Home /News /technology /

HAVE YOU NOT RECEIVED YOUR TAX REFUND YET BUT IF YOU DO THIS YOU WILL BE REFUNDED IMMEDIATELY UMG GH 2

Jio Games Watch: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ .. జియో కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌.. చూస్తే వదలరు !

 గేమింగ్ లవర్స్ కు గుడ్ న్యూస్ .. జియో కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌.. చూస్తే వదలరు !

గేమింగ్ లవర్స్ కు గుడ్ న్యూస్ .. జియో కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌.. చూస్తే వదలరు !

ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో (Reliance Jio) ఇండియాలో కొత్త గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. జియో గేమ్స్ వాచ్ (JioGamesWatch) పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొబైల్ గేమర్స్‌(Gamers)కు ఈ స్ట్రీమింగ్ బేస్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో (Reliance Jio) ఇండియాలో కొత్త గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. జియో గేమ్స్ వాచ్ (JioGamesWatch) పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొబైల్(Mobile) గేమర్స్‌కు ఈ స్ట్రీమింగ్ బేస్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. అన్ని రకాల గేమింగ్ కంటెంట్‌కు ఇది వన్-స్టాప్-షాప్ అవుతుందని రిలయన్స్ జియో పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

గేమింగ్ కమ్యూనిటీ ఇష్టాలు, ప్రాధాన్యతల గురించి సమగ్ర పరిశోధన తర్వాత జియో గేమ్స్ వాచ్‌ను లాంచ్ చేసినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా క్రియేటర్లు గేమ్‌ప్లే లేదా ఇతర కంటెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. స్ట్రీమింగ్ ఏమాత్రం ల్యాగ్ కాకుండా, అన్ని రకాల డివైజ్‌లలో సాఫీగా జరుగుతుంది. మినిమల్ లేటెన్సీతో ఏ డివైజ్‌లోనైనా లైవ్ స్ట్రీమ్ చేయడానికి, మిలియన్ల మంది వీక్షకులకు తమ ఫైనెస్ట్ మెటీరియల్‌ను ఎక్స్‌పోజ్ చేయడానికి ఈ ఫ్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేశారు. JioGamesWatch ప్లాట్‌ఫామ్ అనేక వ్యూయర్ ఎంగేజ్‌మెంట్ టూల్స్‌తో వస్తుంది. ఇవి క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీలో ముందుండడానికి సహాయపడతాయి. ఇందులో ఆడియన్స్ పోల్స్, ఎమోట్స్ ద్వారా ఫ్యాన్ సపోర్ట్ వంటి అనేక ఇంటరాక్టివ్ ఫీచర్లు ఉన్నాయి.

జియోతో పాటు ఇతర డివైజ్‌లలో బెస్ట్ ఇంటరాక్టివ్ గేమ్ స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను JioGamesWatch అందిస్తుంది. రిలయన్స్ జియో యూజర్లు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమ్స్, ఇతర వీడియో-ఆన్-డిమాండ్ కంటెంట్‌ను చూడగలరు. ఇది జియో సెట్ టాప్ బాక్స్‌లో, స్మార్ట్‌ఫోన్(Smart Phone) వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉన్న JioGamesAppలో JioGamesWatch ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: Airlines Fares: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఫ్లయిట్ చార్జీలు.. ఎప్పటినుంచంటే !


వినియోగదారులు తమ ఫేవరెట్ స్ట్రీమర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. JioGamesWatch ప్లాట్‌ఫామ్‌లో కమ్యూనిటీలను సృష్టించవచ్చు లేదా వాటిలో భాగంగా ఉండవచ్చు. క్రియేటర్లు తమ గేమ్‌ప్లే లేదా ఇతర కంటెంట్‌ను 1080p, 720p రిజల్యూషన్‌లో తక్కువ లేటెన్సీతో స్ట్రీమ్ చేయవచ్చు. క్రియేటర్లు, వీక్షకులకు కస్టమర్ సపోర్ట్ కోసం పూర్తి వివరాలతో కూడిన FAQ పేజీ కూడా ఉంది.



జియో గేమ్స్‌లో భాగం
2019లో లాంచ్ అయిన JioGamesలో JioGamesWatch భాగం. గేమర్లు, పబ్లిషర్లు, ఆన్‌లైన్ గేమ్స్ డెవలపర్స్, టోర్నమెంట్స్, స్పోర్ట్స్ వంటి వాటికి వన్-స్టాప్-షాప్‌గా జియో గేమ్స్‌ను లాంచ్ చేశారు. తాజాగా కొత్త గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం జియో గేమ్స్ వాచ్‌ను దీనికి జోడించారు. JioGamesలో గేమ్స్ ఆడేందుకు వినియోగదారులకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. జియోగేమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి రిలయన్స్ జియో కనెక్షన్ తప్పనిసరి కాదు. వినియోగదారులు జియో, జియోయేతర నెట్‌వర్క్‌ల నుంచి యాప్‌కి లాగిన్ కావచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Gaming, Mukesh Ambani, Reliance Jio, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు