Google New Features: గూగుల్ నుంచి కొత్త ఫీచర్స్... మీకు ఎలా ఉపయోగపడతాయంటే

Google New Features: గూగుల్ నుంచి కొత్త ఫీచర్స్... మీకు ఎలా ఉపయోగపడతాయంటే (ప్రతీకాత్మక చిత్రం)

గూగుల్లో ప్రతిరోజూ సెర్చ్ చేసే 10 ప్రశ్నలలో ఒకటి తప్పుగా రాస్తున్నారని గూగుల్ చెబుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ సెర్చ్.. ‘డీప్ న్యూరల్ నెట్‌’తో పనిచేసే కొత్త స్పెల్లింగ్ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసింది.

  • Share this:
సెర్చ్ ఇంజన్, మ్యాప్స్ విభాగాల్లో వినియోగదారులకు సరికొత్త సేవలను అందిస్తామని గూగుల్ తెలిపింది. అక్టోబర్15న జరిగిన 'సెర్చ్ ఆన్' కార్యక్రమంలో సెర్చ్ ఇంజన్, గూగుల్ మ్యాప్స్ కోసం కొత్త ఫీచర్లను ఆ సంస్థ ప్రకటించింది. తాజా అప్‌డేట్లలో గూగుల్ మ్యాప్స్ యాప్లో కనిపించే ఇండికేటర్ ఫీచర్‌ ఒకటి. దీని ద్వారా ఏయే ప్రాంతాలు ఎప్పుడెప్పుడు రద్దీగా ఉంటాయో తెలుసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో ఈ అప్‌డేట్లు కస్టమర్లకు ఉపయోగపడనున్నాయి. సామాజిక దూరం పాటించేందుకు ఇవి కృషిచేయనున్నాయి. దీంతో పాటు గూగుల్ సెర్చ్‌ను మరింత కచ్చితత్వంతో పనిచేసేలా అభివృద్ధి చేశామని గూగుల్ పేర్కొంది. దేనిగురించైనా గూగుల్లో సెర్చ్‌ చేసేటప్పుడు అక్షర దోషం ఉన్నా, దానికి సంబంధించిన వివరాలను గుర్తించి కస్టమర్లకు చూపిస్తుంది. దీనికి అదనంగా 'హమ్ టు సెర్చ్' ఫీచర్ను కూడా ప్రకటించింది.

రద్దీ ప్రాంతాలను గుర్తిస్తుంది


కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి, సామాజిక దూరం పాటించేందుకు గూగుల్ ఇండికేటర్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుందని ఆ సంస్థ తెలిపింది. రానున్న రోజుల్లో గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్‌ పేర్ల కింద సాధారణంగా రద్దీ ఉండే ప్రాంతాలు, రద్దీ అంతగా ఉండని ప్రాంతాలను డిస్‌ప్లే చేసేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వీటి ద్వారా సామాజిక దూరం నిబంధనను అమలు చేయడంలో కస్టమర్లకు తమ వంతు సాయం చేస్తామని గూగుల్ పేర్కొంది. గూగుల్ లొకేషన్ హిస్టరీ డేటాను విశ్లేషిచండం ద్వారా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఆ డేటా ఆధారంగా ఆయా ప్రాంతాలు ఏయే సమయాల్లో, ఎంత బిజీగా ఉంటాయో మ్యాప్స్‌లో కనిపిస్తుంది.

Flash Sale: ఫ్లాష్ సేల్‌లో స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే

iPhone: మీ పాత ఫోన్ ఇచ్చేసి రూ.10 వేలకే ఐఫోన్ కొనండి ఇలా

అక్షర దోషాలను గుర్తిస్తుంది


గూగుల్లో ప్రతిరోజూ సెర్చ్ చేసే 10 ప్రశ్నలలో ఒకటి తప్పుగా రాస్తున్నారని గూగుల్ చెబుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ సెర్చ్.. ‘డీప్ న్యూరల్ నెట్‌’తో పనిచేసే కొత్త స్పెల్లింగ్ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది స్పెల్లింగ్ మిస్టేక్‌(అక్షర దోషాలు)లను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెర్చ్‌ బార్‌లో ఏదైనా అంశం గురించి వెతికేటప్పుడు, దానికి సంబంధించిన సబ్ టాపిక్స్‌ను డిస్‌ప్లే చేసేలా న్యూరల్ నెట్స్ పనిచేస్తుంది. ఉదాహరణకు.. మనం ఇళ్లలో వాడే వ్యాయామ సామగ్రి గురించి గూగుల్‌లో వెతికితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో బడ్జెట్ పరికరాలు, ప్రీమియం వస్తువులు, స్మాల్ స్పేస్ ఐడియాలు వంటి సబ్ టాపిక్‌లను గూగుల్ డిస్‌ప్లే చేస్తుంది. వాటిలో మనకు అవసరమయ్యే కంటెంట్ను ఎంచుకోవచ్చు. ఈ సంవత్సరం చివర్లో ఈ ఫీచర్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ సేల్ మొదలైంది... అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

Credit Card Discounts: ఫెస్టివల్ సీజన్‌లో ఈ క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు

వీడియోలు కూడా


గూగుల్ సెర్చ్‌లో వెతికే వీడియోలకు సంబంధించి మరింత కచ్చితమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో గూగుల్ పనిచేస్తోంది. ఇందుకు సందర్భానుసారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలను కస్టమర్లకు సూచిస్తుంది. తాము సెర్చ్ చేయాలనుకున్న పాట లిరిక్స్‌ను వినియోగదారులు మర్చిపోతే... హమ్ టూ సెర్చ్ ఫీచర్ ద్వారా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లను ఎప్పుడు విడుదల చేస్తామనే వివరాలను గూగుల్ ప్రకటించలేదు.
Published by:Santhosh Kumar S
First published: