ఏప్రిల్ 2న గూగుల్ ప్లస్ షట్‌డౌన్ అవుతుందని తెలుసు. అదే రోజు మరో యాప్ ఇన్‌బాక్స్‌ను కూడా మూసెయ్యనుంది గూగుల్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Inbox యాప్ గూగుల్‌కు చెందిన మరో మెయిలింగ్ ప్లాట్‌ఫామ్. 2014లో ఇన్‌బాక్స్ యాప్‌ను రిలీజ్ చేసింది గూగుల్. కానీ ఆ యాప్ యూజర్లను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇమెయిల్ స్నూజ్, ఏఐ, స్మార్ట్ రిప్లై, హై ప్రియారిటీ నోటిఫికేషన్స్, స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్లు ఉన్నా... యూజర్ల నుంచి ఆశించినంత రెస్పాన్స్ లేదు. దీంతో ఆ ఫీచర్లనే జీమెయిల్లోకి తీసుకొచ్చిన గూగుల్... ఇక 'ఇన్‌బాక్స్' యాప్‌ను లాంఛనంగా షట్‌డౌన్ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 2న అధికారికంగా ఇన్‌బాక్స్ యాప్ సేవల్ని నిలిపివేయనుంది.
Google Inbox officially shutting down in 15 days from r/Android
ఏప్రిల్2న గూగుల్‌కు చెందిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ ప్లస్‌ని లాంఛ్ చేసింది గూగుల్. 2015 నుంచి గూగుల్ ప్లస్ యూజర్ల డేటా చోరీకి గురవడం కలకలం రేపింది. 400 థర్డ్ పార్టీ యాప్స్ డేటాను కొట్టేసినట్టు గూగుల్ విచారణలో తేలింది. ఇన్ని లోపాలతో గూగుల్ ప్లస్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడం భారం కావడంతో సేవల్ని నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది. ఈ విషయాన్ని గతేడాదే ప్రకటించింది. యూజర్లు Google+ అకౌంట్లలో ఉన్న డేటాను బ్యాకప్ చేసుకోవాలని కూడా సూచించింది. మీ Google+ అకౌంట్లో ఏదైనా ముఖ్యమైన డేటా ఉంటే డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత డౌన్లోడ్ యువర్ డేటా పేజీలోకి వెళ్లాలి. మీరు కావాలనుకున్నవి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ పేజీలోకి వెళ్లి ఫైల్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ డేటాను ఎలా పొందాలో చెప్పి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read this:
CIBIL Score: మీ సిబిల్ స్కోర్ ఇక వాట్సప్‌లో... ఇలా తెలుసుకోవచ్చు
Google+ ప్లాట్ఫామ్లో మీ ప్రొఫైల్ ఏప్రిల్ 2న డిలిట్ అవుతుంది. అంతలోపే మీరే మీ ప్రొఫైల్ డిలిట్ చేయొచ్చు. జీమెయిల్ అకౌంట్లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ పిక్చర్పైన క్లిక్ చేయాలి. అక్కడ "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" అని కనిపిస్తే మీ అకౌంట్ గూగుల్ ప్లస్‌తో లింక్ అయినట్టు అర్థం. "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" పైన క్లిక్ చేస్తే గూగుల్ ప్లస్ పేజీ ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి పేజీ చివర్లో "డిలిట్ యువర్ గూగుల్ ప్లస్ ప్రొఫైల్"పై క్లిక్ చేయాలి. గూగుల్ ప్లస్ ప్రొఫైల్ డిలిట్ చేస్తే ఏం జరుగుతుందో వివరంగా ఉంటుంది. పూర్తిగా చదివి ప్రొఫైల్ డిలిట్ చేయొచ్చు. ఆ తర్వాత జీమెయిల్ అకౌంట్లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ పిక్చర్పైన క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" కనిపించదు. మీ "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" డిలిట్ అయిపోయినట్టే.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
ఇవి కూాడా చదవండి:
ఆ పావురం ధర రూ.10 కోట్లు... ఎందుకో తెలుసా...
Food Safety Jobs: ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో 275 ఖాళీలు
LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవేPublished by:Santhosh Kumar S
First published:March 22, 2019, 13:06 IST