హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ఎలక్ట్రిక్ కార్ల కోసం కొత్త బ్యాటరీ డెవలప్ చేసిన స్టార్టప్..3 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్,20 ఏళ్లు ఉంటుదట

ఎలక్ట్రిక్ కార్ల కోసం కొత్త బ్యాటరీ డెవలప్ చేసిన స్టార్టప్..3 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్,20 ఏళ్లు ఉంటుదట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EV Battery : అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ఎన్నో పరిశోధనలు చేస్తుంటది. ఈ విశ్వవిద్యాలయం చాలా ప్రత్యేకమైన,మొత్తం మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు చేయడంలో చాలా ప్రసిద్ధి చెందింది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

EV Battery : అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ఎన్నో పరిశోధనలు చేస్తుంటది. ఈ విశ్వవిద్యాలయం చాలా ప్రత్యేకమైన,మొత్తం మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు చేయడంలో చాలా ప్రసిద్ధి చెందింది. భారతదేశంతో సహా మొత్తం ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు హార్వర్డ్ మరో కొత్త పరిశోధన చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల కోసం దీర్ఘకాలం ఉండే బ్యాటరీలను హార్వర్డ్ ఆధారిత స్టార్టప్(Harvard Backed Startup) ఓ పరిశోధన చేసింది. AdenEnergy అనే హార్వర్డ్-ఆధారిత స్టార్టప్... ఎలక్ట్రిక్ కార్ల కోసం ఉపయోగించే బ్యాటరీ(EV Battery)లు ఎక్కువ కాలం ఉండేలా పరిశోధనలు జరిపి ఓ కొత్త బ్యాటరీని అభివృద్ధి చేసింది.

ఈ బ్యాటరీ 20 సంవత్సరాల పాటు ఉంటుంది,ప్రస్తుతమున్న ఈవీ బ్యాటరీలతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. అంతేకాకుండా 3 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవడం ఈ బ్యాటరీ మరో ప్రత్యేకత. ఈ బ్యాటరీ తయారీ కోసం స్టార్టప్ కి 5.15 మిలియన్  డాలర్లు ఫండ్ ఇవ్వబడింది. అలాగే ఈ సాంకేతికత హార్వర్డ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ నుండి ప్రత్యేకమైన లైసెన్స్‌ను పొందింది. ప్రైమవేరా గ్రూప్, రాప్సోడీ వెంచర్, మాస్ వెంచర్స్ ఈ టెక్నాలజీకి నిధులు అందించాయి. ఇంతకుముందు, ఈ స్టార్టప్(AdenEnergy)సైకిళ్లకు అధునాతన బ్యాటరీలను తయారు చేయడంలో విజయవంతమైంది.

Viral Video : రైలులో ఫోన్ చోరికి యత్నించి ప్రయాణికులు చేసిన పనికి బిత్తరపోయిన దొంగ..దణ్ణం పెడతా వదలొద్దంటూ వేడుకోలు

ఈ అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీని రూపొందించిన అడెన్‌ఎనర్జీ CEO విలియం ఫిట్‌జుగ్ మాట్లాడుతూ... EV వాహన సముదాయం యొక్క పూర్తి విద్యుదీకరణ అనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మనం తీసుకోగల అత్యంత అర్ధవంతమైన దశలలో ఒకటి అని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గ్లోబల్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 16 శాతం తగ్గించవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నింటికంటే, ఎలక్ట్రిక్ వాహనాలు విలాసవంతమైన వ్యామోహంగా ఉండకూడదు. కానీ భవిష్యత్తును పరిశీలిస్తే, కేవలం EV బ్యాటరీలు మాత్రమే మిగిలి ఉంటే రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో అమెరికాలో యూజ్డ్ కార్ మార్కెట్ ఉండదు. అలాగే, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని హార్వర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అడెన్ ఎనర్జీ సైంటిఫిక్ అడ్వైజర్ జిన్ లీ అన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Battery, Electric cars, Startups

ఉత్తమ కథలు