మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోవచ్చు

గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ మీ ప్రతీ కదలికను రికార్డ్ చేస్తుంది. ఆ వివరాలన్నీ టైమ్‌లైన్‌లో ఉంటాయి.

news18-telugu
Updated: January 20, 2019, 7:41 AM IST
మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోవచ్చు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోజూ వందలాది మంది తమ స్మార్ట్‌ఫోన్స్ పోగొట్టుకుంటారు. లేదా దొంగలు కాజేస్తూ ఉంటారు. మా ఫోన్ పోయిందంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేవాళ్లు తక్కువ. కంప్లైంట్ ఇచ్చినా ఎప్పట్లోపు ఫోన్ దొరుకుతుందో గ్యారెంటీ ఉండదు. స్మార్ట్‌ఫోన్ పోతే అందులో ఉండే విలువైన సమాచారం, ఫోటోలు, వీడియోలు కూడా పోయినట్టే. అయితే మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కొన్ని ఫీచర్స్ ఉపయోగపడుతుంటాయి. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా అలాంటిదే. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో Find my Phone అని టైప్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ చేస్తే మీ ఫోన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి:Flipkart Republic Day Sale: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్స్

ఇదొక్కటే కాదు... గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ మీ ప్రతీ కదలికను రికార్డ్ చేస్తుంది. ఆ వివరాలన్నీ టైమ్‌లైన్‌లో ఉంటాయి. www.maps.google.co.in ఓపెన్ చేసి మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. త్రీ-హారిజాంటల్ బార్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే 'Your timeline' అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అందులో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపు ఉన్నారు? అన్న వివరాలను తేదీల వారీగా చూడొచ్చు. ఈ రోజు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు 'Today' పైన క్లిక్ చేస్తే చాలు. చివరిసారిగా మీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ 12 టిప్స్ మీ కోసమే

అయితే మీరు ఈ ఫీచర్లు వాడుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ అయి ఉండాలి. దాంతోపాటు మీ ఫోన్ లొకేషన్ కూడా ఎప్పుడూ ఆన్‌లో ఉండాలి. లొకేషన్ ఆఫ్ చేస్తే ఫోన్ ట్రాక్ చేయడం సాధ్యం కాదు.

ఇవి కూడా చదవండి:WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?

Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్
Published by: Santhosh Kumar S
First published: January 20, 2019, 7:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading