భారత ప్రభుత్వం పబ్‌జీ సహా 118 యాప్స్‌పై నిషేధం విధించడం మరో సంచలనం సృష్టించింది. ఇండియాలో పబ్‌జీ వీడియో గేమ్‌కు ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఇప్పుడు పబ్‌జీ బ్యాన్ చేశారన్న వార్తలతో వారి గుండెల్లో పిడుగు పడ్డట్టైంది. పబ్‌జీ బ్యాన్ చేసినా అలాంటి గేమ్స్ చాలానే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ 5 గేమింగ్ యాప్స్ ఏవో తెలుసుకోండి.
Fortnite: పబ్‌జీ తర్వాత భారతదేశంలో ఎక్కువగా పాపులర్ అయిన గేమింగ్ యాప్ ఫోర్ట్‌నైట్. రెండు గేమ్స్ ఒకేలా ఉంటాయి. ఒకేసారి 100 మంది ప్లేయర్స్ బ్యాటిల్ ఫీల్డ్‌లోకి వస్తారు. ఆ తర్వాత గేమ్ మొదలవుతుంది.
Call of Duty: కాల్ ఆఫ్ డ్యూటీ... ఈ గేమ్ గేమింగ్ లవర్స్‌కు కొన్నేళ్లుగా పరిచయం. మొబైల్ వర్షన్ వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయింది. పబ్‌జీ మొబైల్, ఫోర్ట్‌నైట్ లాగానే 100 మంది ప్లేయర్స్ గన్స్‌తో రంగంలోకి దిగుతారు.
Nokia 5.3: రెడ్‌మీ, రియల్‌మీకి పోటీగా నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్... సేల్ ప్రారంభం
Redmi 9A: బ్యాటరీ ఎక్కువ... ధర తక్కువ... రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
Battlelands Royale: బ్యాటిల్ ల్యాండ్స్ రాయల్ థర్డ్ పర్సన్ బ్యాటిల్ రాయల్ షూటర్ గేమ్ ఇది. మిగతా గేమ్స్‌తో పోలిస్తే ఇది కాస్త చిన్న గేమ్. ఇందులో 32 మంది ప్లేయర్స్ ఉంటారు.
Garena Free Fire: గరెనా ఫ్రీ ఫైర్ పబ్‌జీ మొబైల్ లాగానే ఉంటుంది. పబ్‌జీ మొబైల్ గేమ్ కన్నా చాలా ఈజీగా ఆడొచ్చు.
Knives Out: నైవ్స్ ఔట్ లైవ్ యాక్షన్ గేమ్. పబ్‌జీ మొబైల్ లాగానే ఇందులో కూడా 100 మంది ప్లేయర్స్ ఉంటారు. గేమ్ ప్లే కూడా పబ్‌జీ లాగానే ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China App Ban, India-China, Indo China Tension, PUBG, Video Games