శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తున్నారా? తిరుమలలో రూమ్ దొరుకుతుందో లేదో, దర్శనం ఎలా జరుగుతుందోనని అని టెన్షన్ పడుతున్నారా? భక్తులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే సాంకేతికతను ఉపయోగించుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ. తిరుమల భక్తుల కోసం రెండేళ్ల క్రితమే గోవింద యాప్ రూపొందించింది. ఈ యాప్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇటీవలే ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది గోవింద యాప్. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా ఈ యాప్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గదుల దగ్గర్నుంచి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను ఈ యాప్‌లో పొందొచ్చు. గోవింద యాప్‌లో మీరు ఏ సేవలు పొందాలన్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గోవింద ఆండ్రాయిడ్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీవారి భక్తులకు గోవింద యాప్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చాలారోజుల ముందుగానే గదులు బుక్ చేసుకోవచ్చు. పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రణాళికతో ముందే గదులు బుక్ చేసుకోవడం మంచిది. మీకు ఏ రోజున ఎలాంటి గది కావాలో యాప్‌లో చూసి బుక్ చేయొచ్చు. తిరుమల మాత్రమే కాదు తిరుపతిలో కూడా గదులను బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా గోవింద యాప్‌లో పొందొచ్చు. ఇందుకోసం తేదీని ఎంపిక చేసి స్లాట్ బుక్ చేసుకొని పేమెంట్ పూర్తి చేయాలి. ఇక తిరుమలలో రోజువారీగా నిర్వహించే సేవల టికెట్లను కూడా యాప్‌లో పొందొచ్చు. విశేష పూజ, కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను యాప్‌లో పొందొచ్చు. ఇక టీటీడీ నిర్వహించే సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం గోవింద యాప్‌లో పేరు నమోదు చేయొచ్చు. టీటీడీకి చెందిన సప్తగిరి మ్యాగజైన్‌కు మీరు గోవింద యాప్‌లోనే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
ఇక తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించాలనుకునేవారికి యాప్‌లోనే హుండీ ఉంటుంది. హుండీ ట్యాబ్ క్లిక్ చేసి మీరు ఎంత సమర్పించుకోవాలనుకుంటున్నారో అన్ని రూపాయలను టైప్ చేయాలి. ఏ సందర్భంగా హుండీలో డబ్బులు వేయాలనుకుంటున్నారో కూడా వెల్లడించొచ్చు. అంటే మొదటి జీతం, పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ఏదైనా కారణాన్ని వివరించొచ్చు. ఏవైనా విరాళాలు ఇవ్వాలనుకన్నా యాప్‌లోనే సాధ్యం. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీవెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహ్యాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రివెన్షన్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంటకేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర వేదపరిరక్షణ ట్రస్ట్, శ్రీవెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్, శ్రీ బాలాజి ఆరోగ్యవర ప్రసాదిని స్కీమ్, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్‌లకు మీరు విరాళాలు యాప్‌లో ఇవ్వొచ్చు. మీరు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు పొందాలంటే కనీసం రూ.1,000 విరాళమివ్వాలి. అప్పుడే మీకు ఐటీ డిడక్షన్ సర్టిఫికెట్ లభిస్తుంది.
Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్కి పాన్ కార్డు అవసరమో తెలుసా?
పాత ఫోన్ అమ్మేస్తున్నారా? తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలివే
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Bhakti, Devotional, Mobile App, Tirumala news, Tirumala Temple, Tirupati, Ttd