Grofers: కిరాణ సరుకులు ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో హోమ్ డెలివరీ

Grofers: కిరాణ సరుకులు ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో హోమ్ డెలివరీ (image: Grofers)

Grofers | మీరు ఆన్‌లైన్‌లో సరుకులు కొనాలని అనుకుంటున్నారా? ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ గ్రోఫర్స్ కేవలం 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ చేస్తామని హామీ ఇస్తోంది.

  • Share this:
ప్రముఖ గ్రోసరీ డెలివరీ సర్వీస్ సంస్థ గ్రోఫర్స్ భారత్​లో తన సేవలను విస్తరిస్తోంది. ఇతర సంస్థలకు దీటుగా నిలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త సేవలను ప్రారంభించింది. కిరాణ సరుకుల డెలివరీ సమయాన్ని 15 నుంచి 10 నిమిషాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా గ్రోఫర్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అల్బిందర్ దిండ్సా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో తమ సేవలను విస్తరించామని చెప్పారు. కస్టమర్​ సరుకులు బుక్​ చేసుకున్న తరువాత.. కేవలం 10 నిమిషాల్లోనే కిరాణ సామాగ్రిని అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

‘ప్రస్తుతం మా సగటు డెలివరీ సమయం 15 నిమిషాలుగా ఉంది. దాన్ని 10 నిమిషాలకు తగ్గిస్తున్నాం. భారతదేశంలోని ప్రతి కస్టమర్‌కు 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే కిరాణా సరుకులు డెలివరీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. రాబోయే కాలంలో మరిన్ని నగరాలకు సేవలను విస్తరిస్తాం’ అని అల్బిందర్ వెల్లడించారు.

Realme GT 5G: రియల్‌మీ జీటీ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి

Samsung Galaxy M21: ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.749 ధరకే కొనొచ్చు... పూర్తి వివరాలివే

గ్రోఫర్స్​ ప్రస్తుతం ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, ఘజియాబాద్, నోయిడా, లక్నో నగారాల్లో సేవలందిస్తోంది. వినియోగదారులకు రోజువారీ అవసరమైన 7,000 కిరాణ సరుకులను తక్కువ సమయంలోనే వారి ఇళ్ల వద్దకు చేరవేస్తుంది. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల గ్రోఫర్స్​లో 100 మిలియన్ల డాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. ఈ నిధుల సహాయంతో గ్రోఫర్స్​ భారత్​లో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Jio Cashback Offer: జియో యూజర్లకు రూ.100 వరకు క్యాష్‌బ్యాక్... ఆఫర్ పొందండి ఇలా

Dangerous Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 9 యాప్స్ డిలిట్ చేయండి

ప్రముఖ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ కేవలం 15 నుంచి 30 నిమిషాల్లో ఫుడ్​ డెలివరీ చేస్తామని గతంలో తెలిపింది. అంతేకాదు, మరో ఐదు నగరాలకు తమ సేవలను విస్తరించినట్లు పేర్కొంది. ప్రారంభంలో కేవలం బెంగళూరు, గురుగ్రామ్‌లో మాత్రమే సర్వీసులను అందించిన స్విగ్గీ, ఇప్పుడు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, నోయిడాలో కూడా సేవలను విస్తరించింది. ఇదే తరహాలో గ్రోఫర్స్ వ్యాపారాన్ని విస్తరించనుంది.

రీడ్‌సీర్ ఇటీవలి సర్వే ప్రకారం, ఆన్​లైన్​ గ్రోసరీ డెలివరీ బిజినెస్​ వచ్చే ఐదు సంవత్సరాలలో 10 నుంచి 15 రెట్లు పెరిగే అవకాశం ఉంది. 2025 నాటికి ఈ బిజినెస్ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. ఇప్పటికే భారత్​లో బిగ్‌బాస్కెట్, జోమాటో వంటి సంస్థలు ఆన్​లైన్​ గ్రోసరీ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలకు గ్రోఫర్స్​ గట్టి పోటీనివ్వనుంది.
Published by:Santhosh Kumar S
First published: