విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!

గూగుల్ 'నైబర్లీ' యాప్ సేవలు భారతదేశంలోని మరో ఐదు పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయి. 'నైబర్లీ' యాప్ బీటా వర్షన్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

news18-telugu
Updated: September 14, 2018, 11:34 AM IST
విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!
image: REUTERS
  • Share this:
భారతదేశంలో ముంబై, జైపూర్‌లో మాత్రమే ఇన్నాళ్లూ గూగుల్ 'నైబర్లీ' యాప్ సేవలు ఉండేవి. ఇప్పుడు మరో ఐదు పట్టణాలను ఈ జాబితాలో చేర్చారు. వైజాగ్‌తో పాటు అహ్మదాబాద్, కొయంబత్తూర్, మైసూర్, కోట ప్రాంతాలను చేర్చారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అసలేమిటి ఈ యాప్?
'నైబర్లీ'... ఇది గూగుల్ సంస్థకు చెందిన మరో యాప్. మీరున్న ప్రాంతంలో చుట్టుపక్కల ఏ అంశానికి చెందిన వివరాలైన ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. పిల్లల్ని తీసుకెళ్లడానికి మంచి పార్క్ ఏదైనా ఉందా? పిల్లల్ని ట్యూషన్‌కు ఎక్కడికి పంపిస్తే బాగుంటుంది? దగ్గర్లో మంచి మెడికల్ షాప్ ఎక్కడ ఉంది? ఏ బేకరీలో ఐటమ్స్ బాగుంటాయి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాల్ని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. మామూలుగా అయితే గూగుల్ మ్యాప్‌లోనో, లేక గూగుల్ సెర్చింజన్‌లోనూ ఇలాంటివి తెలుసుకోవచ్చు. కానీ 'నైబర్లీ' యాప్ ప్రత్యేకతలు వేరు. ఇందులో ప్రశ్నలకు స్థానికంగా ఉండేవాళ్లే సమాధానాలు ఇస్తారు.

ఒకే ప్రాంతంలో నివసించేవారిని కనెక్ట్ చేయడం 'నైబర్లీ' యాప్ ప్రత్యేకత. స్థానికంగా ఉండేవారికే అక్కడి పరిస్థితులపై, ఆ ప్రాంతంపై ఎక్కువ అవగాహన ఉంటుంది. స్థానిక భాషలోనూ ప్రశ్నలు అడగొచ్చు. సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ మహిళలు, విద్యార్థులు, ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.ఇవి కూడా చదవండి:

2019 మార్చి నుంచి 'ఇన్‌బాక్స్' యాప్ కనిపించదు!

మూడు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన యాపిల్మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!

Photos: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
First published: September 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు