హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Assistant Driving Mode: మీరు డ్రైవింగ్ చేస్తుంటారా? గూగుల్ నుంచి కొత్త ఫీచర్

Google Assistant Driving Mode: మీరు డ్రైవింగ్ చేస్తుంటారా? గూగుల్ నుంచి కొత్త ఫీచర్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Google Assistant Driving Mode | డ్రైవింగ్ చేసేవారికోసం గూగుల్ సరికొత్త ఫీచర్స్ అందిస్తోంది. గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

టెక్​ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను చేరుస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే గూగుల్ తాజాగా 'అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ గూగుల్ అసిస్టెంట్​ డ్రైవింగ్​ మోడ్​ ఫీచర్​.. ఇకపై భారత్​తో పాటు ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, సింగపూర్‌లోని గూగుల్ వినియోగదారులుకు అందుబాటులో ఉండనుంది. వినియోగదారుల డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్​ ఎంతగానో ఉపయోగపడుతుందని గూగుల్​ స్పష్టం చేసింది. ఇంతకీ, గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనితో ఉపయోగాలేంటి? ఏ ఏ డివైజెస్​కు సపోర్ట్​ చేస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

LG Wing: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్ అంటే?


గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్​ అనేది మీకు మెరుగైన డ్రైవింగ్​ అనుభవాన్ని అందిస్తుంది. మీరు డ్రైవింగ్​ చేస్తోన్న క్రమంలో మీ దృష్టి మరలకుండా చేస్తుంది. కాల్​ లిఫ్ట్​ చేయడం, కట్​ చేయడం, మ్యూజిక్​ ప్లే చేయడం, మెసేజెస్​ పంపించడం వంటి పనులన్నీ డ్రైవింగ్​ చేస్తూనే వాయిస్​ అసిస్టెంట్​ ద్వారా పూర్తి చేయవచ్చు. తద్వారా, మీ దృష్టి ఇతర వాటిపై మరలకుండా, కేవలం డ్రైవింగ్​పైనే​ శ్రద్ధ వహించేలా చేస్తుంది. గూగుల్​ నావిగేషన్ స్క్రీన్‌ను వదలకుండానే డ్రైవింగ్ మోడ్ ఇవన్నీ సాధ్యం చేస్తుంది. తద్వారా యాక్సిడెంట్లను నివారిస్తుందని గూగుల్ తెలిపింది. అంతేకాక, మీ ఫోన్​కు ఇన్‌కమింగ్ కాల్స్​ వచ్చినప్పుడు మిమ్మల్ని అలర్ట్​ చేస్తుంది. మీ వాయిస్​తో సదరు కాల్​కు సమాధానం ఇవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అంతేకాక, యూట్యూబ్, మ్యూజిక్, స్పాటిఫై, గూగుల్ పాడ్‌కాస్ట్‌, మరెన్నో మ్యూజిక్​ లైబ్రరీల నుండి వాయిస్​ అసిస్టెంట్​తోనే సంగీతాన్ని ప్లే చేయవచ్చు.

Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో రూ.2,499 ధరకే కొనండి ఇలా

WhatsApp: మీరు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

ఎలా యాక్టివేట్ చేయాలి?


ప్రస్తుతం, ఈ కొత్త ఫీచర్​ను టెస్టింగ్ దశ​లోనే ఉంది. అయితే, ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్లకు మాత్రం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ గూగుల్​ అసిస్టెంట్​ డ్రైవింగ్​ ఫీచర్​ను యాక్టివేట్​ చేసుకోవాలంటే మీ గూగుల్​ మ్యాప్స్​ యాప్​లోని అసిస్టెంట్ సెట్టింగ్స్​లోకి వెళ్లి ‘ట్రాన్స్‌పోర్టేషన్’ ఆప్షన్​ను సెలక్ట్​ చేసుకోవాలి. తద్వారా ఈ ఫీచర్​ ఆన్​ అవుతుంది. కాగా, ఈ ఫీచర్​ను ఆండ్రాయిడ్ 9.0 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించవచ్చని గూగుల్ తెలిపింది. అంతేకాకుండా, 4GB ర్యామ్​ లేదా అంతకంటే ఎక్కువ ర్యామ్​ కలిగి ఉన్న స్మార్ట్​ఫోన్లలో ఇది సులభంగా పనిచేస్తుంది.

First published:

Tags: Google, Google Assistant, Google news

ఉత్తమ కథలు