Beauty Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? జర భద్రం

ఈ యాప్స్‌లో కొన్ని పోర్నోగ్రఫిక్ వీడియో ప్లేయర్ డౌన్‌లోడ్ చేస్తాయి లేదా ఫిషింగ్ వెబ్‌సైట్లకు తీసుకెళ్తాయి. వాటి వలలో పడితే ఫోన్ నెంబర్, అడ్రస్‌ లాంటి వ్యక్తిగత సమాచారం గల్లంతవుతుంది.

news18-telugu
Updated: February 9, 2019, 8:18 AM IST
Beauty Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? జర భద్రం
Alert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?
news18-telugu
Updated: February 9, 2019, 8:18 AM IST
టెక్నాలజీ పెరిగిపోతున్నకొద్దీ ఫోటోగ్రఫీ నిర్వచనం కూడా మారిపోతోంది. ఫోటో క్లిక్ చేయగానే బాగా రాలేదంటే అస్సలు ఫీలవ్వాల్సిన పనిలేదు. యాప్ స్టోర్‌లో ఫోటో ఎడిటింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఫోటోను నచ్చినట్టు మార్చుకోవచ్చు. అందంగా లేని ఫోటోలను కూడా కావాల్సినంత అందంగా మార్చేయొచ్చు. అంతేకాదు... ఫోటోలు కలిపి మంచి ఆల్బమ్ చేసుకోవచ్చు. అందుకే ఫోటోలంటే కాస్త ఆసక్తి ఉన్నవాళ్లంతా ఫోటో ఎడిటింగ్ యాప్స్‌ని విచ్చలవిడిగా వాడేస్తుంటారు. మీరు కూడా అలా యాప్ స్టోర్ నుంచి ఫోటో ఎడిటింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వాడేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో మాల్‌వేర్ సమస్య ఉన్నట్టు తేలడం కలకలం రేపుతోంది.

Read this: #Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే

గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ మాల్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి పంపిస్తోంది అంటూ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ మైక్రో గుర్తించింది. గూగుల్ ఆ యాప్స్‌ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ప్లేస్టోర్‌లోని బ్యూటీ కెమెరా యాప్స్ రిమోట్ యాడ్ కాన్ఫిగ్యురేషన్ సర్వర్లను యాక్సెస్ చేయగలదని ట్రెండ్ మైక్రో తన అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ప్రో కెమెరా బ్యూటీ, ఎమొజీ కెమెరా, సెల్ఫీ కెమెరా ప్రో, ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఎఫెక్ట్, వాల్‌పేపర్స్ హెచ్‌డీ, ప్రిజ్మా ఫోటో ఎఫెక్ట్ లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

Read this: Honor View 20: రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 సేల్



మాల్‌వేర్ ఉన్న ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఇవే....

Pro Camera Beauty
Cartoon Art Photo
Loading...
Emoji Camera
Artistic effect Filte
Art Editor
Beauty Camera
Selfie Camera Pro
Horizon Beauty Camera
Super Camera
Art Effects for Photo
Awesome Cartoon Art
Art Filter Photo
Art Filter Photo Effcts
Cartoon Effect
Art Effect
Photo Editor
Wallpapers HD
Magic Art Filter Photo Editor
Fill Art Photo Editor
ArtFlipPhotoEditing
Art Filter
Cartoon Art Photo
Prizma Photo Effect
Cartoon Art Photo Filter
Art Filter Photo Editor
Pixture
Art Effect
Photo Art Effect
Cartoon Photo Filter

ఈ యాప్స్‌లో కొన్ని పోర్నోగ్రఫిక్ వీడియో ప్లేయర్ డౌన్‌లోడ్ చేస్తాయి లేదా ఫిషింగ్ వెబ్‌సైట్లకు తీసుకెళ్తాయి. వాటి వలలో పడితే ఫోన్ నెంబర్, అడ్రస్‌ లాంటి వ్యక్తిగత సమాచారం గల్లంతవుతుంది. వీటిలో చాలా యాప్స్‌ని ఇప్పటికే లక్షల సార్లు డౌన్‌లోడ్ చేసినట్టు ట్రెండ్ మైక్రో కథనం. ఎక్కువగా ఇండియా నుంచే డౌన్‌లోడ్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. వీటిని ప్లే స్టోర్ నుంచి తొలగించినా, స్మార్ట్‌ఫోన్‌ ఈ యాప్స్ ఉన్నంత కాలం యూజర్లకు ముప్పే. అందుకే వాటిని గుర్తించి ఈ యాప్స్‌ని డిలిట్ చేయడం మంచిది. అందుకే ఎవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు ఒకటికి పదిసార్లు సరిచూసుకోవడం మంచిది. థర్డ్ పార్టీ యాప్స్‌కి వీలైనంత దూరంగా ఉండటం మేలు.

ఇవి కూడా చదవండి:

Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్

Income Tax: 80సీ లిమిట్ మొత్తం వాడేశారా? పన్ను ఆదా చేయడానికి మరో 5 మార్గాలు

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626