హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Fake Smartphones: పోగొట్టుకున్న, దొంగిలించిన ఫోన్లు మిస్‌ యూజ్‌ కాకుండా కొత్త రూల్‌.. ప్రతి ఫోన్‌ను రిజిస్టర్‌ చేయాల్సింద?

Fake Smartphones: పోగొట్టుకున్న, దొంగిలించిన ఫోన్లు మిస్‌ యూజ్‌ కాకుండా కొత్త రూల్‌.. ప్రతి ఫోన్‌ను రిజిస్టర్‌ చేయాల్సింద?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Smart phones: పోగొట్టుకున్న లేదా దొంగిలించిన స్మార్ట్‌ఫోన్‌లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి అన్ని మొబైల్ ఫోన్ తయారీదారులు భారతదేశంలో తయారైన ప్రతి ఫోన్‌ IMEI నంబర్‌ను ఇండియన్‌ కౌంటర్‌ఫిటెడ్‌ డివైజ్‌ రెస్ట్రిక్షన్?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌పై ప్రజలు ఎంతగా ఆధారపడుతున్నారో తెలిసిన విషయమే. ముఖ్యమైన సమాచారం అంతా ఫోన్‌లోనే ఉంటుంది. అలాంటి ఫోన్‌ పోగొట్టుకుంటే ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా ఫోన్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే వెంటనే IMEI నంబర్‌ ద్వారా ఫోన్‌ను బ్లాక్‌ చేయించవచ్చు. కానీ ఆ ఫోన్‌ ఫేక్‌ IMEI నంబర్‌తో ఉంటే సమస్య తప్పదు. అందుకే ఫేక్‌ ఫోన్లను అరికట్టడానికి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

* 13,500 ఒప్పో ఫోన్లకు ఒకటే IMEI నంబర్‌

భారతదేశంలో ఫేక్‌ IMEI నంబర్లతో లక్షలాది స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లు ఉన్నాయని గతంలో కొన్ని నివేదికలు హైలైట్ చేశాయి. చైనా నుంచి ఎక్కువగా వచ్చే ప్రముఖ ఫోన్ల డూప్లికేట్‌లు ఇండియాలో ఎక్కువగా లభిస్తాయి. 2020 జూన్‌లో వివో కంపెనీకి చెందిన 13,500 స్మార్ట్‌ఫోన్‌లు ఒకే IMEI నంబర్‌తో ఉన్నాయని మీరట్ పోలీసులు కనుగొన్నారు. చైనా బ్రాండ్ల విషయంలో ఇలాంటి ఘటనలు అంతకుముందు కూడా వెలుగుచూశాయి.

* ప్రతి ఫోన్‌ను రిజిస్టర్‌ చేయాల్సిందే

పోగొట్టుకున్న లేదా దొంగిలించిన స్మార్ట్‌ఫోన్‌లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి అన్ని మొబైల్ ఫోన్ తయారీదారులు భారతదేశంలో తయారైన ప్రతి ఫోన్‌ IMEI నంబర్‌ను ఇండియన్‌ కౌంటర్‌ఫిటెడ్‌ డివైజ్‌ రెస్ట్రిక్షన్‌ పోర్టల్‌ https://icdr.ceir.gov.inలో నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఇండియాలో విక్రయించే ప్రతి ఫోన్‌ను డిజిటల్‌గా ట్రాక్ చేసేందుకు వీలుగా సరైన IMEI నంబర్‌ ఉండేలా చూసేందుకు కొత్త నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది.

ఈ నిబంధనతో పోగొట్టుకున్న, చోరీ అయిన స్మార్ట్‌ఫోన్లను దుర్వినియోగం చేయకుండా బ్లాక్‌ చేయవచ్చు. ఈ చర్యలతో ఇండియాలో బ్లాక్‌ మార్కెట్‌ని కూడా నిరోధించవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన నియమం దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే కాకుండా, టాప్-ఎండ్ ఐఫోన్‌లు, శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఇతర మేడ్ ఇన్ ఇండియా ఫోన్లకు కూడా వర్తిస్తుంది.

* ICDR అంటే ఏంటి?

వివిధ కస్టమ్స్ పోర్ట్‌ల ద్వారా మొబైల్ డివైజ్‌ల దిగుమతి కోసం IMEI సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి ప్రభుత్వం 2021లో ఇండియన్‌ కౌంటర్‌ఫిటెడ్‌ డివైజ్‌ రెస్ట్రిక్షన్‌(ICDR) సిస్టమ్‌ను తీసుకొచ్చింది. కొత్త సిస్టమ్ 2020 జనవరి 1 నుంచి అమలులో ఉంది. IMEI సర్టిఫికేట్‌ల రిజిస్ట్రేషన్‌, జనరేషన్‌ కోసం వెబ్ పోర్టల్ https://icdr.ceir.gov.inను సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఈ వెబ్ పోర్టల్ ద్వారా IMEI సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్, జనరేషన్ కోసం ఎటువంటి ఛార్జీలు లేవు. ఈ కొత్త సిస్టమ్‌ పాత IMEI క్లోనింగ్, డూప్లికేషన్ నియంత్రణ వ్యవస్థను భర్తీ చేసింది. ఇది మొబైల్ స్టాండర్డ్ అలయన్స్ ఆఫ్ ఇండియా(MSAI) పరిధిలో పని చేస్తుంది. అందువల్ల MSAIకి రిజిస్ట్రేషన్, జనరేషన్‌ లేదా IMEI సర్టిఫికేట్‌ల జారీకి అధికారం లేదు.

IMEI ధ్రువీకరణ పత్రాలు ఏదైనా ఇతర వనరుల ద్వారా పొందడం, జనరేట్‌ చేయడం, జారీ చేయడం చట్టవిరుద్ధమని, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, IMEI సర్టిఫికేట్ జనరేషన్‌ ప్రాసెస్‌ కోసం దరఖాస్తుదారునికి సహాయం చేయడానికి ప్రభుత్వం ఏ ఏజెంట్‌ను లేదా థర్డ్‌ పార్టీని నియమించలేదని స్పష్టం చేసింది.

* ప్రతి ఫోన్‌కు IMEI నంబర్ ప్రత్యేకం

IMEI నంబర్ ప్రతి ఫోన్‌కు ప్రత్యేకంగా ఉంటుంది. ఇది నేరస్థులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. SIM కార్డ్‌ని మార్చవచ్చు లేదా నాశనం చేయవచ్చు, IMEI నంబర్ హార్డ్ కోడ్ చేసి ఉంటారు కాబట్టి మార్చడం సాధ్యం కాదు. ప్రజలు మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడు IMEI నంబర్ ఉందా లేదా అని తప్పకుండా పరిశీలించాలి. IMEI వివరాలను తెలుసుకోవడానికి *#06# డయల్ చేయవచ్చు. డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం, రెండు ప్రత్యేకమైన IMEI నంబర్‌లు ఉంటాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Smart phones, VIRAL NEWS

ఉత్తమ కథలు