గూగుల్ నుంచి తుఫాను హెచ్చరికలు!

వరదల సమయంలో గూగుల్ విశేష సేవలందిస్తోంది కూడా. ఇప్పుడు గూగుల్ ఏఐని అనుసంధానించడంతో మరిన్ని కచ్చితమైన అలర్ట్స్ అందుతున్నాయి.

news18-telugu
Updated: September 26, 2018, 4:59 PM IST
గూగుల్ నుంచి తుఫాను హెచ్చరికలు!
వరదల సమయంలో గూగుల్ విశేష సేవలందిస్తోంది కూడా. ఇప్పుడు గూగుల్ ఏఐని అనుసంధానించడంతో మరిన్ని కచ్చితమైన అలర్ట్స్ అందుతున్నాయి.
  • Share this:
వర్షాలెప్పుడు కురుస్తాయో, తుఫానులు ఎక్కడెక్కడ వస్తాయో ప్రభుత్వ వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తుంటాయి. ఇప్పుడు గూగుల్ కూడా ఆ బాధ్యతల్ని పంచుకుంటోంది. గూగుల్ మ్యాప్స్‌ ద్వారా వరదల సమాచారం, అలర్ట్స్ పంపిస్తోంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటోంది.

గూగుల్ పబ్లిక్ అలర్ట్స్‌లో భాగంగా ఈ సేవల్ని అందిస్తోంది దిగ్గజ కంపెనీ. ఇప్పటికే ప్రజలు గూగుల్ ద్వారా తమకు కావాల్సిన సమాచారంతో పాటు మ్యాప్స్, ట్రాఫిక్ అలర్ట్స్ ఉపయోగించుకుంటున్నారు. వరదల సమయంలో గూగుల్ విశేష సేవలందిస్తోంది కూడా. ఇప్పుడు గూగుల్ ఏఐని అనుసంధానించడంతో మరిన్ని కచ్చితమైన అలర్ట్స్ అందుతున్నాయి.

వర్షాలు కురవడం, ఏఏ ప్రాంతాల్లో వరదలు వస్తాయో చెప్పడం మాత్రమే కాదు... వరద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో కూడా ముందే అంచనా వేయగల వ్యవస్థను గూగుల్ రూపొందిస్తోంది. గూగుల్ ఏఐ వరదల హెచ్చరికల వ్యవస్థను ఇండియాలో కూడా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో నీటి వనరులను పర్యవేక్షించే సెంట్రల్ వాటర్ కమిషన్‌తో ఇప్పటికే గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

GOOGLE, TRACK, LOCATION, WEB ACTIVITY, flood alerts, గూగుల్, ట్రాక్, లొకేషన్, వెబ్ యాక్టివిటీ, వరద హెచ్చరికలు
image: Google
గూగుల్ తొలిసారిగా పాట్నాలో వరద హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ మొదట్లో గూగుల్ ఇచ్చిన తొలి అలర్ట్ ఇది. సో... ఇకపై గూగుల్ నుంచి ట్రాఫిక్ అలర్ట్స్ మాత్రమే కాదు... వరద హెచ్చరికలు కూడా రానున్నాయి.

ఇవి కూడా చదవండి:

మీ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ ఉందా? ఈ న్యూస్ మీకోసమే!గూగుల్ అసిస్టెంట్‌లో మరింత లోతుగా గూగుల్ న్యూస్!

గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!

లొకేషన్ ఆఫ్ చేసినా ట్రాక్ చేస్తామంటున్న గూగుల్!

యూజర్లను ట్రాక్ చేసి కేసులో బుక్కైన గూగుల్!

విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!

 
First published: September 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>