హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

WhatsApp Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

WhatsApp Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

WhatsApp Holi Stickers | మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు క్రియేటీవ్‌గా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? మీకోసమే కలర్‌ఫుల్‌గా హోలీ విషెస్ అందించే వాట్సప్ స్టిక్కర్లు రెడీగా ఉన్నాయి.

    దేశంలో హోలీ మూడ్ వచ్చేసింది. యువతీయువకులు హోలీ కోసం రెడీ అవుతున్నారు. మరి మార్చి 21న జరగబోయే హోలీకి మీరు కూడా సిద్ధమవుతున్నారా? ఈసారి హోలీ పండుగను గ్రాండ్‌గా, కలర్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు క్రియేటీవ్‌గా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? మీకోసమే కలర్‌ఫుల్‌గా హోలీ విషెస్ అందించే వాట్సప్ స్టిక్కర్లు రెడీగా ఉన్నాయి. మీరు ప్లేస్టోర్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవడమే ఆలస్యం. ఒక్క క్లిక్‌తో ఎన్ని రకాల స్టిక్కర్లైనా పంపొచ్చు. మరి వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఎలా వాడాలి? తెలుసుకోండి.


    Read this: WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...

    వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?


    ముందుగా మీరు మీ వాట్సప్‌లో ఛాట్ విండో ఓపెన్ చేయండి.

    టెక్స్ట్ బాక్స్ పక్కన ఉండే స్మైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.

    కొత్త విండోలో ఎమొజీ, గిఫ్ బటన్స్ పక్కన స్టిక్కర్స్ ఐకాన్ కనిపిస్తుంది.

    స్టిక్కర్స్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఇప్పటికే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న స్టిక్కర్స్ లిస్ట్ కనిపిస్తుంది.

    చివర్లో కనిపించే + గుర్తును క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న స్టిక్కర్ ప్యాక్‌ల వివరాలుంటాయి.

    అలాగే కిందకు స్క్రోల్ చేసి చివర్లో 'Get More Stickers' పైన క్లిక్ చేయాలి.

    అప్పుడు యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది.

    యాప్ స్టోర్‌లో హోలీ స్టిక్కర్స్ అని సెర్చ్ చేస్తే స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి. లేదా ఈ లింక్ క్లిక్ చేయండి.

    స్టిక్కర్ ప్యాక్స్‌లో మీకు నచ్చినవి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన స్టిక్కర్ ప్యాక్ ఓపెన్ చేయాలి.

    స్టిక్కర్లను 'Add to WhatsApp' అని క్లిక్ చేస్తే ఆ స్టిక్కర్లు మీ వాట్సప్‌లోకి వచ్చేస్తాయి.

    మీరు మళ్లీ వాట్సప్‌లో స్టిక్కర్స్ లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే హోలీ స్టిక్కర్లు కనిపిస్తాయి.

    ఇలా కాకుండా మీరు నేరుగా యాప్ స్టోర్‌లోకి వెళ్లి కూడా స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    డౌన్‌లోడ్ చేసిన వాటిలో కలర్‌ఫుల్ హోలీ స్టిక్కర్‌ను మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపొచ్చు.

    Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్


    ఇవి కూడా చదవండి:


    PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి 12 రోజులే గడువు... మార్చి 31 డెడ్‌లైన్


    SBI Schemes: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకుంటారా? ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్స్ ఇవే...


    IRCTC TikTok Contest: టిక్‌టాక్ యాప్ ఉందా? పాట పాడితే ఐఆర్‌సీటీసీ బహుమతి

    First published:

    Tags: Android, Holi, Playstore, Smartphone, Whatsapp

    ఉత్తమ కథలు