WhatsApp: వాట్సప్‌ బిజినెస్ అకౌంట్ ఇలా క్రియేట్ చేయండి

WhatsApp Business App | మీరు ఒక నెంబర్‌తో వాట్సప్ లేదా వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో ఏదైనా ఒకటే ఉపయోగించుకోవచ్చు. అందుకే పర్సనల్ ఫోన్ నెంబర్‌ బిజినెస్ అకౌంట్‌ క్రియేట్ చేయొద్దు.

news18-telugu
Updated: May 4, 2019, 11:53 AM IST
WhatsApp: వాట్సప్‌ బిజినెస్ అకౌంట్ ఇలా క్రియేట్ చేయండి
WhatsApp: వాట్సప్‌ బిజినెస్ అకౌంట్ ఇలా క్రియేట్ చేయండి
  • Share this:
వ్యాపారుల కోసం వాట్సప్ ప్రత్యేకంగా 'వాట్సప్ బిజినెస్' యాప్ రూపొందించింది. తమ కస్టమర్స్, క్లైంట్స్‌తో టచ్‌లో ఉండేందుకు వాట్సప్ బిజినెస్ అకౌంట్ ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా ఉండే వాట్సప్ యాప్ కన్నా వాట్సప్ బిజినెస్ యాప్ భిన్నంగా ఉంటుంది. ఈ యాప్‌ను ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. తమ వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని వాట్సప్ బిజినెస్ యాప్‌ ద్వారా కస్టమర్లకు చేరవేయొచ్చు. వాట్సప్ లాగానే వాట్సప్ బిజినెస్ యాప్‌కు మంచి స్పందన లభిస్తోంది. వాట్సప్ బిజినెస్ యాప్‌ను కంప్యూటర్ బ్రౌజర్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు. మరి వాట్సప్ బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.

వాట్సప్‌ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయండి ఇలా...



ముందుగా మీరు యాప్ స్టోర్ నుంచి వాట్సప్ బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేయండి.
అందులో ఉన్న వ్యాపారల జాబితా నుంచి మీ బిజినెస్ ఎంచుకోండి.
నియమ నిబంధనల్ని యాక్సెప్ట్ చేయండి.
మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేయండి.
ప్రొఫైల్‌లో మీ బిజినెస్ పేరు, డిస్క్రిప్షన్, బిజినెస్ ఇమెయిల్ ఐడీ, మీ వెబ్‌సైట్ లింక్, బిజినెస్ అడ్రస్ లాంటి వివరాలు ఇవ్వాలి.మీరు ఒక నెంబర్‌తో వాట్సప్ లేదా వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో ఏదైనా ఒకటే ఉపయోగించుకోవచ్చు. అందుకే పర్సనల్ ఫోన్ నెంబర్‌ బిజినెస్ అకౌంట్‌ క్రియేట్ చేయొద్దు. బిజినెస్‌కు వేరుగా ఓ ఫోన్ నెంబర్ తీసుకోవడం మంచిది. మీ కాంటాక్ట్స్, చాట్స్‌ని లేబుల్స్‌తో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కస్టమర్లకు వేగంగా సమాధానాలు ఇవ్వడానికి ఆటోమెటెడ్ మెసేజెస్ సెట్ చేసుకోవచ్చు.

Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు దరఖాస్తు... ఈ 10 తప్పులు చేయొద్దు

Alert: ఈ 12 రకాల ఫేక్ ఇమెయిల్స్ అస్సలు ఓపెన్ చేయొద్దు

LIC Policy: మీ జీతం తక్కువా? ఈ ఎల్‌ఐసీ పాలసీ మీ కోసమే...
First published: May 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading