HAPPY INDEPENDENCE DAY 2021 DOWNLOAD WHATSAPP INDEPENDENCE DAY STICKERS BY FOLLOWING THESE STEPS NS
WhatsApp Independence Day Stickers: వాట్సాప్ లో ఇండిపెండెన్స్ డే స్టిక్కర్లు.. ఇలా డౌన్ లోడ్ చేసుకుని పంపించండి
ప్రతీకాత్మక చిత్రం
ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాట్సాప్ ద్వారా మీ మిత్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? అయితే.. ఈ వాట్సాప్ స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకుని పంపించి మీ ప్రత్యేకతను చాటండి.
ఈ స్టెప్స్ ను ఫాలో కండి..
- ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లండి.
- ఇక్కడ మీరు 'Independence Day WhatsApp Stikcers' అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- దీని తర్వాత స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్‌లో ఓపెన్ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు దాని నుంచి కావాల్సిన స్టిక్కర్ ప్యాక్‌ను ఎంచుకుని, యాడ్ టు వాట్సాప్ బటన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ వాట్సాప్‌లో స్టిక్కర్లు యాడ్ చేయబడతాయి.
- ఇప్పుడు WhatsApp కి వెళ్లి ఏదైనా చాట్‌కి వెళ్లి స్టిక్కర్ విభాగాన్ని తెరవండి.
- ఇప్పుడు మీరు యాడ్ చేసిన స్టిక్కర్ ని సెలక్ట్ చేయండి
- పంపడానికి స్టిక్కర్‌పై నొక్కండి.
- అయితే WhatsAppలో స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసే సమయంలో మీ వాట్సాప్ తాజా వెర్షన్‌కు అప్ డేట్ చేసి ఉండాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి.
వాట్సాప్‌లో కూడా GIF పంపవచ్చు ... WhatsApp లో భావోద్వేగాలను మెరుగైన రీతిలో వ్యక్తీకరించడానికి స్టిక్కర్ల కంటే ఎక్కువ GIF లను పంపడం మంచిది. దీని కోసం, GIF ట్యాబ్ ఇప్పటికే WhatsApp లో ఉంది, దీనిని మీరు ఎమోజి విభాగంలో కనుగొంటారు. ఇక్కడ మీరు మీకు నచ్చిన GIF ని చూడొచ్చు. మీకు ఇక్కడ ఏ ఆప్షన్ నచ్చకపోతే, మీరు Gifer.com నుంచి ఏదైనా GIF ని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.