Skin Diseases: చర్మ సమస్యలతో బాధపడేవారికి గుడ్ న్యూస్.. ఇక ఇంట్లోనే స్మార్ట్ తో టెస్టులు చేసుకోవచ్చు.. ఎలా అంటే..

ప్రతీకాత్మక చిత్రం

Google Skin Assist: చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? టెస్టుల కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? అయితే గూగుల్ తీసుకువస్తున్న ఈ టూల్ తో స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంట్లోనే మీరు పరీక్షలు చేసుకోవచ్చు.

  • Share this:
చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారా? అయితే ఇకపై ఆ అవసరం లేదు. చర్మ సంబంధిత సమస్యలను పసిగట్టే టూల్ ను గూగుల్ తీసుకురానుంది. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ టూల్ సహాయంతో చర్మ సమస్యలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఫలితంగా వైద్యులను సంప్రదించకుండానే సమస్య తీవ్రతను అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఇది వైద్య నిర్ధారణకు ప్రత్యామ్నాయం కాదని గూగుల్ తెలిపింది. "చర్మం, గోర్లు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోవడానికి గూగుల్లో ఏటా 10 బిలియన్ల శోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్ల మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఉంది. అంతేకాకుండా గూగుల్ సెర్చ్ బార్ లో అన్వేషించేందుకు చర్మ సమస్యలకు సంబంధించిన పదాలను వర్ణించడమే కష్టంగా ఉంటుంది" అని గూగుల్ తన బ్లాగ్ లో పోల్ట్ చేసింది.
Health Tips - Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, ఈ పండ్లను అస్సలు తినకండి..
Health Tips: పెరుగుతో కలిపి ఈ ఆహార పదార్థాలను తింటే డేంజర్.. అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం.. తెలుసుకోండి

గూగుల్ డెర్మటాలజీ అసిస్ట్ టూల్ ఎలా పనిచేస్తుంది?
కృత్రిమ మేధస్సు సహాయంతో పనిచేసే ఈ డెర్మటాలజీ టూల్ ను ఈ ఏడాది చివర్లో లాంచ్ చేయనుంది గూగుల్. ఈ సాధనం ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి శరీరంలో ఏ ప్రదేశంలోనైనా చర్మం ప్రాంతాన్ని పాయింట్ చేసి క్యాప్చర్ చేస్తుంది. ఈ ఇమేజ్‌ను గూగుల్ డేటాబేస్ లో ఉన్న చర్మ సమస్యలకు సంబంధించిన ఫోటోలతో పోల్చుతుంది. తన పరిజ్ఞానం ఉపయోగించి అందులో ఉండే 288 కండీషన్ల జాబితాను మీ ముందుంచుతుంది. దీని ద్వారా వీటిలో మీ సమస్యకు సరిపోయే పరిస్థితిని ఎంచుకోవచ్చు. ఈ సమాచారం ఆధారంగా కామన్ గా అడిగే ప్రశ్నలకు సమాధానాలు, పరిస్థితికి సరిపోలే ఫోటోలను ఈ టూల్ కలిగి ఉంటుంది. ఇది యూజర్ల సమస్య తీవ్రతను అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది.

అందరికీ అనుగుణంగా రూపొందించారు..
గూగుల్ డెర్మటాలజీ అసిస్ట్ టూల్ ను డెవలప్ చేయడానికి మూడేళ్ల పాటు కష్టపడ్డారు. మెషిన్ లెర్నింగ్ రీసెర్చ్ అండ్ ప్రొడక్ట్ ఆధారంగా రూపొందించారు. స్కిన్ టోన్, ఆకృతి ఎలా ఉందో తెలుసుకోవడానికి అన్ని వయస్కుల వారు, లింగాలు, జాతుల వారికి అనుగుణంగా ఈ టూల్ ను తయారుచేసినట్లు గూగుల్ సంస్థ స్పష్టం చేసింది. లైటర్ స్కిన్ టోన్, కాలిపోయిన, డార్కర్ స్కిన్ టోన్ మధ్య సైద్ధాంతిక వ్యత్యాసాన్ని గుర్తించగలదు.

వైద్య నిర్ధారణకు ప్రత్యామ్నాయం కాదు..
ఈ టూల్ రోగనిర్ధారణకు లేదా వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా రూపొందించింది కాదని గూగుల్ పేర్కొంది. ఎందుకంటే చాలా సమస్యలకు వైద్యుల పర్యవేక్షణ, చికిత్స, పరీక్షలు లాంటి ఇతర వైద్య సేవలు అవసరమని, బదులుగా ఈ సాధనం మీకు తగిన సమాచారాన్ని ఇస్తుందని తెలిపింది. కాబట్టి సమస్య తదుపరి దశ గురించి మీరు మరింత సమాచారం తెలుసుకోవచ్చని గూగుల్ తన పోస్టులో స్పష్టం చేసింది.

ఈ ప్రొడక్ట్ CE మార్క్ అందుకున్న క్లాస్ 1 మెడికల్ టూల్ గా గుర్తింపు పొందింది. అమెరికాలో మాత్రం ఇది అందుబాటులో లేదని గూగుల్ తెలిపింది. పెరుగుతున్న టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి తెలియజేయడానికి గూగుల్ I/O 2021 లో అనేక ప్రకటనలు చేసిందీ సంస్థ. ఇందులో భాగంగా చర్మ సమస్యల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి AI తో పనిచేసే పవర్డ్ డెర్మటాలజీ అసిస్ట్ టూల్ ను విడుదల చేయనుంది.
Published by:Nikhil Kumar S
First published: