Harley Davidson: బైక్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పిన హార్లే డేవిడ్సన్

Harley Davidson: గత 3-4 సంవత్సరాలుగా భారత్ నుండి నిష్క్రమించిన జనరల్ మోటార్స్, ఫియట్, సాన్యాంగ్, స్కానియా, ఎంఏఎన్, యూఎం మోటార్ సైకిల్స్ వంటి ఆటోమోటివ్ బ్రాండ్ల జాబితాలో హార్లే-డేవిడ్సన్ కూడా చేరనుంది.

news18-telugu
Updated: September 24, 2020, 7:37 PM IST
Harley Davidson: బైక్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పిన హార్లే డేవిడ్సన్
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
కుర్రకారు డ్రీమ్ బైక్‌గా పరిగణించే అమెరికాకు చెందిన బైక్ తయారీ సంస్థ హర్లే డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఆశించిన మేర అమ్మాకాలు లేకపోవడంతో పాటు కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో పెట్టుబడికి తగ్గ వ్యాపారం జరగకపోవడంతో తీవ్ర నష్టాలు చూడాల్సి వచ్చింది. దీంతో భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపేస్తున్నామని నిర్ణయం తీసుకుంది హార్లే డేవిడ్సన్. కొత్త సీఈఓ మార్గదర్శకత్వంలో ది రివైర్ ప్రోగ్రాంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 2009లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన ఈ సంస్థ ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

భారత్‌లో గత ఏడాది కేవలం 2,500 హార్లే -డేవిడ్సన్ బైకులు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే ఏప్రిల్–జూన్ మధ్యలో కేవలం 100 బైకులు మాత్రమే అమ్ముడయ్యాయి. భారత మార్కెట్‌లో పేలవమైన అమ్మకాలు జరగడంతో కంపెనీ పునరాలోచనలో పడింది. ఇక్కడ ఇంతగా పెట్టుబడి పెట్టి శ్రమించే బదులు అగ్రరాజ్యం అమెరికాలో శ్రమిస్తే ఆశించిన ఆదాయం వస్తుందని కంపెనీ ఆలోచనగా తెలుస్తోంది. భారత్ మార్కెట్‌లో తీవ్ర నష్టాలు వస్తుండటంతో ఇటీవల హర్యానాలోని బావాల్లో ప్లాంట్ యూనిట్‌ను కూడా మూసివేసింది. ఫలితంగా ఆ ప్లాంట్‌లో పనిచేసే 70 మంది ఉద్యోగులను తొలగించనున్నారు. దీంతో గత 3-4 సంవత్సరాలుగా భారత్ నుండి నిష్క్రమించిన జనరల్ మోటార్స్, ఫియట్, సాన్యాంగ్, స్కానియా, ఎంఏఎన్, యూఎం మోటార్ సైకిల్స్ వంటి ఆటోమోటివ్ బ్రాండ్ల జాబితాలో హార్లే-డేవిడ్సన్ కూడా చేరనుంది.

గతంలో హార్లే డేవిడ్సన్ సంస్థ కియాన్జియాంగ్ అనే చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని సబ్ 350 సిసి ఇంజన్ కలిగిన కొత్త మోటార్సైకిల్ను తయారుచేసింది. ఈ ఏడాది దీన్ని లాంచ్ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అయితే అంతర్జాతీయంగా తీవ్ర నష్టాలు వస్తుండటంతో కొద్ది నెలలుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి వార్తలు ప్రచారంలో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం అంర్జాతీయ మార్కెట్‌లోకి ట్రయంఫ్, ఇండియన్, బెనెల్లి, కవాసకి, డుకాటీ, అప్రిలియా మరియు యమహా, కవాసకి, సుజుకి మరియు హోండా యొక్క ప్రీమియం బ్రాండ్లతో హార్లే డేవిడ్సన్ గట్టి పోటీని ఎదుర్కొంటుంది.
Published by: Kishore Akkaladevi
First published: September 24, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading