సాధారణంగా బయట ప్రదేశాల్లో ఫొటో దిగినప్పుడు మన వెనుక లేదా పక్కన ఇతర వ్యక్తులు కూడా పడుతుంటారు. వీరి వల్ల ఫొటో లుక్ పోతుందని చాలామంది డిసప్పాయింట్ అయిపోతుంటారు. ఇలాంటి వారి కోసం టెక్ దిగ్గజం గూగుల్ తన యూజర్ల కోసం 'మ్యాజిక్ ఎరేజర్ (Magic Eraser)' అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది యూజర్లు తమ ఫొటోల నుంచి అనవసరమైన వ్యక్తులను లేదా వస్తువులను తొలగించడానికి సహాయ పడుతుంది. ఈ ఫీచర్ మొన్నటిదాకా లేటెస్ట్ పిక్సెల్ ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఇది ఓల్డ్ పిక్సెల్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వస్తోంది. అంతేకాదు, iOS, Android డివైజ్‌లలో Google One సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి కూడా అందుబాటులోకి వస్తోంది. ఈ విషయాన్ని తాజాగా గూగుల్ కంపెనీ వెల్లడించింది.
మ్యాజిక్ ఎరేజర్‌తో మీరు మీ ఫొటోల మీద సర్కిల్ చేయడం లేదా బ్రష్ చేయడం ద్వారా వాటి నుంచి డిస్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ సులభంగా తొలగించవచ్చు. ఈ ఫొటో ఎడిటింగ్ టూల్ అనవసరమైన వస్తువులను లేదా వ్యక్తులను చాలా సులభంగా గుర్తిస్తుంది. ఫొటోలో నుంచి ఏమి తీసివేయాలనే దానిపై సూచనలను కూడా అందిస్తుంది.
గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న నాన్-పిక్సెల్ ఫోన్ యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. అందుకు వారు గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి.. ఎడిట్ చేయాలనుకుంటున్న ఫొటోపై క్లిక్ చేయాలి. అప్పుడు మ్యాజిక్ ఎరేజర్ అనే ఎడిటింగ్ టూల్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకుంటే, ఎడిట్ > టూల్స్ > మ్యాజిక్ ఎరేజర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఫొటోలో అనవసరమైనవి ఎరేజ్ చేయవచ్చు. ఇక Camouflage ఫీచర్‌తో మీరు మీ ఫొటోలోని వస్తువుల రంగును కూడా మార్చవచ్చు.
అంతేకాకుండా, ఇకపై గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్లు మ్యాజిక్ ఎరేజర్‌తో పాటు HDRతో తమ వీడియోల బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌ను కూడా పెంచుకోవచ్చు. కంపెనీ తాజాగా కొత్త స్టైల్స్, డిజైన్‌లతో కోల్లెజ్ ఎడిటర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. యూఎస్, కెనడా, యూరోపియన్ యూనియన్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని Google One సబ్‌స్క్రైబర్లు కోల్లెజ్ మేకర్ నుంచి చేసిన ప్రింట్ ఆర్డర్‌లపై ఫ్రీ షిప్పింగ్‌ను పొందవచ్చు.
ఇది కూడా చదవండి : బీ అలర్ట్.. ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే ఫసక్కే!
మ్యాజిక్ ఎరేజర్‌ని ఉపయోగించడం అనేది వారి ఫోటోలను క్లీన్ చేయాలనుకునే, అన్‌వాంటెడ్ పీపుల్/ ఆబ్జెక్ట్స్ తొలగించాలనుకునే ఎవరికైనా ఉపయోగపడే బెస్ట్ టూల్ అని చెప్పవచ్చు. ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నది వ్యక్తి అయినా, వస్తువు అయినా లేదా పవర్ లైన్ అయినా, మీరు వాటిని కొన్ని సింపుల్ ట్యాప్‌లతో ఫొటో నుంచి కనిపించకుండా చేయవచ్చు.
మీరు మిగిలిన ఫోటోతో కలపడానికి వస్తువుల రంగును కూడా మార్చవచ్చు. మొత్తంమీద, మ్యాజిక్ ఎరేజర్ అనేది వారి ఫొటోలను మెరుగుపరచాలనుకునే ఎవరికైనా ఉపయోగకరమైన ఫీచర్. దీనితో మీ ఫొటోలు మరింత ప్రొఫెషనల్‌గా కనిపించేలా చేయవచ్చు. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఆల్రెడీ తీసుకున్న వారు తమ Android లేదా iOS డివైజ్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.