ఒక ఏడేనిమిది సంవత్సరాల క్రితం మొబైల్ టెక్నాలజీలో ఎక్కువగా ఐడియా, ఎయిర్ టెల్ లాంటి టెలికం కంపెనీలు మొబైల్ సర్వీసులను(Mobile Service) అందించిన విషయం తెలిసిందే. తర్వాత జియో(Jio) వచ్చిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తీసుకున్నారు. అంతే కాకుండా.. జియోతో ఫ్రీ కాల్స్(Free Calls), డేటీ ఫ్రీ(Free Data) లాంటి ఆఫర్స్ ప్రకటించడంతో ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు వినియోగదారులు. జియో(Jio) రాక ముందు ఫ్రీ డేటా, ఉచిత కాలింగ్స్ కోసం చాలా మంది ఎక్కువ సిమ్స్ తీసుకునే వారు. అప్పట్లో భోగస్ ప్రూప్స్ ద్వారా ఎన్నో సిమ్స్ తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఒక్కో వ్యక్తి పదుల సంఖ్యలో సిమ్ లను తీసుకునే వారు. ఇలా దేశంలో మొబైల్ సిమ్ కార్డును సులభంగా పొందే రోజులు ఇప్పుడు ముగిశాయి.
అంతే కాకుండా.. సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు సిమ్ కార్డుల పొందే నిబంధనలను కఠినతరం చేయనుంది. ప్రస్తుతం ఏ వ్యక్తి అయినా 21 రకాల డాక్యుమెంట్లలో ఏదైనా ఒక దానిని చూపించి కొత్త సిమ్ పొందవచ్చు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం ఈ పత్రాల సంఖ్యను 5కి తగ్గించనుంది. కొత్త నిబంధన త్వరలో అమల్లోకి రావచ్చు. ప్రభుత్వం యొక్క ఈ చర్య ద్వారా నకిలీ పత్రాల ద్వారా సిమ్ కార్డులను పొందడం కష్టతరం చేస్తుంది. కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఇప్పుడు సిమ్ పొందేందుకు ఉపయోగించే డాక్యుమెంట్ల సంఖ్యను తగ్గిస్తోంది. సిమ్‌కి సంబంధించిన కొత్త నిబంధనలు 10 నుంచి 15 రోజుల్లో అమల్లోకి రావచ్చు.
ప్రస్తుతం.. దేశంలో సిమ్ పొందడానికి 21 డాక్యుమెంట్‌లలో ఏదైనా ఒకదాన్ని ఉపయోగించవచ్చు. వీటిలో ఆధార్ కార్డ్ , ఓటర్ కార్డ్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆయుధ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ , రేషన్ కార్డ్, ఎంపీ లేదా ఎమ్మెల్యే లేఖ, పెన్షనర్ కార్డ్, ఫ్రీడమ్ ఫైటర్ కార్డ్, కిసాన్ పాస్‌బుక్ CGHS కార్డ్, ఫోటో క్రెడిట్ వంటి పత్రాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏ వ్యక్తి అయినా ఆధార్, ఓటర్ కార్డ్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ మరియు విద్యుత్ బిల్లు నుండి మాత్రమే సిమ్ కార్డ్ పొందే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
కొత్త బ్యాంకు ఖాతా తెరవడంపై కూడా ప్రభుత్వం కఠినతను కూడా పెంచవచ్చు. ప్రస్తుతం.. ఏదైనా బ్యాంకులో కొత్త ఖాతా తెరవడానికి, ఆన్‌లైన్ ఇ-కెవైసి ద్వారా, వివరాలను ఆధార్ నుండి ధృవీకరిస్తే సరిపోతుంది. అయితే త్వరలో ప్రభుత్వం ఈ విధానానికి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయవచ్చు. నిజానికి గత కొన్నేళ్లుగా బ్యాంకుల్లో మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక ప్రకారం.. 2021-22లో ఇటువంటి కేసుల కారణంగా మొత్తం రూ.41,000 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు నిబంధనలు కఠినతరం చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, New business, Sim cards, Technology