హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Trojan: మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసే కొత్త వైరస్.. హెచ్చరిస్తున్న ప్రభుత్వం!

Trojan: మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసే కొత్త వైరస్.. హెచ్చరిస్తున్న ప్రభుత్వం!

మీ బ్యాంక్ అకౌంట్‌ను ఖాళీ చేసే కొత్త వైరస్.. హెచ్చరిస్తున్న ప్రభుత్వం!

మీ బ్యాంక్ అకౌంట్‌ను ఖాళీ చేసే కొత్త వైరస్.. హెచ్చరిస్తున్న ప్రభుత్వం!

Mobile Banking Virus | మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా? మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారా? అయితే మీకు ముఖ్యమైన అలర్ట్. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Malware | ఇండియన్ ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తన లేటెస్ట్ అడ్వైజరీలో కీలక విషయాన్ని వెల్లడించింది. కొత్త మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ సోవా (SOVA) మాల్వేర్ ఇండియన్ కస్టమర్లను టార్గెట్ చేస్తోందని తెలిపింది. ఈ వైరస్ ఒక్కసారి ఫోన్‌లోకి వస్తే.. మళ్లీ దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయడం కష్టమని పేర్కొంటోంది. ఈ వైరస్ (Virus) తన ఐదో వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యిందని తెలిపింది. తొలిగా జూలై నెలలో ఇండియన్ సైబర్ స్పేస్‌లో దీన్ని గుర్తించినట్లు వెల్లడించింది.

  2021 సెప్టెంబర్ నెలలో దీన్ని తొలిగా మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు తెలిపింది. యూజర్ల పేర్లు, పాస్‌వర్డ్‌లు, కీలకమైన లాగిన్ వివరాలు, కుక్కీస్‌ను ఇది తస్కరిస్తుందని హెచ్చరించింది. అలాగే యాప్స్‌కు ఫాల్స్ ఓవర్‌లేస్‌ను క్రియేట్ చేస్తుందని పేర్కొంది. సోవా అనే అండ్రాయిడ్ ట్రోజన్ ముందుగా అమెరికా, రష్యా , స్పెయిన్ వంటి దేశాల యూజర్లను టార్గెట్ చేసేవారని, కానీ ఇప్పుడు ఇండియా సహా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపింది.

  లక్ష రూపాయల ల్యాప్‌టాప్ రూ.40 వేలకే! ధరల భారీ తగ్గింపు!

  వైరస్‌కు సంబంధించి లేటెస్ట్ వెర్షన్ అనేది ఫేక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌లో దాక్కుంటుందని పేర్కొంది. అలాగే ఈ వైరస్ ఆ ఫేక్ యాప్స్ లోగోలను కూడా మారుస్తుందని, క్రోమ్ సహా ఇతర పాపులర్ యాప్స్ మాదిరి కనిపించేలా చేస్తుందని, అప్పుడు ఎక్కువ మంది దాన్న డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఫోన్‌లోకి ఎంటర్ అవుతుంది.

  బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. 4 నెలల కనిష్టానికి ధరలు!

  ఈ సోవా అనే వైరస్ ఫోన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ లాగిన్ వివరాలను తస్కరించి హ్యాకర్లకు చేరవేస్తుంది. అలాగే నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా చేరవేస్తుందని గుర్తించుకోవాలి.

  కొత్త వెర్షన్ బ్యాంకింగ్ యాప్‌లు , క్రిప్టో ఎక్స్ఛేంజీలు/ వాలెట్‌లతో సహా 200 కంటే ఎక్కువ మొబైల్ అప్లికేషన్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల యాప్స్ డౌన్‌లోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫోన్‌లోకి వైరస్ వచ్చిన తర్వాత ఇది మీ ఫోన్‌లో ఉన్న అన్నీ యాప్స్ వివరాలను హ్యాకర్లకు చేరవేస్తుంది. వాటి లాగిన్ వివరాలు కూడా తస్కరిస్తుంది. స్మిషింగ్ రూపంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. అంటే మోసపూర్తిత మేసేజ్‌ల ద్వారా మోసగాళ్లు మనల్ని బురిడీ కొట్టిస్తారు. అందుకే స్మార్ట్‌ఫోన్ వాడే వారు ఫేక్ మెసేజ్‌లకు దూరంగా ఉండాలి. ఎక్కువగా స్పామ్ మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిని బ్లాక్ చేసేయండి. లేదంటే ఇబ్బందులు తప్పేలా లేవు. జాగ్రత్తగా ఉండాలి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, Cryptocurrency, Malware, Mobiles

  ఉత్తమ కథలు