Home /News /technology /

Microsoft Bing: మైక్రోసాఫ్ట్ బింగ్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదం ‘గూగుల్’.. యాంటీట్రస్ట్ కేసులో గూగుల్ న్యాయవాది కీలక వ్యాఖ్యలు​

Microsoft Bing: మైక్రోసాఫ్ట్ బింగ్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదం ‘గూగుల్’.. యాంటీట్రస్ట్ కేసులో గూగుల్ న్యాయవాది కీలక వ్యాఖ్యలు​

బింగ్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదం గూగుల్..(ప్రతీకాత్మక చిత్రం)

బింగ్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదం గూగుల్..(ప్రతీకాత్మక చిత్రం)

ప్రపంచ వ్యాప్తంగా సెర్చ్​ ఇంజిన్​లో గూగుల్​దే పైచేయి. అయితే మైక్రోసాఫ్ట్ సైతం గూగుల్​కు పోటీగా ‘బింగ్‌ సెర్చ్​ ఇంజిన్​ను నిర్వహిస్తున్న సంగతి తెలసిందే.

ప్రపంచ వ్యాప్తంగా సెర్చ్​ ఇంజిన్​లో (Search Engine) గూగుల్​దే (Google) పైచేయి. అయితే మైక్రోసాఫ్ట్ (Microsoft) సైతం గూగుల్​కు పోటీగా ‘బింగ్‌' (Bing) సెర్చ్​ ఇంజిన్​ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, దీనికి అంతగా ఆదరణ లభించట్లేదు. నెటిజన్లు బింగ్ సెర్చింజన్​లోనూ​ 'గూగుల్' పదాన్ని సెర్చ్​ చేయడం దీనికి నిదర్శనం. 2018 యాంటీట్రస్ట్ పెనాల్టీ కేసు విచారణలో భాగంగా ఆల్ఫాబెట్ ఇంక్ యూనిట్ న్యాయవాది అల్ఫోన్సో లామాడ్రిడ్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ ఈ విషయం గురించి చెప్పారు. "మైక్రోసాఫ్ట్​కు చెందిన బింగ్‌ సెర్చ్​ ఇంజన్​లో సైతం గూగుల్​ పదాన్ని ఎక్కువ మంది యూజర్లు శోధించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించాం’’ అని కోర్డుకు తెలియజేశారు.

ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ ద్వారా గూగుల్​ అవకతవకలకు పాల్పడిందంటూ 2018లో ఈయూ యాంటీట్రస్ట్​ రెగ్యులేటర్​ 5 బిలియన్ డాలర్ల (సుమారు 35 వేల కోట్లకు పైగా) జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ జరిమానాను సవాలు చేస్తూ లక్సెంబర్గ్​ యూరోపియన్ యూనియన్ జనరల్ కోర్టులో గూగుల్​ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్​​పై మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ సంస్థ​​ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈయూ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ చేసిన ఆరోపణలపై గూగుల్​ గట్టిగానే కౌంటర్​ ఇచ్చింది.

ప్రజలు స్వచ్చందంగా గూగుల్‌ సెర్చ్​ని ఎంచుకున్నారని, అలా చేయమని మేము యూజర్లను బలవంత పెట్టలేదని గూగుల్ వాదించింది. అంతేకాదు, 95 శాతం యూజర్లు ఇతర సెర్చ్ ఇంజిన్‌ల కంటే గూగుల్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని గూగుల్​ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

మరి యాపిల్ సంగతేంటంటున్న గూగుల్​..

గూగుల్ వాదన ఇలా ఉంటే, ఈయూ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ మాత్రం భిన్నంగా వాదిస్తోంది. 2011 నుంచి గూగుల్​ ఆండ్రాయిడ్​ మార్కెటింగ్​లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ విపరీతమైన లాభాలు వెనకేసుకుందని, ఈ క్రమంలో యూజర్ల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లు పేర్కొంది. అందుకే గూగుల్​కు 2017, 2019 మధ్య కాలంలో 8 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. కానీ తాము నైతిక విలువలు పాటించామని, యూజర్లకు, డివైజ్​ మేకర్లకు ఎలాంటి నష్టం చేయకుండానే యాప్​ మార్కెట్​లో టాప్​ పొజిషన్​కు చేరామని గూగుల్​ వెల్లడించింది.

మా నిజాయితీపై అనుమానం వ్యక్తం చేస్తున్న ఈయూ రెగ్యులేటర్​ అథారిటీలు, యాపిల్​ విషయంలో ఎందుకు సైలెంట్​గా ఉన్నాయో చెప్పాలని గూగుల్​ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ప్లే స్టోర్​, యాప్​ మార్కెటింగ్​లోనూ ఆండ్రాయిడ్​ సిస్టమ్​తో పోలిస్తే అన్ని వ్యవహారాల్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్న యాపిల్​కు జరిమానా ఎందుకు విధించలేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈయూ కమిషన్​ తరపు లాయర్​ నికోలస్​ ఖాన్​ స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో యాపిల్​ను లాగడం సరికాదని, ఆండ్రాయిడ్​తో పోలిస్తే యాపిల్​ మార్కెట్​ చాలా తక్కువని చెప్పుకొచ్చాడు. గూగుల్​ సెర్చ్​, యాప్​ స్టోర్​ ఇలా ప్రతిదీ బలవంతపు ఒప్పందాల ద్వారా గూగుల్​ తన యూజర్ల సంఖ్య పెంచుకుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Published by:John Naveen Kora
First published:

Tags: Google, Google search, Microsoft

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు