Home /News /technology /

GOOGLE TIPS ARE YOU USING GOOGLE ASSISTANT DONT MISS THESE NEW FEATURES HERE IS ITS BENEFITS GH SK

Google Assistant: గూగుల్ అసిస్టెంట్ వాడుతున్నారా? ఈ అదిరిపోయే ఫీచర్లను అస్సలు మిస్ చేయకండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google Tips: గూగుల్ అసిస్టెంట్ అనేది అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే టెక్నాలజీ. ఇది యూజర్లకు అనేక రకాల సేవలందిస్తుంది. వార్తలను డిస్‌ప్లే చేయడం దగ్గరి నుంచి కిరాణా సామాగ్రి కొనుగోలు చేయమని గుర్తు చేయడం వరకు.. అన్ని రకాల అలర్ట్స్ సెట్ చేస్తుంది.

ఇంకా చదవండి ...
Google Assistant: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం టెక్ దిగ్గజం గూగుల్ (Google) అందిస్తున్న వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ గూగుల్ అసిస్టెంట్. గూగుల్ అసిస్టెంట్ అనేది అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే టెక్నాలజీ. ఇది యూజర్లకు అనేక రకాల సేవలందిస్తుంది. వార్తలను డిస్‌ప్లే చేయడం దగ్గరి నుంచి కిరాణా సామాగ్రి కొనుగోలు చేయమని గుర్తు చేయడం వరకు.. అన్ని రకాల అలర్ట్స్ సెటప్ చేయగలదు. యూజర్లు ‘హే, గూగుల్’ అని చెప్పడమే ఆలస్యం.. విభిన్న రకాల సేవలందిస్తుంది. అయితే సాధారణ యూజర్లకు తెలియని అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఈ టెక్నాలజీ అందించగలదు. వీటి గురించి తెలియకపోతే, దీని సేవలను పూర్తిగా వినియోగించుకోలేమని తెలుసుకోవాలి. యూజర్ల డైలీ లైఫ్ యాక్టివిటీస్‌ను మరింత సులభతరం చేసే టాప్ గూగుల్ అసిస్టెంట్ (Google Assistant) ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

* డైలీ న్యూస్ డిస్‌ప్లే చేయడం
మీకు డైలీ న్యూస్ చదవడానికి టైమ్ లేకపోయినా సరే.. గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీ చుట్టూ, దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇందుకు గూగుల్ అసిస్టెంట్ సహాయం తీసుకోవచ్చు. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది?, తాజా వార్తలు ఏంటి? అని అడిగితే చాలు, వర్చువల్ అసిస్టెంట్ మీకు ప్రపంచంలోని తాజా ఈవెంట్‌ల సమరీని ఆటోమెటిక్‌గా అందించడం ప్రారంభిస్తుంది. ఏదైనా అప్లికేషన్ రొటీన్‌లో సేవ్ చేయకపోయినా సరే.. ఈ ఫీచర్ పని చేస్తుంది.

ఎలక్ట్రానిక్ రంగంలో ఇదో అద్భుతం.. ఇక కరెంట్ లేకుండానే ఏసీ.. భారీ బిల్లుల నుంచి ఉపశమనమే..!

* నావిగేషన్ రూట్స్ గుర్తించడం
వర్చువల్ అసిస్టెంట్ మీ డెస్టినేషన్‌కు బెస్ట్ రూట్స్‌ను కనుగొంటుంది. ఇందుకు GPS ఫంక్షన్‌ సహాయం తీసుకుంటుంది. ఫాస్టెస్ట్, ట్రాఫిక్ లేని రూట్స్ నావిగేట్ చేయడానికి, చూడటానికి వాయిస్ కమాండ్‌ను యాక్టివేట్ చేస్తే చాలు. గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్స్‌లో పన్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రిఫరెన్స్‌కు వెళ్లి మీ డెస్టినేషన్ అడ్రస్ సేవ్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ పొందండి.



* అలారం సెట్ చేయడం
అలారాలను సెట్ చేసే ఫంక్షనాలిటీ కూడా గూగుల్ అసిస్టెంట్‌లో అందుబాటులో ఉంది. ఇది మీ డైలీ రొటీన్‌ను మరింత ఈజీగా మ్యానేజ్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు ‘స్లీప్‌టైమ్’ అని చెప్పి.. మీ స్లీపింగ్ టైమ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ మిమ్మల్ని అలారం టైమ్ గురించి అడుగుతుంది. అంతేకాదు, మంచి నిద్ర కోసం రిలాక్సింగ్ సౌండ్స్ ప్లే చేస్తుంది. తర్వాతి రోజు బ్యాటరీని రీఛార్జ్ చేయాలంటే, ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. ‘Set alarm’ అని చెప్పడం ద్వారా కూడా సులభంగా అలారం సెట్ చేసుకోవచ్చు.

Nord 2T Smartphone: కాసేపట్లో అమెజాన్ లో Nord 2T స్మార్ట్ ఫోన్ సేల్.. బడ్జెట్ ధరలో అందుబాటులోకి..

* రిమైండర్స్ సెట్ చేయడం
గూగుల్ అసిస్టెంట్ అందించే అత్యంత ఉపయోగకరమైన టూల్స్‌లో ఒకటి రిమైండర్స్ మేనేజ్ చేయడం. యూజర్లు ఒక నిర్దిష్ట సమయం, రోజులో చేయాల్సిన పనుల కోసం రిమైండర్‌ సెట్ చేసుకోవచ్చు. రేపు మధ్యాహ్నం బాస్‌కి కాల్ చేయమని నాకు గుర్తు చెయ్యి.. లేదా కిరాణా సామాగ్రి ఆర్డర్ చేయమని గుర్తు చెయ్యి.. ఇలాంటివి రిమైండర్‌గా సెట్ చేసుకోవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Google, Google Assistant, Google new feature, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు