యాప్ అవసరం లేదు... గూగుల్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు ఇలా

Google Order Online Feature | మీరు సెర్చ్ చేసిన రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్స్ సపోర్ట్ చేస్తే చాలు. మీరు డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేసి ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. మీ ఆర్డర్ గూగుల్ ఇంటర్‌ఫేస్, గూగుల్ పే ద్వారా జరిగిపోతుంది.

news18-telugu
Updated: May 27, 2019, 12:47 PM IST
యాప్ అవసరం లేదు... గూగుల్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు ఇలా
యాప్ అవసరం లేదు... గూగుల్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు ఇలా (image: REUTERS)
news18-telugu
Updated: May 27, 2019, 12:47 PM IST
గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై మీరు ఫుడ్ ఆర్డర్ చేయడానికి యాప్ అవసరం లేదు. స్విగ్గీ, జొమాటో, ఊబెర్ ఈట్స్ లాంటి యాప్స్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసి ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. గూగుల్ సెర్చ్ మాత్రమే కాదు గూగుల్ మ్యాప్స్, అసిస్టెంట్ ద్వారా మీరు ఆర్డర్స్ చేయొచ్చు. ఇందుకోసం గూగుల్ కొత్తగా "Order Online" బటన్‌ను సెర్చ్‌తో పాటు మ్యాప్స్‌లో యాడ్ చేసింది గూగుల్. మీరు ఏదైనా రెస్టారెంట్ లేదా ఫుడ్ కోసం వెతికినప్పుడు మీకు "Order Online" బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసి మీరు ఆర్డర్ కొనసాగించొచ్చు. పేమెంట్ కూడా చేయొచ్చు. ఫుడ్ ఆర్డర్ చేయడానికి మీకు స్విగ్గీ, జొమాటో, ఊబెర్ ఈట్స్ యాప్స్ అవసరం ఉండదు ఇక. మీరు సెర్చ్ చేసిన రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్స్ సపోర్ట్ చేస్తే చాలు. మీరు డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేసి ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. మీ ఆర్డర్ గూగుల్ ఇంటర్‌ఫేస్, గూగుల్ పే ద్వారా జరిగిపోతుంది.

Read this: Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...

మీరు ఒకసారి ఆర్డర్ చేసిన ఫుడ్ మళ్లీ ఆర్డర్ చేయాలంటే మొత్తం ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్ గూగుల్ అసిస్టెంట్‌కు చెప్తే చాలు. మీ ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ గూగుల్ అసిస్టెంట్ ద్వారా పనిచేసే స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్‌ప్లేకు సపోర్ట్ చేస్తుందా లేదా అన్న స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ సర్వీస్ అమెరికాలో ప్రారంభమైంది. DoorDash, Postmates, Delivery.com, Slice,, ChowNow లాంటి డెలివరీ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్. త్వరలో ఈ సేవలు మిగతా దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. కొంతకాలంగా మొబైల్ కోసం సెర్చ్ ఇంటర్‌ఫేస్‌లో చాలా మార్పులు తీసుకొస్తోంది గూగుల్. అందులో భాగంగానే ఫుడ్ ఆర్డర్ సర్వీసుల్ని ప్రారంభించింది.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:

Xiaomi: షావోమీ నుంచి సన్‌గ్లాసెస్... ధర రూ.899 మాత్రమే
Loading...
Tata Sky: టాటా స్కై సెట్ టాప్ బాక్స్ ధరలు తగ్గాయి... కొత్త రేట్లు ఇవే

IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...