హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: ఏఐ చాట్‌బాట్ ట్రైనింగ్ కోసం జీమెయిల్ డేటా వాడుతున్న గూగుల్..? కంపెనీ రెస్పాన్స్ ఇదే..

Google: ఏఐ చాట్‌బాట్ ట్రైనింగ్ కోసం జీమెయిల్ డేటా వాడుతున్న గూగుల్..? కంపెనీ రెస్పాన్స్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీమెయిల్ యూజర్ల ప్రైవేట్ డేటాకు పూర్తిస్థాయిలో ప్రైవసీని ఆఫర్ చేస్తున్నామని గూగుల్ నిత్యం భరోసా ఇస్తుంటుంది. అయితే రీసెంట్‌గా కంపెనీ తీసుకొచ్చిన AI చాట్‌బాట్‌ బార్డ్ (Bard) మాత్రం దీనికి విరుద్ధంగా సమాధానం చెప్పి షాకిచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Google: జీమెయిల్(Gmail) యూజర్ల ప్రైవేట్ డేటాకు పూర్తిస్థాయిలో ప్రైవసీని ఆఫర్ చేస్తున్నామని గూగుల్(Google) నిత్యం భరోసా ఇస్తుంటుంది. అయితే రీసెంట్‌గా కంపెనీ తీసుకొచ్చిన AI చాట్‌బాట్‌ బార్డ్ (Bard) మాత్రం దీనికి విరుద్ధంగా సమాధానం చెప్పి షాకిచ్చింది. బార్డ్ AI చాట్‌బాట్‌కు శిక్షణ ఇవ్వడానికి ఎక్కడ నుంచి డేటా తీసుకుంటున్నారని ఒక రీసెర్చర్‌ అడిగిన ప్రశ్నకు.. ప్రైవేట్ జీమెయిల్ డేటాను తీసుకుంటున్నట్లు ఇది సమాధానం ఇచ్చింది. దాంతో సదరు రీసెర్చర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

బార్డ్ ట్రైనింగ్ కోసం జీమెయిల్ నుంచి ఇంటర్నల్ డేటాను ఉపయోగిస్తున్నారనే చాట్‌బాట్ ఆన్సర్ చాలామందిలో ఆందోళనలు రేకెత్తించింది. ఇదే సమయంలో గూగుల్ అప్రమత్తమైంది. చాట్‌బాట్ చేసిన ఆరోపణలను ఖండించింది. బార్డ్ ట్రైనింగ్ డేటా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న మూలాల నుంచి వస్తుందని, ప్రైవేట్ జీమెయిల్ డేటా నుంచి కాదని స్పష్టం చేసింది.

* ఏఐ టూల్ తప్పుడు సమాధానం

గూగుల్ AI చాట్‌బాట్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రైవేట్ జీమెయిల్ డేటాను ఉపయోగించట్లేదని బ్రిటిష్ టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్ ‘ది రిజిస్టర్’ రిపోర్ట్ వెల్లడించింది. గూగుల్ తాజాగా చేసిన ప్రకటన ప్రకారం, చాలా AI చాట్‌బాట్‌ల మాదిరిగానే, బార్డ్ కూడా తప్పుదారి పట్టించే సమాచారాన్ని అప్పుడప్పుడు అందిస్తుంటుంది. AI చాట్‌బాట్‌లలో ఉపయోగించే మోడళ్లు కొన్నిసార్లు అవి అందించే సమాచారమే 100% నిజమని అతి విశ్వాసంగా ఉంటాయి. అదే ధోరణిలో బార్డ్ కూడా రీసెర్చర్‌కి తప్పుడు సమాధానానికి ఇచ్చిందని గూగుల్ వివరించింది. బార్డ్ ట్రైనింగ్ డేటా ప్రైవేట్ జీమెయిల్ లేదా ఇతర ప్రైవేట్ యాప్‌లు, సేవల నుంచి రాదని గూగుల్ స్పష్టం చేసింది.

OnePlus Offer: అదిరిపోయే ఆఫర్... ఇప్పుడు ఈ రూ.30,000 లోపే వన్‌ప్లస్ మొబైల్ కొనొచ్చు

మొత్తం మీద, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్లప్పుడూ కచ్చితమైన సమాధానాలు చెప్పలేవంటూ గూగుల్ తన AI చాట్‌బాట్ తప్పులను కప్పిపుచ్చుకుంది. అయితే ఇక్కడ బార్డ్‌ను గూగుల్ కంపెనీయే అభివృద్ధి చేసిందని గుర్తుంచుకోవాలి. అందుకే, బార్డ్‌కు సంబంధించిన సమస్యలు AI చాట్‌బాట్ డెవలపర్, యజమానిగా ఉన్న గూగుల్‌పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ఇక గూగుల్ AI చాట్‌బాట్ అయిన బార్డ్ ఇటీవల ఎంపిక చేసిన దేశాలలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ చాట్‌బాట్‌ను చాలా నెమ్మదిగా మెరుగుపరుస్తోంది.

మరోవైపు, మైక్రోసాఫ్ట్ OpenAI ChatGPT v4.0ని Bing, Edge బ్రౌజర్‌లో విలీనం చేసింది. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా బింగ్ సెర్చ్‌లో వెబ్ ట్రాఫిక్ పెరిగింది. కొత్తగా లక్షల మంది యూజర్లకు బింగ్ సెర్చ్‌ వైపు అడుగులు వేస్తున్నట్లు కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ గమనించింది. బింగ్ సెర్చ్‌ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ కింద మరిన్ని ఫీచర్లను అందజేస్తోంది. కాగా AI ఇండస్ట్రీలో గూగుల్ అగ్రస్థానంలో ఉందని అంటున్నారు. అయితే AI చాట్‌బాట్‌ల రంగంలో మాత్రం OpenAI ChatGPT వలె పురోగతిని కొనసాగించడానికి కంపెనీ ఆపసోపాలు పడుతోందని సమాచారం.

First published:

Tags: GMAIL, Google

ఉత్తమ కథలు