేషన్ ఇంటెల్ కోర్, 11వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్‌ల సాయంతో పనిచేస్తాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ కంప్యూటర్ల(computers) తయారీ కంపెనీ హెచ్‌పీ (HP) ఇండియాలో అదిరిపోయే పీసీలు లాంచ్ చేస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. PC, TV సామర్థ్యాలతో ఆల్ ఇన్ వన్ పీసీలు కూడా విడుదల చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారతదేశంలో సరికొత్త ఎన్వీ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్‌ PC (Envy All-in-One PCs), పెవిలియన్ పీసీలను (Pavilion PC) పరిచయం చేసింది. ఈ పీసీలు 12వ జనరేషన్ ఇంటెల్ కోర్, 11వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్‌(processor)ల సాయంతో పనిచేస్తాయి. వీటిలో 31.5-అంగుళాల, 34-అంగుళాల డిస్‌ప్లేలను కంపెనీ అందించింది. ఈ రెండు పీసీలు ప్రత్యేకమైన ఫీచర్ల(features)తో వస్తాయి. ఆ ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? అనే విషయాలు తెలుసుకుందాం.

ఇండియాలో HP ఆల్-ఇన్-వన్ PC ధరలు
HP Envy 31.5-అంగుళాల AIO డెస్క్‌టాప్ PC ధరను రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. HP పెవిలియన్ 34-అంగుళాల AIO డెస్క్‌టాప్ PC ప్రారంభ ధర రూ.1,75,999గా ఉంది. ఈ రెండిటినీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

HP పెవిలియన్ AIO PC స్పెసిఫికేషన్లు
HP పెవిలియన్ AIO 31.5-అంగుళాల లేదా 34-అంగుళాల డిస్‌ప్లే ఆప్షన్స్‌తో వస్తుంది. 31.5-అంగుళాల మోడల్ 4K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తే... 34-అంగుళాల మోడల్ 21:9 యాస్పెక్ట్ రేషియోతో 5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎన్వీ 31.5-అంగుళాల మోడల్ 12వ జెన్ ఇంటెల్ కోర్ i5 లేదా i7 ప్రాసెసర్‌తో నడుస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో మల్టిపుల్ HDMI పోర్ట్‌లు ఆఫర్ చేశారు. అలానే ఆడియో క్వాలిటీ విషయానికొస్తే, ఇందులో బ్యాంగ్ & ఒలుఫ్సెన్ (B&O) బ్రాండ్ 2W స్పీకర్లను అందించారు. స్క్రీన్ యాంటీ-గ్లేర్ ప్యానెల్‌తో వస్తుంది. దీంతో ఈ పీసీపై పనిచేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇందులో అందించిన ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ(Technology)తో గేమింగ్‌ను కూడా పూర్తిస్థాయిలో ఆస్వాదించవచ్చు.

ఇదీ చదవండి: Weight Loss: మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు !


HP ఎన్వీ 34-అంగుళాల AIO ఓల్డ్ 11వ Gen Intel కోర్ i9 ప్రాసెసర్‌తో నడుస్తుంది. దీని పర్ఫామెన్స్ మరింత మెరుగు పరిచేలా NVIDIA GeForce RTX 3060 గ్రాఫిక్స్ కార్డ్‌ని అందించారు. 16-మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చే ఈ పీసీ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. టేబుల్‌పై చక్కగా ఒదిగిపోయే మానిటర్ డిజైన్‌ అద్భుతంగా ఉంటుంది. డిస్‌ప్లేకి 3-వైపుల మైక్రో-ఎడ్జ్ బెజెల్స్‌ను ఆఫర్ చేశారు. కెమెరా డి-అటాచ్ అయి వస్తుంది కాబట్టి మీరు దానిని వివిధ యాంగిల్స్‌లో సెట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ నుంచి మొబైల్కు ఫైల్‌లను చాలా వేగంగా సెండ్ చేసుకునేందుకు వీలుగా ఇందులో క్విక్ డ్రాప్ ఫీచర్ కూడా ఆఫర్ చేశారు.



ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. Windows 11 హోమ్ (21H2) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ పీసీలో 16GB DDR4 SDRAM 3,200MHz లభిస్తుంది. టైప్-సి పోర్ట్, రెండు USB-A పోర్ట్‌లు, Wi-Fi 6, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఉంటాయి. ఏ స్పెషల్ టూల్స్ లేకుండా ఈ పీసీలోని నాలుగు స్టోరేజ్ డ్రైవ్‌లను సులభంగా ఎక్స్‌పాండ్, అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Computers, Desktop, Features, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు