టెక్ దిగ్గజం గూగుల్ తమ వర్క్‌స్పేస్ (Google Workspace) ఫోరంలో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో జీమెయిల్ (Gmail) వాడేవారి కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. జీమెయిల్ యాప్‌లో కొత్త సెర్చ్ ఫిల్టర్‌ను తాజాగా యాడ్ చేసింది. సాధారణంగా గూగుల్ కొన్ని రకాల కొత్త ఫీచర్లను ముందు డెస్క్‌టాప్ యూజర్లకు అందించి.. ఆ తరువాత ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్‌లో ప్రవేశపెడుతుంది. సెర్చ్ ఫిల్టర్స్ (Search Filters) విషయంలో కూడా సంస్థ ఇదే సూత్రాన్ని అనుసరించింది. గత ఏడాది ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్ వెర్షన్‌లో అందించగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్‌లకు యాడ్ చేసింది. ఇవి యూజర్లకు కచ్చితమైన ఫలితాలను అందించడంలో సహాయపడతాయని గూగుల్ పేర్కొంది.
Samsung Galaxy M52 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం52 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే
సాధారణంగా మన జీమెయిల్ ఇన్‌బాక్స్‌కు ఎన్నో మెయిల్స్ వస్తుంటాయి. వీటితోపాటు యూజర్లు సెండ్ చేసే మెయిల్స్ సైతం ప్లాట్‌ఫాంలోనే సేవ్ అవుతాయి. కొత్త సెర్చ్ ఫిల్టర్ల సాయంతో వినియోగదారులు వీటన్నింటినీ సులభంగా యాక్సెస్ చేయవచ్చు. సంబంధిత ఈమెయిల్‌లను మరింత సులభంగా గుర్తించవచ్చు. కొత్త ఫిల్టర్‌లలో 'From', 'Sent to', 'Date', 'Attachment' ఆప్షన్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో జీమెయిల్‌లోని సెర్చ్ బార్ కింద ఈ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి ద్వారా వినియోగదారులు తమ ఇన్‌బాక్స్‌లోని ఈమెయిల్స్ కోసం వెతకవచ్చు. ఈ సెర్చ్ ఫిల్టర్‌లు భారీ మొత్తంలో ఉండే ఈమెయిల్‌లను జల్లెడ పట్టడంతో పాటు కచ్చితమైన ఫలితాలను అందిస్తాయి.
Google Apps: అలర్ట్... ఈ స్మార్ట్‌ఫోన్లలో యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ పనిచేయవు
సంబంధిత ఈమెయిల్‌లను యాక్సెస్ చేయడానికి యూజర్లు సెర్చ్ బార్‌లో ముందు ఫిల్టర్ పేరును టైప్ చేయాలి. ఆ తరువాత వాటి నుంచి మెయిల్స్ కోసం వెతకవచ్చు. వీటి ద్వారా సెర్చ్ రిజల్ట్స్‌ను మరింత వడపోయడానికి సైతం వీలుంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తోంది. కొంతమంది యూజర్లకు ఇప్పటికే ఈ అప్‌డేట్ వచ్చినట్లు తెలుస్తోంది.
Realme Offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్
సెర్చ్ ఫిల్టర్స్ ఫీచర్‌ను పొందడానికి ఆండ్రాయిడ్ యూజర్లు జీమెయిల్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి అప్‌డేట్ చేసుకోవాలి. అయితే అప్‌డేట్ చేసిన తర్వాత కూడా కొందరికి ఈ ఫీచర్ రాకపోవచ్చు. అక్టోబర్ చివరి నాటికి ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుందని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ కస్టమర్లతో పాటు జీ- సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, GMAIL, Google, Google news