గూగుల్(Google) తీసుకొచ్చిన ప్రముఖ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ జీమెయిల్ (Gmail) యూజర్లకు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అందజేస్తుంది. కాగా తాజాగా జీమెయిల్ యూజర్లకు ప్యాకేజీ ట్రాకింగ్ (Package Tracking) అనే ఫీచర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో క్రిస్మస్ పండగ ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది కొత్త వస్తువులు ఆన్‌లైన్ ఆర్డర్ చేయనున్నారు. కాగా ఈ ఆర్డర్ల స్టేటస్‌ను ఈజీగా తెలుసుకునేందుకు జీమెయిల్ ప్యాకేజీ ట్రాకింగ్ అప్‌డేట్స్ యూజర్లకు అందించాలని నిర్ణయించింది. తద్వారా యూజర్లకు చాలా టైమ్ సేవ్ అవుతుంది. జీమెయిల్ ఈ ఫీచర్‌ను యూఎస్‌లో మరికొద్ది వారాల్లో తీసుకురానుంది.
సాధారణంగా ప్రజలు సాధారణ రోజులతో పాటు ఫెస్టివల్ సీజన్లలో చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తుంటారు. ఒక్కోసారి రకరకాల సైట్ల నుంచి వస్తువులను ఆర్డర్ చేస్తుంటారు. ఈ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత అవి షిప్ అయ్యాయా? ఎప్పుడు తమ వద్దకు చేరనున్నాయి? వంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ-మెయిల్స్ ఓపెన్ చేసి ఆయా ఈ కామర్స్ వెబ్‌సైట్స్ పదేపదే విజిట్ చేస్తుంటారు. దీన్నివల్ల చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా జీమెయిల్ తన ఇన్‌బాక్స్ ద్వారానే ప్యాకేజీ ట్రాకింగ్ అప్‌డేట్స్ ఆఫర్ చేయనుంది. ఈ యూజ్‌ఫుల్ ఫీచర్ కొన్ని వారాల్లో ఒక అప్‌డేట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది.
* ఫీచర్ ఉపయోగాలు
ప్యాకేజీ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా జీమెయిల్ మీ ప్యాకేజీలను ట్రాక్ చేయడానికి కంపెనీ మీ పర్మిషన్ అడుగుతుంది. షిప్పింగ్ కంపెనీల నుంచి ప్యాకేజీ స్టేటస్‌పై అప్‌డేట్స్ పొందడానికి అనుమతి ఇవ్వండని ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ద్వారా జీమెయిల్ అడుగుతుందని గూగుల్ బ్లాగ్ పోస్ట్ వెల్లడించింది. డెలివరీలను ట్రాక్ చేయడానికి జీమెయిల్‌కి పర్మిషన్ ఇచ్చాక.. ఇన్‌బాక్స్‌లోకి వచ్చే ఈమెయిల్ హెడర్ కింద 'అరైవింగ్ టుమారో', 'డెలివర్డ్ టుడే' ఇలా ఆర్డర్ స్టేటస్ కనిపిస్తుంది. జస్ట్, ఇన్‌బాక్స్ ఓపెన్ చేయగానే మీ ముందు డెలివరీ స్టేటస్ కనిపిస్తుంది కాబట్టి వేగంగా వివరాలు తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఆ మెయిల్ ఓపెన్ చేయగానే.. ఆర్డర్ స్టేటస్, షిప్పింగ్, డెలివరీ డీటెయిల్స్, తదితర డెలివరీ వివరాలతో కూడిన బాక్స్ మీకు కనిపిస్తుంది.
Tired of standing by the door waiting for your package? Help is on the way with package tracking features in #Gmail. Learn more ➡️ https://t.co/lfySCZonGy pic.twitter.com/8nh90YuPQY
— Gmail (@gmail) November 3, 2022
* ఎలా పనిచేస్తుంది?
గూగుల్ తన ప్యాకేజీ ట్రాకింగ్ ఫీచర్ మేజర్ యూఎస్ షిప్పింగ్ క్యారియర్‌లలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్యాకేజీపై అప్‌డేట్స్ అందించడానికి జీమెయిల్ ట్రాకింగ్ నంబర్ల కోసం యూజర్ల ఇన్‌బాక్స్‌ని స్కాన్ చేస్తుంది. ఆపై మీ ప్యాకేజీ నంబర్ ట్రాక్ చేసి ఆటోమేటిక్‌గా ఆర్డర్ స్టేటస్ ఈమెయిల్ కింద చూపిస్తుంది. ఇది డెలివరీ స్టేటస్‌ను యూజర్ల ఇన్‌బాక్స్ పైన ఉంచుతుంది. తద్వారా యూజర్లు ప్యాకేజీలను మెరుగ్గా ట్రాక్ చేయవచ్చు. యూజర్లు తమ ఇన్‌బాక్స్ నుంచి లేదా జీమెయిల్ సెట్టింగ్స్‌లో ప్యాకేజీ ట్రాకింగ్ అప్‌డేట్స్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, GMAIL, Technology