WhatsApp: కొత్త స్కామ్‌తో వాట్సప్ యూజర్లే టార్గెట్... మీరు మోసపోకండి ఇలా

WhatsApp new scam | వాట్సప్ యూజర్లను టార్గెట్ చేస్తూ మరో కొత్త స్కామ్ బయటపడింది. మీరు మోసపోకుండా ఏం చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 28, 2020, 6:39 PM IST
WhatsApp: కొత్త స్కామ్‌తో వాట్సప్ యూజర్లే టార్గెట్... మీరు మోసపోకండి ఇలా
దీని వల్ల విజిటర్స్ ఫోన్ నంబర్‌ డయల్ చేయకుండా వెబ్‌సైట్‌లు తమ సందర్శకులతో సంభాషించడానికి ఇది అనుమతిస్తుంది.
  • Share this:
వాట్సప్ యూజర్లను టార్గెట్ చేస్తూ కొత్త స్కామ్ బయటపడింది. హ్యాకర్లు తెలివిగా వాట్సప్ యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. వాట్సప్ యూజర్లను వెరిఫికేషన్ కోడ్స్ అడిగి మరీ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నట్టైతే ఈ స్కామ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ముందుగా వాట్సప్ యూజర్లకు ఓ మెసేజ్ వస్తుంది. వాట్సప్ టెక్నికల్ టీమ్ నుంచి సంప్రదిస్తున్నట్టు హ్యాకర్లు నమ్మిస్తారు. ఆ తర్వాత ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను ఎస్ఎంఎస్ రూపంలో వాట్సప్ యూజర్లకు పంపిస్తారు. ఒకవేళ యూజర్లు వెరిఫికేషన్ కోడ్ చెప్పారంటే మరో చోట వారి వాట్సప్ ఓపెన్ అవుతుంది. అందులోనే డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది. యూజర్లను నమ్మించేందుకు తమ ప్రొఫైల్‌కు వాట్సప్ లోగో పెడుతున్నారు హ్యాకర్లు. ఆ ప్రొఫైల్‌కు వాట్సప్ లోగో ఉండటంతో యూజర్లు సులువుగా బోల్తా పడుతున్నారు. వెరిఫికేషన్ కోడ్ చెబుతున్నారు.


మీరు వాట్సప్ యూజర్ అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వాట్సప్ సంస్థ నుంచి మీకు ఎప్పుడూ పర్సనల్ మెసేజెస్ రావు. ఏ సమాచారం ఉన్నా అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మీ వెరిఫికేషన్ కోడ్‌ను మెసేజ్‌లో అడగదు వాట్సప్. మీరు వాట్సప్ ఇన్‌స్టాల్ చేసేప్పుడు మాత్రమే ఈ వెరిఫికేషన్ కోడ్ అవసరం. ఆ తర్వాత ఎప్పుడూ వెరిఫికేషన్ కోడ్ అవసరం ఉండదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వెరిఫికేషన్ కోడ్ అడుగుతున్నట్టైతే మీ అకౌంట్ హ్యాక్ చేయడానికేనని గుర్తించండి. అందుకే ఎవరికీ వెరిఫికేషన్ కోడ్స్ వెల్లడించకండి. ఒకవేళ ఇప్పటికే మీ అకౌంట్ హ్యాక్ అయితే మీ ఫోన్ నెంబర్ మరోసారి వెరిఫై చేసి మీ వాట్సప్ అకౌంట్‌ను తిరిగి పొందొచ్చు.ఇవి కూడా చదవండి:

BSNL Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.2 ధరకే ప్లాన్

Vodafone: వొడాఫోన్‌లో ఈ ప్లాన్‌పై డబుల్ డేటా

Smartphone: రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Published by: Santhosh Kumar S
First published: May 28, 2020, 6:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading