టెక్ దిగ్గజం గూగుల్ (Google) తన వర్క్‌స్పేస్ యూజర్లకు గుడ్‌న్యూస్ అందించింది. యూజర్స్ ఈ-మెయిల్స్, డాక్యుమెంట్స్ రాయడాన్ని సులభతరం చేసేందుకు Gmail, Google డాక్స్ వంటి వర్క్‌స్పేస్ టూల్స్ కోసం గూగుల్ కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఉపయోగించే ఈ అప్‌కమింగ్ ఫీచర్లు, వాక్యాలను పూర్తి చేయడానికి పదాలు, పదబంధాల(Phrases)ను సూచిస్తాయి. లేదా యూజర్ నుంచి కొన్ని ప్రాంప్ట్‌ల ఆధారంగా మొత్తం రిప్లైలు, డ్రాఫ్ట్స్ రాస్తాయి. ఈ ఫీచర్లు గూగుల్ క్లౌడ్-ఆధారిత బిజినెస్ టూల్స్‌లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. డెవలపర్లు వారి సొంత AI-పవర్డ్ అప్లికేషన్లను రూపొందించడానికి కొత్త టూల్స్‌ను యాక్సెస్ చేయగలుగుతారు. మైక్రోసాఫ్ట్ టూల్స్‌కి పోటీగా గూగుల్ ఈ ఫీచర్లను పరిచయం చేస్తోంది.
* ఏఐ ఫీచర్లు ఇవే
గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్‌ను మరింత సులభంగా, సురక్షితంగా ఉపయోగించడానికి డెవలపర్లు, బిజినెస్‌ల కోసం కొత్త టూల్స్ విడుదల చేసింది. ఈ టూల్స్‌లో MakerSuite అని పిలిచే ప్రోటోటైపింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది.
అంతేకాదు, డెవలపర్లు గూగుల్ AI మోడల్స్‌ను వారి సొంత అప్లికేషన్లలో సులభంగా ఇంటిగ్రేట్ చేయడానికి APIs ఉన్నాయి. ఇక గూగుల్ వర్క్‌స్పేస్ టూల్స్/యాప్స్‌కి కొత్తగా యాడ్ చేయనున్న AI ఫీచర్లు ఎంటర్‌ప్రైజ్-లెవెల్ సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రైవసీని యూజర్లకు ఆఫర్ చేస్తాయి. యూజర్లు వీటిని తమ ఇతర గూగుల్ క్లౌడ్ సొల్యూషన్లతో కలపవచ్చు.
* కొత్త AI ఫీచర్ల బెనిఫిట్స్
గూగుల్ అప్‌కమింగ్ AI ఫీచర్లు వర్క్‌స్పేస్ టూల్స్‌లో యూజర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తాయి. వీటి సాయంతో జీమెయిల్‌లో యూజర్లు తమ ఈమెయిల్‌లను డ్రాఫ్ట్ చేయడానికి, రిప్లై ఇవ్వడానికి, సమ్మరైజ్ చేయడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి AIని ఉపయోగించవచ్చు. డాక్స్‌లో యూజర్లు తమ డాక్యుమెంట్లను స్టార్ట్ చేయడానికి కావలసిన ఐడియాలు ఈ ఫీచర్లతో పొందవచ్చు. డాక్యుమెంట్లను ప్రూఫ్ రీడ్, రైట్, రీరైటు చేయడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు.
స్లయిడ్స్‌లో యూజర్ల క్రియేటివ్ విజన్‌కి విజువల్, ఆడియో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి AI ఫొటో, ఆడియో, వీడియోలను రూపొందించగలదు. షీట్స్‌లో యూజర్లు AI అందించే ఆటో-కంప్లీషన్, ఫార్ములా జనరేషన్, కాంటెక్సువల్ కేటగిరేషన్ ఉపయోగించి అనార్గనైజ్డ్ డేటాను ఇన్‌సైట్స్, అనాలసిస్‌లుగా మార్చవచ్చు. గూగుల్ మీట్‌లో, యూజర్లు కొత్త బ్యాక్‌గ్రౌండ్స్ రూపొందించడానికి, నోట్స్‌ను రికార్డ్ చేయడానికి AIని ఉపయోగించవచ్చు. చాట్‌లో AI యూజర్లకు పనులను మరింత సమర్థవంతంగా చేయడానికి, వర్క్‌ఫ్లోలను నిర్వహించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి : ‘సెక్యూరిటీ టెస్టింగ్’పై స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు షాక్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
ఇక AIతో ప్రయోగాలు చేయాలనే ఆసక్తి ఉన్న డెవలపర్‌ల కోసం గూగుల్ కొత్త టూల్స్ అందిస్తోంది. ఇందులో PaLM API కూడా ఉంది. ఈ టూల్‌తో డెవలపర్లు లాంగ్వేజ్ మోడల్స్‌ను ఈజీగా, సెక్యూర్‌గా డెవలప్ చేయవచ్చు. PalM APIలో వచ్చే MakerSuite ఒక ప్రోటోటైపింగ్ టూల్‌గా పనికొస్తుంది. సొంత AI మోడల్‌లు, అప్లికేషన్‌లను రూపొందించి, కష్టమైజ్ చేయాలనుకునే డెవలపర్లు గూగుల్ క్లౌడ్‌లో PalMతో సహా గూగుల్ ముందుగా ఉన్న మోడల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google documents, Microsoft, Tech news