హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

GPT-4: జీపీటీ-4ని ఫ్రీగా ఉపయోగించే ఆప్షన్స్.. సింపుల్ హ్యాక్స్, టిప్స్ మీకోసం..

GPT-4: జీపీటీ-4ని ఫ్రీగా ఉపయోగించే ఆప్షన్స్.. సింపుల్ హ్యాక్స్, టిప్స్ మీకోసం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే జీపీటీ-4 అందుబాటులో ఉంటుంది. అయితే దీన్ని ఉచితంగా ఉపయోగించడానికి సులువైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

GPT-4: OpenAI కొద్ది రోజుల క్రితం పరిచయం చేసిన లేటెస్ట్ లాంగ్వేజ్ మోడల్ జీపీటీ-4 (GPT-4) అత్యంత అధునాతన సామర్థ్యాలతో అందర్నీ ఆకట్టుకుంటోంది. సాధారణ చాట్‌జీపీటీ (ChatGPT) చేయలేని టాస్కులను కూడా సులభంగా చేస్తూ మానవుల సృజనాత్మక శక్తికి దీటుగా నిలుస్తోంది. జీపీటీ-4 కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఇమేజ్‌లను కూడా ప్రాసెస్ చేస్తోంది. కష్టమైన పరీక్షలలో అత్యధిక మార్కులు సంపాదిస్తూ వావ్ అనిపిస్తోంది. ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే జీపీటీ-4 అందుబాటులో ఉంటుంది. అయితే దీన్ని ఉచితంగా ఉపయోగించడానికి సులువైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రోమేథియస్ అని పిలిచే మైక్రోసాఫ్ట్ బింగ్ కొత్త AI మోడల్‌ అయిన GPT-4ని ఉపయోగిస్తోంది. బింగ్ చాట్‌బాట్ ఫ్రీ కాబట్టి జీపీటీ-4 సేవలను దీని ద్వారా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఉచితంగా జీపీటీ-4 మోడల్‌ను వినియోగించడానికి ఒక్క బింగ్ చాట్‌ మాత్రమే సులభమైన మార్గంగా కనిపిస్తోంది. ఇక Bing AI చాట్‌బాట్ చాట్‌జీపీటీ 4 అందిస్తున్న ఫీచర్లే కాకుండా కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్లను కూడా ఆఫర్ చేస్తోంది. Bing AIకి సాధారణ సూచనలు ఇస్తే చాలు ఇమేజ్‌లను క్రియేట్ చేసి ఇస్తోంది. అంతేకాదు, సమాచారం ఎక్కడి నుంచి తీసుకుంటుందో కూడా మీకు తెలియజేస్తుంది. నిజమైన వ్యక్తిలా సమాధానాలు ఇచ్చేలా దీనిని మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసింది.

* జీపీటీ-4 పవర్డ్ బింగ్ ఏఐ చాట్‌బాట్‌ని ఎలా ఉపయోగించాలి..?

స్టెప్ 1: మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge)ని ఉపయోగిస్తుంటే.. bing.com/new కి వెళ్లాలి. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు https://play.google.com/store/apps/details?id=com.microsoft.bing క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టెప్ 2: తరువాత టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న "చాట్ (Chat)"పై క్లిక్ చేయాలి. అంతే, మీరు జీపీటీ-4 ఫీచర్లను ఉచితంగా అందించే ఏఐ చాట్‌బాట్‌ని ఉపయోగించొచ్చు.

స్టెప్ 3: ఒకవేళ మీరు వేరే వెబ్ బ్రౌజర్‌ ఉపయోగిస్తుంటే.. బింగ్ చాట్ ఫర్ ఆల్ బ్రౌజర్స్‌ (Bing Chat for All Browsers) ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.

స్టెప్ 4: తర్వాత bing.com/new కి వెళ్లాలి.

స్టెప్ 5: టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న "చాట్ (Chat)"పై క్లిక్ చేయాలి. అంతే, మీరు జీపీటీ-4 ఫీచర్లను ఉచితంగా అందించే ఏఐ చాట్‌బాట్‌ని ఉపయోగించొచ్చు.

Data Transfer: ఒప్పో ,షియోమీ,వివో ఫోన్‌ల మధ్య డేటా షేరింగ్ ఇకపై సులభం..యాపిల్‌కు చెక్ పెట్టేందుకే..

* వేరే మెథడ్

GPT-4 API యాక్సెస్‌ని ఉపయోగించి ఒక డెవలపర్ హగ్గింగ్‌ఫేస్‌లో (HuggingFace)లో ChatGPT 4 ఉచిత చాట్‌బాట్‌ వెర్షన్‌ను సృష్టించారు. వినియోగదారులు తమ సొంత OpenAI API కీని నమోదు చేయకుండానే దీన్ని ప్రయత్నించవచ్చు. https://huggingface.co/spaces/ysharma/ChatGPT4 లింక్‌పై నొక్కి, ఒక ప్రశ్న అడిగి రన్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ChatGPT 4 మోడల్‌ను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఈ అప్లికేషన్ బిజీగా ఉన్నప్పుడు ChatGPT 4 ఉచిత సేవలను వినియోగించడం కష్టమవుతుంది. బింగ్ ఏఐ చాట్‌బాట్‌ మాత్రం నిరంతరం జీపీటీ-4 సర్వీసులను ఆఫర్ చేస్తూనే ఉంటుంది.

First published:

Tags: Chatgpt, Technology

ఉత్తమ కథలు