WhatsApp New Year Stickers: న్యూ ఇయర్ విషెస్ చెప్పాలా? కలర్‌ఫుల్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

WhatsApp New Year Stickers: న్యూ ఇయర్ విషెస్ చెప్పాలా? కలర్‌ఫుల్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp New Year Stickers | కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మరి మీరు కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలనుకుంటున్నారా? వాట్సప్ స్టిక్కర్స్, Gifs ద్వారా ద్వారా క్రియేటీవ్‌గా విషెస్ చెప్పొచ్చు.

  • Share this:
    న్యూ ఇయర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020 వెళ్లిపోతోంది. కొత్త సంవత్సరం ఇలా ఉండకూడదని అందరూ కోరుకుంటున్నారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు విషెస్ చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. వాట్సప్‌ అందించిన ఫీచర్స్‌లో స్టిక్కర్స్ ఫీచర్ బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ సందర్భానికి తగ్గట్టుగా స్టిక్కర్స్ అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్స్ కూడా వెరైటీ స్టిక్కర్స్ అందిస్తున్నాయి. అందులో న్యూ ఇయర్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. మరి మీరు ఈ న్యూఇయర్‌కి వాట్సప్ స్టిక్కర్స్ ద్వారా విషెస్ చెప్పాలనుకుంటే... కలర్‌ఫుల్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    Flipkart Mobile Year-end sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 25 స్మార్ట్‌ఫోన్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్

    Top 10 Apps of 2020: ఈ ఏడాది ఎక్కువ డౌన్‌లోడ్స్ చేసిన 10 యాప్స్ ఇవే

    WhatsApp New Year stickers: స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేయండి


    మీ ఫోన్‌లో వాట్సప్ యాప్ అప్‌డేట్ చేసి చాలాకాలం అయినట్టైతే ఓసారి అప్‌డేట్ చేయండి.
    ఆ తర్వాత వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
    ఛాట్ విండో ఓపెన్ చేసి ఎమొజీ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
    మీకు ఎమొజీ, GIF, స్టిక్కర్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
    స్టిక్కర్ సెక్షన్ సెలెక్ట్ చేయండి.
    కిందకు స్క్రోల్ చేసి చివర్లో 'Get More Stickers' పైన క్లిక్ చేయాలి.
    అప్పుడు యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది.
    యాప్ స్టోర్‌లో New Year లేదా Happy New Year లేదా New Year 2021 అని టైప్ చేసి సెర్చ్ చేయండి.
    యాప్‌స్టోర్‌లో న్యూ ఇయర్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. ఇందులో యానిమేటెడ్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి.
    మీకు నచ్చిన స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయాలి.
    స్టిక్కర్స్ యాప్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి.
    స్టిక్కర్లను 'Add to WhatsApp' అని క్లిక్ చేస్తే ఆ స్టిక్కర్లు మీ వాట్సప్‌లోకి వచ్చేస్తాయి.
    మీరు మళ్లీ వాట్సప్‌లో స్టిక్కర్స్ లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే న్యూ ఇయర్ స్టిక్కర్స్ కనిపిస్తాయి.

    happy new year 2021 wishes, happy new year 2021 images, happy new year 2021 quotes, happy new year 2021 wallpaper, happy new year 2021 status, happy new year 2021 stickers for whatsapp, new year animated stickers for whatsapp, happy new year 2021 gifs, వాట్సప్ న్యూ ఇయర్ స్టిక్కర్స్, వాట్సప్ యానిమేటెడ్ స్టిక్కర్స్, వాట్సప్ న్యూ ఇయర్ ఇమేజెస్
    image: Playstore


    వాట్సప్ ద్వారా కాకుండా నేరుగా యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్ ఓపెన్ చేసి న్యూ ఇయర్ స్టిక్కర్స్, యానిమేటెడ్ స్టిక్కర్స్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ఇతరులకు పంపడం మాత్రమే కాదు సేవ్ కూడా చేయొచ్చు. థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. యాప్ స్టోర్‌లో మాల్‌వేర్ యాప్స్ ఉంటాయి. కాబట్టి స్టిక్కర్స్ యాప్ డౌన్‌లోడ్ చేసేముందు జాగ్రత్త. యాప్ డౌన్‌లోడ్ చేసేముందు రేటింగ్స్, రివ్యూస్ పరిశీలించండి.

    WhatsApp Trick: వాట్సప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడటం ఎలాగో తెలుసా?

    Paytm: పేటీఎంలో డబ్బులు పంపుతున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే

    WhatsApp New Year Gifs : వాట్సప్‌లో Gifs ఇలా డౌన్‌లోడ్ చేయండి


    ఇక వాట్సప్ స్టిక్కర్స్ వద్దనుకుంటే Gifs కూడా ఉంటాయి. ఆకట్టుకునేలా ఉంటే Gifs పంపాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    ముందుగా మీ ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
    ఛాట్ విండో ఓపెన్ చేసి ఎమొజీ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
    మీకు ఎమొజీ, GIF, స్టిక్కర్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
    అందులో GIF సెలెక్ట్ చేయండి.
    సెర్చ్ బార్‌లో New Year లేదా Happy New Year లేదా New Year 2021 అని టైప్ చేసి సెర్చ్ చేయండి.
    న్యూ ఇయర్ GIF ఫైల్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చినవి ఒక్క క్లిక్‌తో సెండ్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: