HAPPY HOLI 2021 STICKERS HERE IS THE PROCESS HOW TO ADD AND SHARE HOLI STICKERS ON WHATSAPP NK
WhatsApp Holi Stickers: వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు... ఇలా పంపుకోండి
వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు... ఇలా పంపుకోండి (image credit - twitter)
WhatsApp Holi Stickers: ఇండియాలో వివిధ పండుగలకు వాట్సాప్ వివిధ రకాల స్టిక్కర్లు తెస్తూ ఉంటుంది. ఈసారి హోలీ సందర్భంగా స్పెషల్ స్టిక్కర్లు తెచ్చింది. ఆ విశేషాలు తెలుసుకుందాం.
Holi 2021 Stickers: హోలీ పండుగ నాడు మన పక్కనే ఉన్న వారికి రంగులు పూసి... విషెస్ చెబుతాం. అదే దూరంగా ఉన్నవారికి కాస్త స్పెషల్‌గా విషెస్ చెప్పాలంటే... అందుకోసం వాట్సాప్‌ని వాడుకోవచ్చు. టెక్నాలజీని సరిగ్గా వాడేసుకుంటున్న వాట్సాప్... హోలీ సందర్భంగా ప్రత్యేక స్టిక్కర్లను పరిచయం చేస్తోంది. జనరల్‌గా ప్రతిసారీ ఇలాంటి స్టిక్కర్లు రాగానే వాట్సాప్ యూజర్లు వాటిని ఇతరులకు పంపుతూ గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. ఐతే... కొంత మందికి మాత్రం ఆ స్టిక్కర్లేంటో, వాటిని ఎలా వాడాలో తెలియదు. అసలు అవి వాట్సాప్‌లో ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. సరిగ్గా అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. దీని ద్వారా స్టెప్ బై స్టెప్ ఎలా స్టిక్కర్లు పంపాలో తెలుసుకోవచ్చు. తద్వారా హోలీని మరింత ఆనందంగా జరుపుకోవచ్చు.
ఇలా చెయ్యండి:
1. ముందుగా వాట్సాప్‌లోని స్టిక్కర్స్ సెక్షన్లోకి వెళ్లాలి. అందుకోసం వాట్సాప్ మెసేజ్ చాట్ బార్ లోని ఎడమవైపు ఉన్న ఇమోజీ సింబల్‌ను క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీకు కింద 3 ఆప్షన్లు కనిపిస్తాయి. అవి ఇమోజీలు, గిఫ్లు, స్టిక్కర్స్ కనిపిస్తాయి. వాటిలో గిఫ్లలో కొన్ని హోలీ గిఫ్లు ఉన్నాయి. గిఫ్ సింబల్ క్లిక్ చేసి... హోలీ గిఫ్‌లను పంపుకోవచ్చు.
వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు
2. ఇక స్టిక్కర్స్ విషయానికి వస్తే... వాట్సాప్‌లో 12 డీఫాల్ట్ స్టిక్కర్ ప్యాక్స్ ఉన్నాయి. మీరు స్టిక్కర్ సింబల్ క్లిక్ చేసినప్పుడు మీకు హోలీ స్టిక్కర్లు కనిపించకపోతే... ఆ విండోలో కుడివైపున పైన ఉన్న ప్లస్ (+) గుర్తును క్లిక్ చెయ్యండి. అప్పడు మీకు స్టిక్కర్స్ విండోలో ఉండే 12 స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
3. ఇప్పటికీ మీకు హోలీ స్టిక్కర్లు కనిపించకపోతే... మీరు ఆ స్టిక్కర్ల విండోని కిందికి స్క్రాల్ చెయ్యండి. Get More Stickers అనేది క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీరు ప్లే స్టోర్ లోకి వెళ్తారు.
వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు
4. అక్కడ మీకు రకరకాల వాట్సాప్ స్టిక్కర్ యాప్స్ ఉంటాయి.
వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు
5. అక్కడి సెర్చ్ ఆప్షన్ ద్వారా మీరు 'Holi Stickers' అని సెర్చ్ చేసి... ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 'Holi Stickers for whatsapp' అని కూడా సెర్చ్ చెయ్యవచ్చు. చాలా రకాల యాప్స్ వస్తాయి.
6. ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే... అందులోని హోలీ స్టిక్కర్లు మీకు కనిపిస్తాయి.
7. ఆ యాప్ కింద యాడ్ టు వాట్సాప్ ('add to WhatsApp') అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి... నెక్ట్స్ వచ్చే పాపప్‌లో 'ADD' అనేది క్లిక్ చెయ్యండి. దాంతో హోలీ స్టిక్కర్లు మీ వాట్సాప్‌లోకి ఇంపోర్ట్ అవుతాయి.
8. ఇలా ఇంపోర్ట్ అయిన స్టిక్కర్లు మీకు వాట్సాప్‌లోని స్టిక్కర్స్ పేజీలో కనిపిస్తాయి. స్టిక్కర్స్ మెనూలో ప్లస్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు వాటిని చూస్తారు.
వాట్సా్ప్ ఐఫోన్ యూజర్లకు కూడా దాదాపు ఇలాంటి ఆప్షన్లే ఉన్నాయి. ఐతే... మరిన్ని స్టిక్కర్లు యాడ్ చెయ్యడానికి యాప్ స్టోర్ నుంచి ఛాన్స్ లేదు. అందువల్ల ఐఫోన్ యూజర్లు... తమకు ఎవరైనా స్టిక్కర్లు పంపితే... వాటిని సేవ్ చేసుకొని ఇతరులకు పంపుకోవచ్చు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.