లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?

ప్రస్తుతం గూగుల్ ప్లస్ అకౌంట్లను డిలిట్ చేస్తోంది గూగుల్. మొత్తం అకౌంట్లు డిలిట్ అయ్యాక గూగుల్ ప్లస్ పూర్తిగా నిలిచిపోతుంది. మీరు కూడా మీ గూగుల్ ప్లస్ ప్రొఫైల్‌ని డిలిట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

news18-telugu
Updated: October 9, 2018, 1:39 PM IST
లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?
గూగుల్ ప్లస్
  • Share this:
గూగుల్‌కు చెందిన సోషల్ నెట్‌వర్క్ సైట్ గూగుల్ ప్లస్‌ను మూసెయ్యాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. కారణం... 5 లక్షల మంది యూజర్ల డేటా లీకవ్వడమే. ఓ బగ్ కారణంగా 5 లక్షల మంది గూగుల్ ప్లస్ యూజర్ల డేటాకు ముప్పు వాటిల్లిందని గూగుల్ ప్రకటించింది. అందుకే ఆ సోషల్ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ని మూసెయ్యాలని నిర్ణయించింది.

2011 జూన్ 28న గూగుల్ ప్లస్ ప్రారంభమైంది. ఫేస్‌బుక్‌కు పోటీగా సోషల్ నెట్‌వర్క్‌ సైట్ గూగుల్ ప్లస్‌ని లాంఛ్ చేసింది గూగుల్. అయితే ఈ ప్లాట్‌ఫామ్ అంత క్రేజ్ సంపాదించుకోలేదు. యూజర్ల సంఖ్య తక్కువే. అయితే 2015 నుంచి గూగుల్ ప్లస్ యూజర్ల డేటా చోరీకు గురవుతోందని, సుమారు 400 థర్డ్‌ పార్టీ యాప్స్ డేటాను తస్కరిస్తున్నాయని తాజాగా బయటపడింది. గూగుల్ ప్లస్‌లో ఓ బగ్‌ని గుర్తించిన గూగుల్ ఇక ఆ సేవల్ని నిలిపివేయాలని నిర్ణించింది. గూగుల్ ప్లస్ కార్పొరేట్ సేవలు మాత్రం కొనసాగుతాయని ఆ కంపెనీ ప్రకటించింది.

అప్పుడు ఫేస్‌బుక్... ఇప్పుడు గూగుల్ ప్లస్...
ఇప్పటికే డేటా స్కామ్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చిక్కుకొని విలవిల్లాడుతోంది. ఇప్పుడు మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గూగుల్ ప్లస్‌లోనూ డేటా గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. గూగుల్ ప్లస్‌ని వాడేవాళ్లు తక్కువే అయినా... గూగుల్‌తో మీరు షేర్ చేసుకున్న సమాచారం అంతా గూగుల్ ప్లస్‌లో ఉంటుంది. ఈ నెట్‌వర్కింగ్ సైట్‌ని పూర్తిగా ఆపేసేందుకు 10 నెలల సమయం పడుతుందని అంచనా.

మీరేం చేయాలి?
ప్రస్తుతం గూగుల్ ప్లస్ అకౌంట్లను డిలిట్ చేస్తోంది గూగుల్. మొత్తం అకౌంట్లు డిలిట్ అయ్యాక గూగుల్ ప్లస్ పూర్తిగా నిలిచిపోతుంది. మీరు కూడా మీ గూగుల్ ప్లస్ ప్రొఫైల్‌ని డిలిట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
  • మీరు మీ జీమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్ పిక్చర్‌పైన క్లిక్ చేయాలి.

  • అక్కడ "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" అని కనిపిస్తే మీ అకౌంట్ గూగుల్ ప్లస్‌తో లింక్ అయినట్టు అర్థం.

  • అక్కడ క్లిక్ చేస్తే గూగుల్ ప్లస్ పేజీ ఓపెన్ అవుతుంది. మెనూ బార్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

  • స్క్రోల్ డౌన్ చేస్తే సెట్టింగ్స్ పేజీలో చివర్లో "డిలిట్ యువర్ గూగుల్ ప్లస్ ప్రొఫైల్" అనే ఆప్షన్ కనిపిస్తుంది.

  • "డిలిట్ యువర్ గూగుల్ ప్లస్ ప్రొఫైల్" క్లిక్ చేయాలి.

  • గూగుల్ ప్లస్ ప్రొఫైల్ డిలిట్ చేస్తే ఏం జరుగుతుందో వివరంగా ఉంటుంది.

  • పూర్తిగా చదివి ప్రొఫైల్ డిలిట్ చేయొచ్చు.

  • ఆ తర్వాత జీమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్ పిక్చర్‌పైన క్లిక్ చేయాలి.

  • అప్పుడు అక్కడ "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" కనిపించదు.ఇవి కూడా చదవండి:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఫేస్‌బుక్ క్లోన్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

 
Published by: Santhosh Kumar S
First published: October 9, 2018, 12:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading