హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Fake Website: ఆ వెబ్‌సైట్‌తో జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక!

Fake Website: ఆ వెబ్‌సైట్‌తో జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక!

Fake Website: ఆ వెబ్‌సైట్‌తో జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక!

Fake Website: ఆ వెబ్‌సైట్‌తో జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక!

Jeevan Pramaan Patra | మీరు పెన్షన్ పొందుతున్నారా? జీవన్ ప్రమాణ్ పత్రం పొందాలని చూస్తున్నారా? లేదంటే ఏమైనా సమాచారం కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Life Certificate | మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. అందువల్ల ఆన్‌లైన్‌లో (Online) కూడా జాగ్రత్తగా ఉండాలి. మరీముఖ్యంగా కొత్త నెంబర్లకు, మెయిల్స్‌కు స్పందించకపోవడం ఉత్తమం. విలువైన వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎవ్వరికీ తెలియజేయవద్దు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయొద్దు. లేదంటే బ్యాంక్ (Bank) అకౌంట్ ఖాళీ అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో పొరపాటు పడే అవకాశం ఉండొచ్చు.

ఎందుకంటే మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలో ప్రజలను బురిడీ కొట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది. జీవన్ ప్రమాణ్ పత్ర లేదా లైఫ్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందే వారు ప్రతి ఏటా కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్ కరెక్ట్‌గా రావాలంటే కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాల్సిందే. లేదంటే పెన్షన్ నిలిచిపోతుంది.

ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కొత్త సర్వీసులు తెచ్చిన బ్యాంక్, ఇకపై క్షణాల్లో..

దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకొని చాలా వెబ్‌సైట్లు పెన్షన్లను మోసం చేస్తున్నాయి. రూ. 150 చెల్లించాలని అడుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఇలా వసూలు చేస్తున్నాయి. అయితే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం చూస్తే.. http://jeevanpraman.online అనే వెబ్‌సైట్ ప్రజలను మోసం చేస్తోంది. రూ. 150 కడితే లైఫ్ సర్టిఫికెట్ అందిస్తామని పేర్కొంటోంది. అయితే ఇది ఫేక్ వెబ్‌సైట్ అని కేంద్రం పేర్కొంటోంది.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్!

కేంద్ర ప్రభుత్వానికి ఈ వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. అందువల్ల ఎవరైనా ఈ వెబ్‌సైట్‌తో అప్రమత్తంగా ఉండాలి. మీ విలువైన వివరాలను ఎవ్వరికీ తెలియజేయవద్దు.

లైఫ్ సర్టిఫికెట్‌కు సంబంధించి కేంద్రం ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను కలిగి ఉంది. https://jeevanpramaan.gov.in అనేది ప్రభుత్వ వెబ్‌సైట్. ఎవరికైనా అవసరం ఉంటే ఈ వెబ్‌సైట్ ద్వారా సమాచారం పొందొచ్చు. మనం ఇప్పుడు జీవన్ ప్రమాణ్ అప్లికేషన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ ఈమెయిల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత ఐ అగ్రి టు డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్ ఫర్ విండోస్‌పై క్లిక్ చేయాలి. మీ మెయిల్‌కు ఒక లింక్ వస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఒక జిప్ ఫైల్ ఉంటుంది. తర్వాత జీవన్ ప్రమాణ్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇలాగే మొబైల్ అప్లికేషన్‌ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

First published:

Tags: Fake sites, Jeevan pramaan patra, Life certificate, Website

ఉత్తమ కథలు