TikTok Ban: టిక్‌టాక్ యాప్ తొలగించండి... గూగుల్, యాపిల్‌ను కోరిన ప్రభుత్వం

Ban TikTok | మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్‌ను తొలగించాలని గూగుల్, యాపిల్‌ను కోరింది కేంద్ర ప్రభుత్వం.

news18-telugu
Updated: April 16, 2019, 1:57 PM IST
TikTok Ban: టిక్‌టాక్ యాప్ తొలగించండి... గూగుల్, యాపిల్‌ను కోరిన ప్రభుత్వం
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టిక్ టాక్ యాప్ యూజర్లకు షాక్. టిక్‌టాక్ యాప్‌ను యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని గూగుల్, యాపిల్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది. చైనాకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని కొద్దిరోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్ట్ "పిల్లలు అపరిచితుల్ని నేరుగా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరం. పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా ఉంది" అని వ్యాఖ్యానించింది. టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని, డౌన్‌లోడ్స్‌ను నిషేధించాలని, టిక్‌టాక్ వీడియోలు మీడియా ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read this: Jio Cricket: కాంటెస్ట్‌లో లగ్జరీ ఇల్లు యువకుడి సొంతం... మీరూ గెలుచుకోవచ్చు ఇలా

tiktok ban, musically ban in india, tik tok ban news, TikTok, TikTok app, tiktok ban in india, TikTok Banned, tiktok memes, tiktok viral videos, why tiktok ban, tiktok videos, why tiktok ban in india, టిక్ టాక్ నిషేధం, టిక్ టాక్ బ్యాన్, టిక్ టాక్ యాప్ వీడియో, టిక్ టాక్ స్టేటస్, బ్యాన్ టిక్ టాక్, టిక్ టాక్ సేఫ్టీ
ప్రతీకాత్మక చిత్రం


మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్‌ను తొలగించాలని గూగుల్, యాపిల్‌ను కోరింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు టిక్ టాక్ యాప్‌ నిషేధం వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఏప్రిల్ 22న విచారణ జరగనుంది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో టిక్ టాక్ డెవలపర్లు కూడా స్పందించారు. ఇప్పటివరకు 60 లక్షల వీడియోలను తొలగించారు. టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలన్న డిమాండ్లు చాలాకాలంగా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన నేతల దగ్గర్నుంచి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల వరకు అందరూ టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలనే కోరుతున్నారు.

Read this: JIO DND Feature: జియో యాప్‌లో డీఎన్‌డీ ఫీచర్ ఇలా యాక్టివేట్ చేయాలి

tiktok ban, musically ban in india, tik tok ban news, TikTok, TikTok app, tiktok ban in india, TikTok Banned, tiktok memes, tiktok viral videos, why tiktok ban, tiktok videos, why tiktok ban in india, టిక్ టాక్ నిషేధం, టిక్ టాక్ బ్యాన్, టిక్ టాక్ యాప్ వీడియో, టిక్ టాక్ స్టేటస్, బ్యాన్ టిక్ టాక్, టిక్ టాక్ సేఫ్టీ
ప్రతీకాత్మక చిత్రం


టిక్‌టాక్... వీడియో మేకింగ్ అండ్ షేరింగ్ యాప్. యూత్‌లో టిక్ టాక్ యాప్‌కు క్రేజ్ ఎక్కువ. యువతీయువకుల్లో టిక్ టాక్ యాప్ వీడియోస్ చూడటం, చేయడం ఓ వ్యసనంగా మారిపోయింది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న యాప్ టిక్ టాక్. జోక్స్, ప్రాంక్స్, పాటలు, డైలాగులు రికార్డ్ చేసి స్నేహితులకు షేర్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో టిక్ టాక్ యాప్‌ను 24 కోట్లసార్లు డౌన్‌లోడ్ చేశారంటే ఈ యాప్‌కు ఉన్న క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.Photos: అమితాబ్ బచ్చన్ కొన్న కొత్త వాహనం ఇదే... ఫోటోలు చూడండి

ఇవి కూడా చదవండి:

Inter: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... ఇలా చేయాలి

Inter Results: ఇంటర్ ఫెయిల్ అయ్యారా? ఇంకో అవకాశం ఉంటుంది

Inter Results 2019: రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు ఇలా దరఖాస్తు చేయండి
First published: April 16, 2019, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading