Mobile Wallet: పేటీఎంలో డబ్బులు పోయాయా? ఇలా చేస్తే మీ మనీ తిరిగొస్తుంది

Mobile Wallet | మొబైల్ వ్యాలెట్ కంపెనీ తప్పిదం వల్ల ఏదైనా మోసం జరిగితే మీరు 3 రోజుల్లోపే ఫిర్యాదు చేయాలి. అప్పుడు మీరు కోల్పోయిన డబ్బు తిరిగి పొందొచ్చు. ఒకవేళ 4 నుంచి 7 రోజుల మధ్య ఫిర్యాదు చేస్తే ట్రాన్సాక్షన్ వ్యాల్యూ లేదా రూ.10,000 ఏది తక్కువ అయితే ఆ రీఫండ్ వస్తుంది.

news18-telugu
Updated: January 12, 2019, 9:29 AM IST
Mobile Wallet: పేటీఎంలో డబ్బులు పోయాయా? ఇలా చేస్తే మీ మనీ తిరిగొస్తుంది
మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? మీరేం చేయాలో తెలుసుకోండి
news18-telugu
Updated: January 12, 2019, 9:29 AM IST
పేటీఎం, అమెజాన్ పే, ఫోన్‌పే లాంటి వ్యాలెట్స్‌లో లావాదేవీలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు డబ్బులు పోతుంటాయి. మీ అకౌంట్‌లో డెబిట్ అయినా వ్యాలెట్‌లో మాత్రం డబ్బులు కనిపించవు. అంతేకాదు... పేటీఎం, అమెజాన్ పే, ఫోన్‌పే లాంటి వ్యాలెట్స్‌లో మీకు తెలియకుండానే లావాదేవీలు జరిగిపోతుంటాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఖాతాదారులకు అర్థం కావు. ఎవరిని అడగాలో, ఎవరికి ఏమని ఫిర్యాదు చేయాలో తెలియదు. ఇలాంటి మోసాలను దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది. ఏవైనా అనధికార, మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు వినియోగదారులకు రక్షణగా నిలుస్తున్నాయి ఈ కొత్త నిబంధనలు. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లకు బ్యాంకులు ఎలాంటి భద్రత అందిస్తున్నాయో, మొబైల్ వ్యాలెట్ యూజర్లకు కంపెనీలు కూడా అలాంటి చర్యలే చేపట్టాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

డబ్బులు పోతే కస్టమర్లు ఏం చేయాలి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ఆదేశాల ప్రకారం మొబైల్ వ్యాలెట్ కంపెనీలన్నీ ట్రాన్సాక్షన్ అలర్ట్ ఎస్ఎంఎస్‌లోనే మోసపూరిత లావాదేవీలపై ఫిర్యాదులు స్వీకరించే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ అలర్ట్ ఎస్ఎంఎస్‌లో మొబైల్ వ్యాలెట్ కంపెనీ కంప్లైంట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ తప్పనిసరిగా ఉండాలి. మొబైల్ వ్యాలెట్ యూజర్లందరికీ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ ఇవ్వాలి. ఎస్ఎంఎస్, ఇమెయిల్ అలర్ట్స్, నోటిఫికేషన్ల కోసం యూజర్లు రిజిస్టర్ చేసుకునేలా మొబైల్ వ్యాలెట్ కంపెనీలు చర్యలు తీసుకోవాలి. అనధికార, మోసపూరిత లావాదేవీలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు మొబైల్ వ్యాలెట్ కంపెనీలు 24/7 కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.

వ్యాలెట్‌లో డబ్బులు పోతే రీఫండ్ చేస్తారా?
ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డుల్లో అనధికార, మోసపూరిత లావాదేవీలపై ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థల్ని నడిపిస్తున్నాయి బ్యాంకులు. ఇకపై మొబైల్ వ్యాలెట్ కంపెనీలు కూడా అలాంటి ఏర్పాట్లు కూడా చేయాలన్నది ఆర్‌బీఐ నిబంధన. మొబైల్ వ్యాలెట్ కంపెనీ తప్పిదం వల్ల ఏదైనా మోసం జరిగితే మీరు 3 రోజుల్లోపే ఫిర్యాదు చేయాలి. అప్పుడు మీరు కోల్పోయిన డబ్బు తిరిగి పొందొచ్చు. ఒకవేళ 4 నుంచి 7 రోజుల మధ్య ఫిర్యాదు చేస్తే ట్రాన్సాక్షన్ వ్యాల్యూ లేదా రూ.10,000 ఏది తక్కువ అయితే ఆ రీఫండ్ వస్తుంది. ఒకవేళ 7 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే ఆర్‌బీఐ పాలసీ ప్రకారం రీఫండ్ ఉంటుంది. రీఫండ్ కేసులేవైనా రిపోర్ట్ చేసిన 10 రోజుల్లో పరిష్కరించాలి. ఫిర్యాదులు, వివాదాలు ఏవైనా ఉంటే 90 రోజుల్లో పరిష్కరించాలి. ఒకవేళ 90 రోజుల్లో ఫిర్యాదు పరిష్కరించకపోతే మోసపూరిత లావాదేవీలపై రీఫండ్ చేయాల్సిన బాధ్యత కంపెనీదే.



ఇకపై యూజర్ల కేవైసీ వెరిఫికేషన్ లేకుండా ఫిబ్రవరి 2019 తర్వాత మొబైల్ వ్యాలెట్లు నిర్వహించడం సాధ్యం కాదు.

ఇవి కూడా చదవండి:
Loading...
Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్... రెండు వడ్డీల మధ్య తేడాలేంటీ?

అడల్ట్ సీన్లు తొలగిస్తున్న అమెజాన్ ప్రైమ్

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ నుంచి గుడ్‌ న్యూస్
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...