Home /News /technology /

GOVT TO AID CREATION OF INDIAN ALTERNATIVE TO GOOGLE S ANDROID APPLE S IOS GH VB

Indian OS: కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌పై భారత్ దృష్టి.. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఐఓఎస్‌లకు దీటుగా ఇండియన్ ఓఎస్​

MoS Electronics and IT Rajeev Chandrasekhar

MoS Electronics and IT Rajeev Chandrasekhar

ప్రపంచవ్యాప్తంగా ఏ ఫోన్ పనిచేయాలన్నా గూగుల్ ఆండ్రాయిడ్, లేదంటే యాపిల్ ఐఓఎస్(iOS) వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండాల్సిందే. అయితే వాటిని తలదన్నేలా ప్రత్యామ్నాయ ఓఎస్​ను రూపొందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత్​ కోసం ప్రత్యేకమైన ఓఎస్​ను రూపొందించేందుకు ప్రభుత్వం తగిన సహాయ, సహకారాలు అందించనున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా ఏ ఫోన్ పనిచేయాలన్నా గూగుల్ ఆండ్రాయిడ్(Android), లేదంటే యాపిల్ ఐఓఎస్(iOS) వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండాల్సిందే. అయితే వాటిని తలదన్నేలా ప్రత్యామ్నాయ ఓఎస్​ను రూపొందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత్​ కోసం ప్రత్యేకమైన ఓఎస్​ను(Operation System) రూపొందించేందుకు ప్రభుత్వం తగిన సహాయ, సహకారాలు అందించనున్నట్లు సమాచారం. దేశీయ టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే గూగుల్‌ ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఐఓఎస్‌లకు ప్రత్యామ్నాయంగా, అంతర్జాతీయ సంస్థలకు ధీటుగా స్వదేశీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు పారిశ్రామిక విధానాన్ని సరళీకరించనుంది.

ఈ అంశాలను స్వయంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ(MeitY) సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంస్థకు చెందిన ఆండ్రాయిడ్​తో పాటు.. టెక్ దిగ్గజం యాపిల్ iOS సిస్టమ్‌లు ప్రస్తుత మొబైల్ ఫోన్ల రంగంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని మంత్రి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘అంతర్జాతీయ సంస్థలైన గూగుల్, యాపిల్​కు మూడో ప్రత్యామ్నాయం లేదు. అందువల్లే దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్​ను(OS) రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ(MeitY)తో పాటు, భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉంది.

దీనిపై ఇప్పటికే టెక్​ నిపుణులతో పాటు, పరిశ్రమ రంగ పెద్దలతో సంప్రదింపులు మొదలుపెట్టాం. దీనిపై ఒక సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.’ అని కేంద్రమంత్రి తెలిపారు. కొత్త హ్యాండ్‌సెట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ అభివృద్ధికి స్టార్టప్​ సామర్థ్యాలను ప్రభుత్వం వెలికితీసేందుకు కృషి చేస్తోందని ఆయన చెప్పారు.

Watching Porn: మీకు ఆ వీడియోలు చూసే అలవాటు ఉందా..? అయితే మీరు ఇది తప్పక తెలుసుకోవాలి..


ఈ అంశంలో ప్రతిభ, సమర్ధత ఉన్న వారిని మరింత ప్రోత్సహించడానికి ఆసక్తితో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫలితంగా iOS, Androidలకు ధీటైన ప్రత్యామ్నాయాన్ని సృష్టించవగలమని.. అప్పుడే భారతీయ బ్రాండ్ అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. యాపిల్, లావా, ఫాక్స్‌కాన్, డిక్సన్ వంటి దిగ్గజ కంపెనీలు సభ్యులుగా ఉన్న ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) రూపొందించిన ఎలక్ట్రానిక్స్ తయారీ విజన్ డాక్యుమెంట్​ను కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ రోడ్ మ్యాప్ ప్రకారం.. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ మార్కెట్ ప్రస్తుతమున్న 75 బిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 300 బిలియన్ల అమెరికన్ సాధించే రోడ్ మ్యాప్‌ను డాక్యుమెంట్ వివరిస్తుంది. ​ప్రస్తుతం భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు సుమారు 15 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ప్రధాన మంత్రి ఆలోచన మేరకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో దేశాన్ని ప్రముఖంగా నిలపాలన్నదే తమ లక్ష్యమని ఐటీ మంత్రిత్వ శాఖ(MeitY) సహాయ మంత్రి అన్నారు. ప్రధాని చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు ఈక్విటీ మార్కెట్లకు భారత్‌ గమ్యస్థానంగా మారిందన్నారు. "దేశంలో విదేశీ బ్యాంకుల సంఖ్య పెరిగింది. తొలిసారి టెక్నాలజీ స్టార్టప్‌లు, కంపెనీలకు స్టాక్ మార్కెట్లు ఫైనాన్సింగ్, పెట్టుబడి పెడుతున్నాయి. నేడు బడా కంపెనీలైన లావా, డిక్సన్, బోట్ వంటి ఎన్నో కంపెనీలకు ఆరేళ్ల క్రితం వరకూ లేని మూలధనాన్ని సమీకరించే సామర్థ్యం ఇప్పుడు వచ్చింది’ అని మంత్రి చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Apple, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు